కోరాడ రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
==జీవిత విశేషాలు==
ఈయన 1816లో [[అమలాపురం]] తాలూకాలోని [[కేశనకుఱ్ఱు]] గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు లక్ష్మణశాస్త్రి. ఈయన నివాసమున్నది [[బందరు]]లో. [[జూన్ 6]] [[1897]] <ref>[రంగస్థల కరదీపిక-కంపా చెన్నకేశవరావు, శ్రీ [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతెలుగువిశ్వవిద్యాలయం]] ప్రచురణ]</ref> నిర్యాణం చెందారు. ఈయన చాలా మంచి కవి అని మిత్త్రులు వివాహార్థ మెచ్చరించిరట. ఆసమయమున చిరపరిచయులగు శిష్టుకవిగారు [[రామచంద్రపురము]] రాజుగారికి "ఇతని నాస్థాన పండితునిగా గౌరవింపు" డని ఉత్తరము వ్రాసి ఇవ్వగా వారు దేశమున క్షామము వలన నీకవిని రెండు నెలలకంటే నెక్కువ పోషింపలేమని చెప్పిరట. ఆమాట రామచంద్రశాస్త్రికి నచ్చలేదు. [[మదరాసు]] పోయి యేదో యుద్యోగము సంపాదించుటకు సంకల్పించి ప్రయాణము సాగించెను. త్రోవలో [[మచిలీపట్టణము]]న ఆగవలసివచ్చి [[ఇంగువ రామస్వామి శాస్త్రి]] గారియొద్ద మంత్ర శాస్త్రమభ్యసించెను. అప్పుడు వఠ్ఠెం అద్యైత పరబ్రహ్మశాస్త్రి పాండిత్యశక్తి పరీక్షకు వాక్యార్దము చేయగా నందాయనను ధిక్కరించి పెండ్లిచెడదీసికొని యింటికి బోయెను. ఆయన స్వస్థలము [[నడవపల్లి]]. ఆయూరివారు రామచంద్రశాస్త్రి సామర్ద్యము పరీక్షించుటకు శతావధానము చేయమనిరి. మహాకవితాధార కలిగిన వీరి కదియొక లెక్కా ! పద్యములు తడువుకొనకుండ నవధానమున జెప్పెనట. ఆపద్యములు మాత్ర మనుపలబ్ధములు.
 
క్రమముగా శాస్రిగారి పాండితీకవితా ప్రతిభలు నుతికెక్కినవి. [[బందరు]] నోబిలునోబిల్ పాఠశాలలో నుద్యోగము లబించినది. అక్కడ 43 వత్సరములు పనిచేసిరి. దొరలు వీరి నైష్టికతకు నివ్వెఱపోయెడివారు. ఇత డెవ్వరిని లెక్కసేయలేదు. ఉద్యోగించిన నలువది మూడేండ్లలో ' ఈతప్పుచేసితి ' వని యధ్యక్షునిచే నాక్షేపింపబడలేదు. కళాశాలధ్యక్షుకు నీయనకు నొక శ్లోకార్దములో వ్యతిరేకాభిప్రాయములు వచ్చినవి. శాస్త్రులుగారు ముక్తకంఠమున "మీయర్ధము పొరపా"టని త్రోసివైచిరి. తాత్కాలికముగా అధికారికి క్రోధావేశము కలిగినను శాస్త్రులు గారి యధార్ధవాదిత కాయన తలయొగ్గక తప్పినదికాదు. వెనుక శ్రీ [[వీరేశలింగం పంతులుగారుపంతులు]]గారు రాజమహేంద్రవరమున[[రాజమహేంద్రవరము]]న ఆర్ట్సు కాలేజిలో తెలుగు పండితులు నుండునపుడు [[కస్తూరి శివశంకర శాస్త్రి]] గారిది సంస్కృతపండిత స్థానము. శాస్త్రిగారు పరీక్షాపత్రము సెస్సగా వ్రాసినవారికి నూటికి నూటపది మార్కులు వేయుచుండువారట. ప్రిన్సిపాలు ఇదేమి పాపమని యడుగగా, ఆ విద్యార్థి పుణ్యమని నిరంకుశముగా సమాధానించుచుండు వారట. మన రామచంద్ర శాస్రిగారి నైరంకుశ్య మాతీరులోనిదే.
 
[[మాడభూషి వేంకటాచార్యులు]] మన శాస్త్రిగారి ప్రతిభ నెరుంగదలచి "శ్లో. చింతకాయ కలేకాయ బీరకాయ తమారికే, ఉచ్చింతకాయ వాక్కాయ సాధకాయ తమాంజలిమ్" అని యొక శ్లోకము వ్రాసి శిష్యున కిచ్చి రామచంద్ర శాస్త్రి వీని కర్ధ మెట్లు చెప్పునో కనుగొని రమ్మనెనట. అంతట శాస్త్రులుగారు దాని కర్ధము చెప్పుటయేగాక మాకి రెండు గడ్డు శ్లోకములు వ్రాసి యాచార్యులు గారికి బంపి నిరుత్తరులను జేసిరని వదంతి.
 
ఈయన సంస్కృతాంధ్రములలో[[సంస్కృతాంధ్రము]]లలో చాలా కృతులు రచించెను. పండ్రెండవ యేటనే ఉపదేశము పొందెను. 'దేవివిజయము', కుమారోదయము' అను గ్రంధములు వీరి యుపదేశ విషయమును స్పుటీకరించును. 1860 ప్రాంతమున మంజరీమధుకరీయ నాటకము సంఘటించిరి. ఈనాటకమునకు ముందు దెలుగున ఎలకూచి బాలసరస్వతి విరచితమగు 'రంగకౌముది' నాటకమున్నట్లు వినుకలి. మంజరీమధుకరీయములోని కథ కల్పితము. ఇది రంగమున కననుకూలము.
 
==రచనలు==