రబ్బరుగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
రబ్బరువిత్తనాల నుండి నూనెను రోటరి మిల్లులు, స్క్రూప్రెస్ (ఎక్సుపెల్లరు) ల ద్వారా నూనెను తీయుదురు<ref>{{citeweb|url=https://www.google.co.in/search?q=oil+expellers&espv=2&biw=1366&bih=600&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=aIH5VPWOONHnuQTRkoH4Aw&ved=0CBwQsAQ|title=Images|publisher=google.co.in|date=|accessdate=2015-03-06}}</ref> . సాల్వెంట్‌ ప్లాంట్ ద్వారా ఎక్కువనూనెను విత్తనాల నుండి పొందు అవకాశం వున్నను, ఇండియాలో సాల్వెంట్‌ ప్లాంట్ ద్వారా నూనెను తీస్తున్నట్లు వివరాలు లభ్యం కాలేదు<ref>{{citeweb|url=http://www.inderscience.com/info/inarticle.php?artid=30686|title=Solvent extraction and characterisation of rubber seed oil|publisher=inderscience.com|date=|accessdate=2015-03-06}}</ref>.
రబ్బరుతోటలసాగు కేరళలో అధికంగా వున్నప్పటికి, రబ్బరువిత్తనాల నుండి నూనెతీయు పరిశ్రమలు మాత్రం [[తమిళనాడు]]లో ఉన్నాయి. తమిళనాడులోనితమిళనాడు లోని అరుపుకొట్టాయ్‌, థెంగాసి, మరియు నాగర్‌కోయిల్‌లో అధికంగా రబ్బరువిత్తనాలనుండి నూనెతీయు పరిశ్రమలున్నాయి. యిందుకుకారణం కేరళలో విత్తనదిగుబడి సమయంలో అక్కడ వర్షంఎక్కువగా పడుతుండటం మరియు వాతావరణంలో తేమఅధికంగా వుండటం వలన విత్తనంనెమ్ము ఎక్కె అవకాశం ఉంది. అదే సమయంలో తమిళనాడులో వాతావరణ అనుకూలంగా వుండటం వలన నూనెతీయు పరిశ్రమలు అక్కడ అభివృద్ధిచెందాయి.
 
తాజాగా సేకరించిన విత్తనాలలో తేమశాతం 25 % వరకు వుండును. విత్తనాలను కళ్లంలో ఆరబెట్టి తేమ శాతాన్ని 6-8 %కు తగ్గించెదరు. కొన్నిపరిశ్రమలో 'రోటరొ డ్రయరు 'ద్వారా తేమను తగ్గించెదరు, గాలిని 60-70<sup>0</sup>C వరకు వేడిచేసి రొటరి డ్రమ్‌కు పంపి విత్తనాలను వేడిచేసి విత్తనాలలోని తేమను తగ్గించెదరు. ఎక్కువ వుష్ణొగ్రత కారణంగా ఉత్పత్తి అగునూనె రంగు పెరుగును. అందుచే 60-70<sup>0</sup>C వరకు మాత్రమే వేడిచేసిన గాలిని పంపెదరు. చిన్న కెపాసిటివున్న పరిశ్రమలో విత్తనాలను కళ్లంలో ఎండలో ఆరబెట్టెదరు. తేమ శాతాన్ని 6-8% వరకు వున్న రబ్బరు విత్తనాలను మొదట జల్లెడ (screener) లో జల్లించి మట్టి పెళ్లలు, చిన్నచిన్నరాళ్ళు, పుల్లలవంటి వాటిని తొలగించెదరు.
 
జల్లించిన విత్తనాలను హెమరుమిల్లు ద్వారా చిన్నముక్కలుగా చెయ్యుదురు. చిన్నముక్కలుగా చెయ్యడంవలన నూనెతీయడం సులువుగా వుండును. ముక్కలుగా చేసిన తరువాత 'కండిసనరు' అనే యంత్రంలో విత్తన ముక్కలను స్టీము ద్వారా 60-70% వరకు వేడిచేయుదురు. ఇలా చెయ్యడం వలన విత్తన కణాలలోవున్న నూనె ద్రవీకరణ చెంది, కణపొరలవెలుపలి వైపుకు వచ్చును. కండిసను చేసిన విత్తనాలను ఎక్సుపెల్లరుకు పంపి అధిక వత్తిడిలో క్రష్‌ చేసి నూనెను తీయుదురు. నూనెతీయుటకునూనె తీయుటకు వాడిన ఎక్సుపెల్లరు కేపాసిటిని బట్టి కేకులో6-8% వరకు నూనె కేకులో మిగి లుండును.
 
రోటరి మిల్లులో తీసిన రబ్బరు విత్తన కేకులో 15-16% వరకు నూనె మిగిలివుండును. రోటరిద్వారా నూనెను తీయునప్పుడు 'మొలాసిస్'ను కలిపి విత్తనాలను క్రష్‌ చేయుదురు. మొలాసిస్ విత్తనాలను దగ్గరిగా పట్టివుంచి నూనె త్వరగా దిగునట్లు చెయ్యును. రబ్బరు విత్తననూనె చెక్కను (oil cake) ను తక్కువ మొత్తంలో పశువుల దాణా (live stock feed) గా వినియోగిస్తారు. మిగిలినది సేంద్రియ ఎరువుగా పంటపొలాలలో వాడెదరు.రబ్బరువిత్తనాలో సైనొజెన్‌టిక్ గ్లుకొస్ cyanogentic Glucose)ను కల్లివుంది. సైనొజెన్‌టిక్ గ్లూకొస్‌, లిపేజ్ ఎంజైమ్ చర్యవలన హైడ్రొసైనిక్‌ ఆమ్లంగా మారును. హైడ్రొసైనిక్‌ ఆమ్లం, విషగుణాలు కల్గివున్నది. అందుచే దాణాగా వాడుటకు కొంచెం సందేహపడు తున్నారు. అయితే రెండు నెలల వరకు 6.0% తేమ వద్ద నిల్వ వుంచిన విత్తనాలలో సైనొటిక్‌ గ్లూకొస్‌ శాతం గణనీయంగా తగ్గినట్లు గమనించారు. ఇటువంటి విత్తనాల నుండి వచ్చిన కేకును పశువుల దాణాగా వాడవచ్చును.
"https://te.wikipedia.org/wiki/రబ్బరుగింజల_నూనె" నుండి వెలికితీశారు