బి. పద్మనాభం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
 
ఆ తర్వాత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకొకవైపు [[సి.ఎస్.ఆర్.]] లాంటివాళ్లతో కలిసి భక్త తుకారాం లాంటి నాటకాల్లో 50, 60 ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. [[ఋష్యేంద్రమణి]] వాళ్ళ ట్రూపులో పాదుకాపట్టాభిషేకం, సతీ సక్కుబాయి, హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ, శ్రీకృష్ణలీలలు, మొదలైన నాటకాల్లో నటించాడు.
==సినిమారంగం==
 
{{main|పద్మనాభం తెలుగు సినిమాల జాబితా}}
===నటగాయకుడిగా===
వాళ్ళు తీసిన "[[పాదుకాపట్టాభిషేకం]]" సినిమాలో కోరస్ లో పాడే అవకాశం వచ్చింది. పద్మనాభం సినిమాల్లో చేరగానే తమ్ముడు ఇంటికి తిరిగివచ్చేశాడు. తర్వాత పద్మనాభం [[మాయలోకం]] సినిమాలో కోరస్ లో పాడడమేగాక ఒక పాత్ర కూడా వేశాడు. ఇది నటుడిగా ఆయన తొలి సినిమా. రెండవ సినిమా [[త్యాగయ్య]]. మూడవ సినిమా [[ముగ్గురు మరాఠీలు]]. ఇక ఆ తర్వాత [[నారద నారది]], [[యోగి వేమన]],...ఇలా అవకాశాలు వరసగా వచ్చాయి. [[రాధిక]](1947)లో కృష్ణ పాత్ర వెయ్యడమే గాక ఒక గోపబాలునికి ప్లేబ్యాక్ పాడాడు. తర్వాత [[భక్త శిరియాళ]]లో చిన్న చిరుతొండడి పాత్ర, [[వింధ్యరాణి]]లో ఇటు నటన-అటు గానం.
 
Line 57 ⟶ 58:
[[షావుకారు]]లో నౌకరు పోలయ్య వేషానికి ముందు బాలకృష్ణను అనుకున్నారు. ఐతే చక్రపాణి "వీడు ముదురుగా ఉన్నాడు. ఇంకెవరూ లేరా?" అని అడగడంతో దర్శకుడు [[ఎల్.వి.ప్రసాద్]] వెంటనే "రాధికలో కృష్ణుడిగా వేసిన పద్మనాభం ఉన్నాడు." అని పిలిపించి వేషం ఇప్పించారు. [[పాతాళభైరవి]] స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కె.వి.రెడ్డి తోటరాముడిగా [[రాజారెడ్డి]], మాంత్రికుడిగా [[ముక్కామల కృష్ణమూర్తి|ముక్కామల]] అనుకున్నాడు. షావుకారు రషెస్ చూసిన వెంటనే మనసు మార్చుకుని హీరోగా [[ఎన్.టి.ఆర్.]], మాంత్రికుడిగా [[ఎస్.వి. రంగారావు|ఎస్.వి.ఆర్.]], అంజిగా బాలకృష్ణ (పాతాళభైరవితో ఇతడి అసలు పేరు మరుగునపడిపోయి అంజి(గాడు)గానే ప్రసిద్ధి పొందాడు), సదాజపుడిగా పద్మనాభం లను ఖరారు చేసుకుని విజయావారి పర్మనెంటు ఆర్టిస్టులుగా మూడేళ్ళ అగ్రిమెంటు తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పాతాళభైరవితో బాటు విజయావారి తర్వాతి చిత్రాలైన పెళ్లిచేసిచూడు, చంద్రహారం లలో నటించాడు. అదే సమయంలో గుబ్బి ప్రొడక్షన్స్ శ్రీకాళహస్తి మహాత్మ్యం లో కాశి వేషం వేశాడు. 1954లో వచ్చిన సతి అనసూయతో మొదలుపెట్టి [[కృష్ణప్రేమ]],[[ సతీ సుకన్య]], [[కృష్ణలీలలు (1959)|కృష్ణలీలలు]], [[శ్రీరామకథ]], [[సతీ తులసి (1959 సినిమా)|సతీ తులసి]], [[ప్రమీలార్జునీయం]] లలో నారదుడిగా వేశాడు.
 
===నిర్మాతగా===
1964 సంవత్సరంలో [[రేఖా అండ్ మురళి ఆర్ట్స్]] పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి [[దేవత]], [[పొట్టి ప్లీడర్]], [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] నిర్మించారు. మర్యాద రామన్నతోనే [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] గాయకుడిగా తొలిసారి పరిచయం చేశారు. 1968లో [[శ్రీరామకథ]] నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. 1970లో [[కథానాయిక మొల్ల]] తీసి బంగారు నంది అవార్డు పొందారు.
 
===దర్శకుడిగా===
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/బి._పద్మనాభం" నుండి వెలికితీశారు