అనుపమ్ ఖేర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
[[సిమ్లా]]లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అనుపమ్‌ ఖేర్‌, [[పద్మభూషణ్‌]] పురస్కారాన్ని సాధించే స్థాయికి ఎదిగిన క్రమం స్ఫూర్తిదాయకం. రంగస్థల నటుడిగా మొదలై వెండితెరకు చేరిన ఆయన ప్రయాణంలో హాస్యనటుడు, సహాయ నటుడు, ప్రతినాయకుడు, దర్శకుడు, నిర్మాత, నటశిక్షకుడు ఇలా భిన్న పాత్రల్ని సమర్థవంతంగా పోషించాడు.
 
అనుపమ్‌ ఖేర్‌ కళాశాల విద్యార్థిగానే [[హిమాచల్‌ ప్రదేశ్‌హిమాచల్‌ప్రదేశ్‌]] యూరివర్సిటీలో విరివిగా నాటకాల్లో నటించాడు. నటనను వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకుని [[నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా]]లో చేరాడు. అనంతర కాలంలో అదే సంస్థకు అధ్యక్షుడి హోదాలో సేవలందించడం విశేషం. సినిమా అవకాశాల కోసం [[ముంబయి]] వచ్చిన తొలిరోజుల్లో ఎన్నో రాత్రులు రైల్వే స్టేషన్‌లోనే నిద్రించిన సందర్భాలు ఉన్నాయి. '''ఆగమన్ ''' ’లో తొలి అవకాశాన్ని అందుకుని రెండో చిత్రం '''సారంశ్‌ ''' తోనే ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అందుకున్నాడు.
 
[[హిందీ]], [[మరాఠీ]], [[పంజాబీ]], [[మలయాళ]], [[తమిళ]] చిత్రాల్లోనూ నటించాడు. [[హాలీవుడ్‌]]లోహాలీవుడ్‌లో బెండ్‌ ఇట్‌ లైక్‌ బెక్‌హామ్‌, బ్రైడ్‌ అండ్‌ ప్రిజ్యూడిస్‌ చిత్రాల్లో నటించాడు. '''ఓమ్‌ జై జగదీశ్‌ ''' తో దర్శకుడిగా మారాడు. '''మైనే గాంధీ కో నహీ మారా ''', '''డాడీ ''' చిత్రాలకుగాను జాతీయ పురస్కారం అందుకున్నాడు. [[ఫిలింఫేర్‌]] పురస్కారాల్లో 14 నామినేషన్లు అందుకుని 8 సార్లు పురస్కారాలు గెలుచుకున్నాడు.
<ref name="అనుపమాన ప్రతిభాశాలి ">{{cite web|url=http://www.eenadu.net/telugumovies/cinemanews.aspx?item=cinema&no=11|title=అనుపమాన ప్రతిభాశాలి |publisher=[[ఈనాడు]]|date= 2016-1-26|accessdate=2016-1-26}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/అనుపమ్_ఖేర్" నుండి వెలికితీశారు