మకర సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 45:
[[దస్త్రం:Bhogi_Mantalu.jpg|right|thumb|భోగి మంటలు]]
[[దస్త్రం:Sankranthi.JPG|right|thumb|భోగి మంటలు]]
[[ఇలియడ్|ఇది]] సాధారణంగా [[జనవరి 14]]న జరుపుతారు. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి [[భోగి మంటలు]] వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే [[చలి]] పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత [[చీపురు|చీపుర్లూ]], [[తట్ట]]లూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున [[భోగి మంటలు]] వెలిగిస్తారు.
 
సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు [[బొమ్మల కొలువు]]ను ఏర్పాటు చేస్తారు.దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది [[భోగి]] పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, [[రేగు|రేగిపళ్ళు]], [[శనగలు]],[[పూలు]], [[చెరుకు]]గడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి [[దిష్టి]] తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి [[తాంబూలం|తాంబూలాలతో]] పాటు [[పట్టు]]బట్టలు, [[పసుపు]], [[కుంకుమ]]లు పెట్టడం ఆనవాయితీ.
"https://te.wikipedia.org/wiki/మకర_సంక్రాంతి" నుండి వెలికితీశారు