పసునూరు శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (7), కు → కు (2), గా → గా , పని చేసి → పనిచేసి (2), → (2), using AWB
పంక్తి 38:
'''పసునూరు శ్రీధర్ బాబు''' ప్రముఖ ఆధునిక [[తెలుగు]] కవి. ఆయన తొలి కవితా సంకలనం [[అనేక వచనం]] 2001లో విడుదలైంది. సాహితీ ప్రియుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ కవితా సంపుటికి అజంతా అవార్డు, రంగినేని స్మారక ట్రస్టు పురస్కారరం, సుమనశ్రీ ఉత్తమ కవితా సంపుటి అవార్డులు లభించాయి. 1987 నుంచి వివిధ పత్రికల్లో కవిత్వాన్ని ప్రచురించిన శ్రీధర్ బాబు వృత్తిరీత్యా [[పాత్రికేయుడు]].
==బాల్యం-విద్యాభ్యాసం==
'''పసునూరు శ్రీధర్ బాబు''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[నల్లగొండ]] జిల్లాలోని [[మోత్కూరు]]లో [[1969]], [[జూలై 21]] న జన్మించాడు. ఆయన తండ్రి పసునూరు శ్రీరాములు, తల్లి నర్మదాదేవి. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు, అధ్యాపకులు, [[ప్రొఫెసర్]]గా బాధ్యతలు నిర్వహించారు. తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీధర్ బాబు [[నల్లగొండ]] జిల్లాలోని [[ఉత్తటూరు]], [[మోత్కూరు]] గ్రామాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. [[నల్లగొండ]] పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. నల్లగొండ, [[మహబూబ్ నగర్]], [[మెదక్]] లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదివాడు. [[విశాఖపట్నం]] లోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నాడు. ఆ తరువాత వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (M.C.J) పూర్తి చేశాడు.
 
==వ్యక్తిగత జీవితం==