నాగకేసరి నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
ఈచెట్లు తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమ (western ghats) లు, [[కర్నాటక]], [[కేరళల]]లోని సతతహరిత అడవుల్లో, అలాగే [[అస్సాం]], [[బెంగాల్]], అండమాన్‍దీవులలోని అడవుల్లోను వ్యాప్తి చెందివున్నాయి.దక్షిణ భారతంలోను వీటి వునికి ఉంది.[[తమిళనాడు]]లోని తిరువన్‍మలై అటవీ ప్రాంతంలో పెరియ నుంగు రకం, అలాగే కేరళలోని పాలఘాట్ లోని సైలంట్ వ్యాలిలో వ్యాప్తి చెందివున్నాయి. సముద్రమట్టంనుండి 200 అడగుల ఎత్తు ప్రదేశాల్లొ పెరుగును.
===పూలు-పళ్ళు===
పూలు పుష్పించు కాలం చెట్లు పెరిగే ప్రాంతాన్ని బట్టి మారును.పూలు పూయడం ఫిబ్రవరి-మార్చినెలలలో మొదలై ఎప్రిల్-మే నెలల వరకు కొనసాగును. [[ఫలదీకరణ]] తరువాత పళ్లగా మారుటకు రెండు-మూడు మాసాలు పట్టును. పూలు తెల్లగా, తియ్యటి, కమ్మని వాసన కల్గి 7.5-10 సెం.మీ వ్యాసంతో కొమ్మల చివర ఒంటిగా కాని, లేదా జతగా కాని పుష్పించును.పూలను [[కడుపునొప్పి]], ఆయసం వంటి వాటి నివారణ మందులలో వినియోగుస్తారు. ఎండబెట్టిన పూలను/పూలలోని భాగాలను ఆయుర్వేద మందులతయారిలో ఉపయోగిస్తారు.
కాయలు పళ్ళగా మారడం చెట్లు పెరుగుప్రదేశాన్ని బట్టి మారును. బెంగాల్ లో జూలైనెల మధ్యనుండి సెప్టెంబరు వరకు, అస్సాంలో మే-జులైలో, వ్యానడ్ (కేరళ) లో డెసెంబరు-జనువరిలో, ట్రావెన్‍కూర్ (కేరళ) లోఅక్టొబరు-మార్చి నెలలలో పళ్ళు వచ్చును.పళ్లు ఎర్రగా, దీర్ఘ అండాకారంగా, గుండ్రంగా వుండును.3" (అంగుళాలు) వ్యాసం కల్గివుండును. ఒక్కో పండు 50-60 గ్రాములు వుండును. పెలుసైన గట్టి పెంకును కలిగి వుండును.ఒక పండులో 2-3 గింజలుందును. పై పెంకులో పీచు (Fibre) భాగం 50% వరకుండును.గింజలో విత్తనం (kernel)35% వరకుండును.గింజ పెంకులోపలి విత్తనం పసుపు రంగులో గుండ్రంగా వుండును <ref name="seed"/>.
 
===నూనెను తీయుట===
సాధారణంగా పండి నేల రాలిన పళ్ళను సేకరించడం జరుగుతుంది.సేకరించిన పళ్లను దుడ్డుకర్రవంటి వాటితో బాది/నలగకొట్టి పళ్ళనుండి నూనె గింజలను వేరుచేయుదురు.సేకరించిన నూనె గింజలు పచ్చిగా వుండి తేమ శాతం అధికంగా వుండును.నూనెగింజలను కళ్లంలో ఆరబెట్టిన 50% వరకు బరువు తగ్గును.నిల్వ వుంచునప్పుడు చీడపీడలు ఆశించకుండుటకై 0.1% అల్‍డ్రెక్సు(Aldrex)ను నేలమీద చల్లెదరు.ఆతరువాత0.1%(నిల్వ వుంచిన గింజల పరిమాణంలో)హెక్షడొల్(hexadol)ను గుంజలపై తరచుగా పిచికారి చేయుచుందురు.గింజలపైనున్న పెంకు(shell)ను పొట్టుతొలగించు యంత్రాల (Decorticators)ద్వారా తొలగించి, విత్తా లను నూనెతీయు యంత్రాలలో(expellers)ఆడించి నూనెను తీయుదురు.నూనె బాగా దిగుబి రావటానికి విత్తనాలకు చిట్టూ(హల్లరు తవుడు)ను కలిపి యంత్రాలలో ఆడించెదరు.కేకులో మిగిలివున్న నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంట్ ద్వారా తీయుదురు.
"https://te.wikipedia.org/wiki/నాగకేసరి_నూనె" నుండి వెలికితీశారు