ధూళిపూడి ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరపు → ఐరోపా, లో → లో (5), వున్నారు. → ఉన్నారు. (2), → (3), , → , using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డి.ఎ.'''గా ప్రసిద్ధులైన '''డి.ఆంజనేయులు''' పూర్తి పేరు '''ధూళిపూడి ఆంజనేయులు''' (జ: [[1924]] - మ: [[1998]]) సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు సంపాదకులు. వీరు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, [[యలవర్రు]] లో [[1924]] [[జనవరి 10]] వ తేదీ న జన్మించారు. వీరు [[మద్రాసు]] క్రిస్టియన్ కళాశాలలో ఎం.ఎ.పూర్తిచేసి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. విద్యార్థిదశనుండి ఇంగ్లీషు భాషా సాహిత్యం పట్ల అభిరుచిని పెంచుకున్న వీరు రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా తనను తాను రూపుదిద్దుకున్నారు. ఇంగ్లీషు జర్నలిజంలో బాగా రాణించి పేరుతెచ్చుకున్న తెలుగువారైన [[సి.వై.చింతామణి]], కోటంరాజు రామారావు, కోటంరాజు పున్నయ్య, చలపతిరావు, కుందూరి ఈశ్వరదత్తు, [[ఖాసా సుబ్బారావు]], [[జి.వి.కృపానిధి]], [[సి.వి.హెచ్.రావు]], [[జి.కె.రెడ్డి]], [[ఎ.ఎస్.రామన్]] ల సరసన నిలబడ్డారు.
 
మొదట ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకవర్గంలో 1948లో చేరి 1953లో [[ది హిందూ]] పత్రికలో చేరి అనుభవం సంపాదించిన తర్వాత 1959 లో [[ఆకాశవాణి]] వారి [[వాణి పత్రిక|వాణి]] పత్రిక సంపాదక బాధ్యతలు స్వీకరించారు.
"https://te.wikipedia.org/wiki/ధూళిపూడి_ఆంజనేయులు" నుండి వెలికితీశారు