తేళ్ల లక్ష్మీకాంతమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక, ఉన్నది. → ఉంది., , → , using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
'''తేళ్ల లక్ష్మీకాంతమ్మ''' ([[జూలై 16]], [[1924]] - [[డిసెంబర్ 13]], [[2007]]) [[ఖమ్మం జిల్లా]]కు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, [[భారత జాతీయ కాంగ్రేసు]] నాయకురాలు మరియు [[పార్లమెంటు]] సభ్యురాలు. ప్రముఖ తెలుగు పాప్ సింగర్ [[స్మిత]] ఆమె మనవరాలే.<ref name=lax1>http://thatstelugu.oneindia.mobi/news/2007/12/13/1660.html</ref> లక్ష్మీకాంతమ్మ [[1924]], [[జూలై 16]]న జన్మించింది. ఈమె స్వస్థలం [[మహబూబ్‌నగర్ జిల్లా]]లోని [[ఆలంపూర్]]. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము]] నుండి ఆర్థిక శాస్త్రములో ఎం.ఏ పట్టా పొందిన లక్ష్మీకాంతమ్మ టి.వి.సుబ్బారావును వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు.
 
లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నుండి 1957లో [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత 1962లో [[ఖమ్మం లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడు సార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు లోక్‌సభలో ఖమ్మంకు[[ఖమ్మం]]కు ప్రాతినిధ్యం వహించింది. 1967లో పార్లమెంటు బృందంలో సదస్యురాలిగా ఆస్ట్రేలియాను పర్యటించింది. 1978లో [[జనతా పార్టీ]] తరఫున [[హైదరాబాదు]] నగరంలోని [[హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం]] నుండి గెలుపొందింది.<ref>తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.286</ref>
 
పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా<ref>[http://books.google.com/books?id=_5oaAAAAIAAJ&pg=PP11&dq=T+lakshmikanthamma&lr=&client=firefox-a#PPP11,M1 Report By India Parliament. Lok Sabha. Committee on Petitions, India]</ref> ఉన్న లక్ష్మీకాంతమ్మ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ వైఖరిని బహిరంగంగా విమర్శించి ఆమె ఆ కాలంలో వార్తలకు ఎక్కింది. ఇందిరాగాంధీ పాలనను తీవ్రంగా నిరసించి జనతాపార్టీలో చేరింది. [[జనతా పార్టీ]] ఏర్పాటులో కీలకపాత్ర పోషించి, <ref>[http://books.google.com/books?id=BgUE24CubJcC&pg=PA231&dq=T+lakshmikantamma&lr=&client=firefox-a&sig=ACfU3U3IOJpbtL1yGkFfIRDw-D83oFhJ7w#PPA231,M1 Encyclopaedia of Political Parties By Ralhan, O. P]</ref> పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన లక్ష్మీకాంతమ్మ, 1978 శాసనసభా ఎన్నికలలో ఓటమి తర్వాత, వృద్ధాప్యం వల్ల చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంది.<ref>[http://in.telugu.yahoo.com/News/Regional/0712/13/1071213058_1.htm మాజీ ఎంపీ తేళ్ల లక్ష్మీకాంతమ్మ కన్నుమూత - యాహూ తెలుగు వార్త]</ref> ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరింది.
లక్ష్మీకాంతమ్మ, మాజీ ప్రధాని [[పి.వి.నరసింహారావు]]కు సన్నిహితురాలు.<ref name=lax1/> నరసింహారావు రచించిన ఆత్మకథా ఆధారిత నవల ''ది ఇన్‌సైడర్‌''లోని అరుణ పాత్రకు స్ఫూర్తి లక్ష్మీకాంతమ్మేనని భావిస్తున్నారు.<ref>http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19980420/11050834.html</ref> ఈమె తెలుగులో ప్రగతి పథంలో మహిళలు అనే పుస్తకాన్ని, ఆంగ్లంలో కో-ఆపరేషన్ టుడే అండ్ టుమారో అనే పుస్తకాల్ని ప్రచురించారు. బాద్షాఖాన్ జీవితచరిత్రను తెలుగులోకి అనువదించింది.