అందుగుల వెంకయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
 
==కవిపరిచయము==
అందుగుల వెంకయ్య నియోగిబ్రాహ్మణుడు; ''అందుగుల సూరన్న '' కుమారుడు. ఈకవి [[కృష్ణదేవరాయల]] యల్లు డయిన రామరాజు తమ్ముడగు తిరుమలదేవరాయని మనుమని మనుమ డగు ''కోదండరామరాజు '' కాలములోనుండి యాతనిపేర రామరాజీయ మను నామాంతరముగల నరపతివిజయమను గ్రంథమును జేసెను. ఈగ్రంథమునందు రామరాజు పూర్వులయిన నరపతులచరిత్రమును విశేషముగా రామరాజుయొక్క చరిత్రమును జెప్పబడియున్నది. రామరాజు 1568 వ సంవత్సరమున [[తాళికోట]] యుద్ధములో మహమ్మదీయులచేత[[మహమ్మదీయుల]]చేత జంపబడెను. తదనంతరము మూడుతరములు గడచిన తరువాత నీగ్రంథము రచియింపబడిన దగుటచేత, ఇది 1650 వ సంవత్సరప్రాంతమున రచియింపబడినట్టు చెప్పవచ్చును.
 
==రామరాజీయ మను గ్రంధములో విజయనగర రాజ్యాదీశుల చరిత్రను తెలిపే ఈ కవి రచనలు==
రామరాజు గుత్తి, పెనుగొండ, గండికోట, కందమాలు, [ 256 ] ఆదవేని మొదలయిన ప్రదేశములు గెలిచిన ట్లీక్రిందిపద్యమున జెప్పబడినది.
"https://te.wikipedia.org/wiki/అందుగుల_వెంకయ్య" నుండి వెలికితీశారు