జయలలిత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
'''జయలలిత''' (జ.[[ఫిబ్రవరి 24]], [[1948]]-- మ.[[డిసెంబరు 5]], [[2016]]) ప్రముఖ రాజకీయనాయకురాలు మరియు [[తమిళనాడు]] రాష్ట్రానికి మే 2015 నుంచి డిసెంబరు 2016లో మరణించే దాకా ముఖ్యమంత్రిగా పనిచేసింది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. రాజకీయాలలోకి రాకమునుపు [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడ]] భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందె వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది.<ref>http://www.dailymirror.lk/25952/tamil-nadu-chief-minister-jayalalithaa-on-the-warpath-against-sri-lanka-again</ref> తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన [[ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం]] యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను ''పురట్చి తలైవి'' (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు.
 
ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. [[ఎం.జీ.ఆర్]] రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.
 
సెప్టెంబరు 27, 2014 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది.<ref>{{cite web |url=http://www.dnaindia.com/india/report-tamil-nadu-cm-jayalalithaa-disproportionate-assets-case-court-to-deliver-verdict-shortly-2021902 |title=Tamil Nadu CM J Jayalalithaa convicted to 4 years imprisonment in disproportionate assets case|work=[[DNA (newspaper)|DNA]] |date=27 Sep 2014 |accessdate=27 September 2014}}</ref><ref>{{cite news|url=http://www.bbc.com/news/world-asia-india-29390682|accessdate=27 September 2014|publisher=BBC News Online|date=27 September 2014|title=Top India politician Jayalalitha jailed for corruption}}</ref> మే 11, 2015న [[కర్ణాటక]] ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
 
ఆమె 2016, డిసెంబరు 5, రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించింది. అంతకు మునుపు సుమారు రెండున్నర నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉంది. డిసెంబరు 6న అంత్యక్రియలు జరిగాయి.
"https://te.wikipedia.org/wiki/జయలలిత" నుండి వెలికితీశారు