తిరుపతి వేంకట కవులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
}}
 
వీరిద్దరు ఇంచుమించుగా వంద [[సంస్కృత]] మరియు [[తెలుగు]] గ్రంథాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. [[అవధానము (సాహిత్యం)|అవధానాల్లో]] వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో [[పాండవ ఉద్యోగ విజయములు]] నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి.
*''బావా ఎప్పుడు వచ్చితీవు..'',
*''చెల్లియో చెల్లకో..'',
పంక్తి 35:
 
==దివాకర్ల తిరుపతి శాస్త్రి==
[[దివాకర్ల తిరుపతి శాస్త్రి]] [[ప్రజోత్పత్తి]] సంవత్సర [[ఫాల్గుణ శుద్ధ దశమి]] బుధవారం అనగా [[1872]] [[మార్చి 26]]న [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[భీమవరం]] వద్ద [[యండగండి]] గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకటావధాని కూడా గొప్ప [[వేదపండితుడు]], సూర్యోపాసకుడు. [[తిరుపతి శాస్త్రి]] విద్యాభ్యాసం బూర్ల సుబ్బారాయుడు, గరిమెళ్ళ లింగయ్య, పమ్మి పేరిశాస్త్రి, చర్ల బ్రహ్మయ్య శాస్త్రిల వద్ద సాగింది. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చదువుకునే సమయంలో తిరుపతి శాస్త్రికి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తోడయ్యాడు. 1898లో తిరుపతి శాస్త్రి [[వివాహం]] జరిగింది.
 
[[మధుమేహం]] వ్యాధి కారణంగా ఆయన 1920 నవంబరులో మరణించాడు.
పంక్తి 42:
{{main|చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి}}
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి [[ప్రమోదూత]] సంవత్సర [[శ్రావణ శుద్ధ ద్వాదశి]] సోమవారం అనగా [[1870]] [[ఆగస్టు 8]]న [[తూర్పు గోదావరి]] జిల్లా [[కడియం]] గ్రామంలో జన్మించాడు. ఆయన ముత్తాత తమ్ముడు [[వేంకటేశ్వర విలాసము]], [[యామినీ పూర్ణతిలక విలాసము]] అనే మహాద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉన్నాయి.
తరువాత వారు [[యానాం]]కు మకాం మార్చారు. యానాంలో వేంకట శాస్త్రి తెలుగు, [[ఆంగ్లం]], [[సంస్కృతం]] భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.
 
18 ఏండ్ల వయసులో యానాం [[వేంకటేశ్వర స్వామి]] గురించి వ్రాసిన శతకంలో వ్యాకరణ దోషాల గురించి స్థానిక పండితులు విమర్శించారు. అది అవమానంగా భావించిన వేంకటశాస్త్రి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడానికి [[వారాణసి]] వెళ్ళాలని నిశ్చయించుకొన్నాడు. కాని ఆర్థికమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పై ఆయనకు పుట్టుకనుండి ఒక కన్నుకు సంబంధించిన సమస్య ఉండేది.