నర్రా రాఘవ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==ఉద్యోగాలు==
బొంబాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. చిట్టచివరికి ఊరోళ్ల సాయంతో బట్టల మిల్లులో కార్మికుడుగా చేరారు. కార్మికులకు కనీస హక్కులేని కాలమది. కంపెనీ యాజమాన్యం కార్మికుల కష్టాలు ఆలకించని పరిస్థితులుండేవి. కార్మికుల బాధలు తీర్చడానికి కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా 'లాల్‌బావుటా' బలమైన కార్మిక సంఘంగా పనిచేసేది. అందులో సభ్యుడుగా చేరిన నర్రా చురుకైన పాత్ర పోషించారు. కంపెనీలు మూతపడడం... తన ఊరి నుంచి ఉత్తరం రావడంతో 8 ఏళ్ల తర్వాత నర్రా తిరిగి సొంత ఊరొచ్చాడు. అప్పటికే దొరలు, పెత్తందార్ల ఆగడాలు సాగుతున్నాయి. సర్కార్‌ను వ్యతిరేకించే వారిపై కఠినమైన ఆంక్షలుండేవి. ప్రజల విముక్తి కోసం పోరాడుతున్న భీసం ఎలమంద, కృష్ణమూర్తిల మీద నిషేధాజ్ఞలున్నాయి. బొంబాయిలో[[బొంబాయి]]లో లాల్‌బావుటాలో పనిచేస్తున్న రోజుల్లోనే కమ్యూనిస్టు సిద్ధాంత పరిజ్ఞానాన్ని జీర్ణించుకున్న నర్రా జిల్లాకు వచ్చాక కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. 1949లో వట్టిమర్తి గ్రామంలో యువజన సంఘం స్థాపించి అధ్యక్షులుగా పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ కొరియర్‌గా పనిచేశారు. 1950లో [[కమ్యూనిస్టు పార్టీ]] సభ్యత్వం పొంది గ్రామ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత తాలూకా కమిటీ సభ్యునిగా ఎన్నికై ప్రజల, కార్యకర్తలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. జిల్లాకు వచ్చాక గ్రామాల్లో క్షేత్ర స్థాయి కార్యకర్తగా పనిచేశారు. క్రమశిక్షణ... పట్టుదల... కార్యదక్షత కలిగిన నర్రా సిపిఎంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సర్పంచ్‌ మొదలుకుని శాసన సభసభ్యుని వరకు అనేక పర్యాయాలు గెలుపొంది ప్రజల వాణిని చట్ట సభల్లో వినిపించారు. ప్రజా ఉద్యమ నిర్మాతగా... ప్రజా ప్రతినిధిగా...పాలక వర్గాలకు జంకు పుట్టించారు. శాసనాల రూపకల్పన, వాటి అమలులో జరుగుతోన్న తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులకు దిశా దశ నిర్దేశించిన సందర్భాలనేకం ఉన్నాయి.
 
==ప్రజాసమస్యలపై పోరాటాలు==
రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల, పథకాల రూపకల్పనలో ప్రభుత్వానికి నర్రా పలు సలహాలు... సూచనలు చేసి ప్రజా సంక్షేమానికి పాటుబడ్డారు. బాల్యంలోనే దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్ని ఏకం చేసిన నర్రా చివరి మజిలీలో సైతం ప్రజల పక్షమే వహిస్తున్నారు. రాజీలేని ప్రజా పోరాటాల ద్వారానే దోపిడీ శక్తుల్ని వెనక్కి కొట్టి ప్రజా రాజ్యాన్ని స్థాపించగలమనే విశ్వాసంతో కాలం గడుపుతున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు పై చేయి సాధించిన ప్రస్తుత తరుణంలో మరింత ధృడ సంకల్పంతో కమ్యూనిస్టులు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/నర్రా_రాఘవ_రెడ్డి" నుండి వెలికితీశారు