కొండవీటి వెంకటకవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నెహ్రు → నెహ్రూ , లను గురించి → ల గురించి (3), షష్ఠి పూర్ using AWB
పంక్తి 13:
[[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] వీరిని '[[కళా ప్రపూర్ణ]]' పురస్కారంతో గౌరవించింది. 1953 జనవరిలో కవిరాజు అనే బిరుదును కూడా పొందాడు. ప్రసిద్ధ కార్టూనిస్టు శ్రీధర్ ఈయన గురించి సోక్రటీసులాగా తన ప్రపంచంతప్ప మరోటి తెలియని వారు, అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి అన్నారు. కవులైనవారు మానవులందర్నీ ఏకం చేసేలా, వారిని సంఘటితపరచి వారిలో సౌభ్రాతృత్వం పెరిగేలా చేయాలి. ప్రజల్ని విడదీసేలా రచనలు చేయకూడదు... అంటూ ఆయన విభజనతత్వాన్ని ఆనాడే ఖండించారు.
 
పెళ్ళికాక పూర్వం అచల మతంలో దిగంబరిగా వూళ్ళు తిరిగాడు. 1945 ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ఒక్కొక్క బాబాగురించి వివరాలు తెప్పించి, వాస్తవాలే సన్మాన పత్రంగా సమర్పించారట. ఏ బాబా ఎలాంటి వాడు, ఆయన పూర్వాపరాలు ఏమిటి లాంటివి. [[వసుచరిత్ర]] అవలీలగా పాడి వినిపించేవాడు. [[భట్టుమూర్తి]] అంటే ఆయనకు విపరీత ప్రేమాభిమానం. వెంకటకవికి ఇంగ్లీషు రాదు. [[అష్టావధానం|అష్టావధానాలు]] చేశాడు. [[భువన విజయం|భువన విజయాలలో]] పాల్గొన్నాడు. లౌకిక వివాహాలు చేయించాడు; అంటే మంత్రాలు లేకుండా, [[త్రిపురనేని రామస్వామి]] రాసిన పెళ్ళి సూత్రాలు చదివించి, వివాహాలు జరిపించడం. ఇలా ఆవుల మంజులత గారి పెళ్ళి, [[హైదరాబాదు ఎగ్జిబిషన్]] మైదానంలో జరిపించారు. ఆయన [[పురోహితుడు]]. [[ఇన్నయ్య]] తోటి పురోహితుడు.
 
కొండవీటి వెంకటకవి హాస్యప్రియుడు. తన షష్టిపూర్తి రాబోతున్నదనీ, తానేమంతగా ఆశించడం లేదనీ, ఎందుకైనా మంచిదని ముందుగా చెబుతున్నాననేవాడు. తనకు పెద్దగా కోరికలు లేవనీ, ఏనుగుపై వూరేగించి, కాలుకు [[గండ పెండేరం]] (రత్నాలు బంగారం అయితే సరేసరి, లేకుంటే చత్తతోడా (గడ్డితో చేసిన కడియం) అయినా సరే అనేవాడు.
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_వెంకటకవి" నుండి వెలికితీశారు