పారుపల్లి రామక్రిష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==గురు పరంపర==
త్యాగరాజు ఒక గొప్ప కర్నాటక సంగీత విద్యాంసుడు. ఆయన తన జీవితంలో సింహభాగం తమిళనాడులో తంజావూరు జిల్లానందు నివసించి అనేకమంది మహావిధ్వాంసులకు సంగీత శిక్షణనిచ్చి 1847 వ సంవత్సరంలో పరమపదించారు. అట్టివారిలో వారి జ్ఞాతి ఆకుమళ్ళ (మనంబుచావడి) వెంకటసుబ్బయ్య కూడా ఒకరు. వెంకటసుబ్బయ్య కూడా తన జీవితకాలంలో అనేక మంది శిష్యులను ఆకర్షించి సంగీతశిక్షణనిచ్చారు. వారిలో [[సుసర్ల దక్షిణామూర్తి]] శాస్త్రి (1860-1917) ఒకరు. శాస్త్రిగారి సంగీతానురక్తి ఆయన్ని స్వస్థలమైన [[కృష్ణా జిల్లా]] నుండి తమిళనాడు కాలినడక ప్రయాణం చేయించింది. వెంకటసుబ్బయ్య వద్ద సంగీతం నేర్చుకున్న సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. త్యాగరాజు సంగీత పరంపరను ఆంధ్ర ప్రాంతానికి పరిచయంచేసిన శాస్త్రిగారి వలన చాలామంది విద్యార్థులు లభ్ది పొందారు. నేడు [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] యొక్క గురువుగా పేరుగాంచిన ప్రముఖ గాత్రవిధ్వాంసుడైన పారుపల్లి రామక్రిష్ణయ్య (1883-1951) ఒకరు.
 
==జీవిత సంగ్రహం==