పత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్, → మార్చి, (2), జులై → జూలై (2), లొ → లో (5), లో → లో (2), కు using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
[[Image:CottonPlant.JPG|thumb|300px|కోతకు తయారుగా వున్న పత్తి.]]
[[Image:Cotton picking in India.jpg|left|thumb|నాగార్జున సాగర్ వద్ద పొలములో పత్తిని సేకరిస్తున్న దృశ్యము]]
ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. నూలును తయారు చేయుటకు ఉపయోగించే 'ప్రత్తి' లేదా '[[పత్తి]]' (దూది) ఈ మొక్కలనుండే లభిస్తుంది. ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది [[అమెరికా]], [[ఆఫ్రికా]] మరియు భారత దేశాలకు చెందిన పొద లాంటి మొక్క. ఇది ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరిగే మొక్క. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి, గుడ్డలు నేయటానికి వాడతారు. ప్రపంచంలో [[గుడ్డలు]] నేయటానికి అత్యధికంగా వాడబడే ప్రకృతి సహజమైన పీచుపదార్థము. ఇలా నేసిన గుడ్డ మృదువుగా, గాలి ఆడేటట్లు ఉంటుంది.
 
=చరిత్ర=
ప్రత్తి మొదటగా 7 వేల సంవత్సరాల క్రితం (క్రీ.పూ.5 మరియు 4 వ శతాబ్దాలలో) సాగు చేయబడింది. అలా సాగు చేసిన వారు భారత ఉపఖండములో నైరుతి భాగాన, అంటే ఇప్పటి [[పాకిస్థాన్]] లోని తూర్పు భాగాలు, భారతదేశంలోని నైరుతి భాగాలలో విలసిల్లిన [[సింధూ నాగరికత]]కు చెందిన వాళ్ళు. అప్పట్లోనే వాళ్ళు ప్రత్తిని గుడ్డలుగా నేయటంలో అద్భుతమైన ప్రతిభగల వాళ్ళు. ఆ విధానాలు భారత దేశం పారిశ్రామీకరించటానికి ముందుదాకా కూడా వాడేవాళ్ళు. వాళ్ళ దగ్గరనుండే ఆ విజ్ఞానం క్రీస్తుపూర్వమే [[మధ్యధరా నాగరికత]]కు, ఇంకా ముందుకు వెళ్ళింది.
 
అరబ్బులకిగాని, గ్రీకులకిగాని ప్రత్తి అంటే ఏమిటో [[అలెగ్జాండరు]] భారతదేశం మీద దండెత్తేదాకా కూడా తెలియదు. [[అలెగ్జాండరు]] సమకాలీనుడైన [[మెగస్తనీసు]], [[సెల్యూకస్]]కు [[భారత దేశం]]లో చెట్లపై ఉన్ని పెరుగుతుంది అని చెప్పినట్లు తన [[ఇండికా]] గ్రంథంలో వ్రాసుకున్నాడు.
 
[[బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా]] 6వ ప్రకరణ ప్రకారం,
"ప్రత్తిని చరిత్ర ముందుకాలం నుండి [[భారత దేశం]]లో వడికే వారు, నేసేవారు, [[రంగులు]] అద్దేవారు. ప్రత్తి [[చైనా]], [[ఈజిప్టు]], భారత దేశాలలోని ప్రజలకు దుస్తులు అందించింది. క్రీస్తుపూర్వానికి కొన్ని వందల ఏళ్ళ ముందే భారతీయులకి ప్రత్తి నుంచి దుస్తులు నేయటంలో అసమానమైన ప్రతిభ ఉండేది. అది వారి నుంచి మధ్యధరా నాగరికతకు వెళ్ళింది. 1వ శతాబ్దంలో అరబ్బు వ్యాపారులు నాణ్యమైన [[మస్లిన్]], [[కాలికొ]] వస్త్రాలని [[స్పెయిన్]] తీసుకు వెళ్ళారు. 9వ శతాబ్దంలో మూర్లు అనబడే అరబ్బు నీగ్రోలు ప్రత్తి సాగు [[స్పెయిన్]] దేశస్థులకి నేర్పారు. ఫస్తియన్ అనే మందపాటి గుడ్డని నేయటం 14వ శతాబ్దంలో ఇటలీ వారికి తెలిసింది. నారతో కలిసిన అట్లాంటి గుడ్డని [[వెనిస్]], [[మిలాన్]] నగరాలలో నేసేవారు.
 
15వ శతాబ్దం పూర్వం అతి కొద్ది నూలు గుడ్డ మాత్రం [[ఇంగ్లాండు]] వెళ్ళేది. అదికూడా కొవ్వొత్తుల వత్తిగా వాడటం కోసం తెప్పించుకునేవారు. కానీ 17వ శతాబ్దానికి [[ఈస్టిండియా కంపెనీ]] భారత దేశం నుంచి అరుదైన నూలు వస్త్రాల్ని ఇంగ్లాండు తేవటం మొదలుపెట్టింది. అమెరికా ఆదివాసులుకి ప్రత్తి వడికి వాటితో దుస్తులు నేయటం, అద్దకం పని చేయటంలో ఎంతో నైపుణ్యం ఉండేది. [[పెరూ]] దేశంలోని సమాధులలో దొరికిన నూలు [[వస్త్రాలు]] 'ఇంకా నాగరికత'కన్నా ముందువని తేలింది. అక్కడ దొరికిన పెరూ, [[మెక్సికో]] వస్త్రాలు రంగులలోగానీ, పనితనంలోగానీ, [[ఈజిప్టు]] సమాధులలో దొరికిన వస్త్రాలలాగా ఉన్నాయి".
 
పౌష్ఠికాహార సర్వస్వం ప్రకారం అమెరికా ఖండంలో మెక్సికోలో 8000 సంవత్సరాలకు పూర్వమే ప్రత్తి సాగుచేయబడింది. వాళ్ళు సాగుచేసిన ప్రత్తి రకం పేరు గాస్సిపియమ్ హిర్సూటం. ఈ రకాన్నే ప్రస్తుతం ప్రపంచమంతా సాగు చేస్తోంది. దాదాపు 90 శాతం సాగులోఉన్న ప్రత్తి ఈ రకమే. కానీ అడవి ప్రత్తి రకాలు చూడాలంటే ఎక్కువ రకాలు మెక్సికోలో, తరువాత [[ఆస్ట్రేలియా]], [[ఆఫ్రికా]]లో చూడవచ్చు. [[ఇరాన్]] లోని ప్రత్తి చరిత్ర చూడాలంటే, క్రీ.పూ.5వ శతాబ్దం అఖాయమెనిద్ శకానికి వెళ్ళాలి. అయినా ప్రత్తి సాగు గురించి గట్టి ఆధారాలు లేవు. ఇరాన్ లోని మెర్వ్, రే, పార్స్ ప్రాంతాల్లో ప్రత్తి పండించేవారని తెలుస్తోంది. పర్షియా కవుల గ్రంథాలలో ప్రత్తిని గురించి ఎన్నో ద్రుష్టాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు [[ఫిరదౌసి]] [[షానామా]]. 13వ శతాబ్దానికి చెందిన [[మార్కోపోలో]] అనే [[స్పెయిన్]] యాత్రికుడు పర్షియా యొక్క గొప్ప ఉత్పత్తుల గురించి వ్రాసుకున్నాడు. వాటిల్లో ప్రత్తిని గురించి కూడా ఉంది. 17వ శతాబ్దంలో పర్షియాని సందర్శించిన జాన్ ఖార్డిన్ అనే ఫ్రెంచి యాత్రికుడు కూడా పర్షియా లోని విస్తారమైన ప్రత్తి పండించే క్షేత్రాల గురించి వ్రాసుకున్నాడు. ప్రత్తి
"https://te.wikipedia.org/wiki/పత్తి" నుండి వెలికితీశారు