స్వలింగ సంపర్కం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
 
==స్వలింగ వివాహాలు==
స్వలింగ సంపర్కుల మధ్య పెళ్ళిళ్లను చట్టబద్ధం చేసిన తొలి దేశం డెన్మార్క్. 2001లో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉరుగ్వే, [[న్యూజీలాండ్]], [[నెదర్లాండ్స్]], [[స్పెయిన్]], [[కెనడా]], దక్షిణాఫ్రికా, [[స్వీడన్]], [[నార్వే]], [[పోర్చుగల్]], [[ఫ్రాన్స్]], [[బ్రెజిల్]], [[బెల్జియం]], ఐస్‌ల్యాండ్, [[అర్జెంటీనా]] వంటి దేశాలు స్వలింగ సంపర్కుల మధ్య పెళ్ళిళ్లను చట్టబద్ధం చేశాయి. ఈ ఏడాదే బ్రిటన్ ఆమోదం తెలిపింది. అయితే చర్చి అధికారులను మాత్రం చట్టం నుంచి మినహాయించారు. న్యూజీలాండ్‌లో విదేశీయులు కూడా పెళ్ళి చేసుకునే వెసులుబాటు ఉంది. ఉరుగ్వేలో మామూలు పెళ్ళికి[[పెళ్ళి]]కి, స్వలింగ సంపర్కుల పెళ్ళికి ఒకే విధమైన నిబంధనలను రూపొందించారు. అయితే 12.12.2013 న ఆస్ట్రేలియాలో గే వివాహం చట్టం రద్దు చేస్తూ ఆస్టేలియా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఫ్రాన్స్‌లో స్వలింగ సంపర్క దంపతులు పిల్లలను దత్తత తీసుకోడానికి అనుమతిస్తూ చట్టం ఉంది. 377 నిబంధన కేవలం స్వలింగ సంపర్కులకే కాదు దీని ప్రకారం గుద [[సంభోగం]], అంగచూషణం, జంతువులతో సంభోగం.. అన్నీ నిషిద్ధాలే. పునరుత్పత్తికి దోహదం చెయ్యని ఏ రకమైన లైంగిక క్రియ అయినా ఈ నిబంధన ప్రకారం శిక్షార్హమే. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని సెక్స్‌ వర్కర్లనూ, స్వలింగ సంపర్కులనూ వేధించే పనీ దేశంలో నిరాఘాటంగా సాగిపోతోందని, కాబట్టి ఈ నిబంధనను తొలగించటం చాలా అవసరమని 'హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌' వంటి సంస్థలు ఉద్యమాలు ఆరంభించాయి. ముఖ్యంగా దేశంలో హిజ్రాలపై వేధింపులు ఎక్కువయ్యాయనీ, వారికి కనీస మానవ హక్కులు కూడా దక్కటం లేదని, హక్కుల సంస్థలు వాదించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ నిబంధనపై చర్చ వూపందుకుంది. దీన్ని తొలగించటం అవసరమని, అప్పుడే తమకు సామాజిక గుర్తింపు, సమర్థన లభిస్తుందని, తమపై వేధింపులు తగ్గుతాయని స్వలింగ, ద్విలింగ సంపర్కులూ, హిజ్రాలూ (లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌-ఎల్‌జీబీటీ) బహిరంగంగా డిమాండు చేయటం ఆరంభించారు.
 
== మతాలు ఏమంటున్నాయి ==
"https://te.wikipedia.org/wiki/స్వలింగ_సంపర్కం" నుండి వెలికితీశారు