గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
==రచనలు==
[[1921]] లో గరిమెళ్ళ ' స్వరాజ్య గీతములు ' పుస్తకం వెలువడింది. 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు , బాలగీతాలు మొదలైన రచనలు వెలువడ్డాయి. గరిమెళ్ళ చాలాసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలులో వుండగా తమిళ, కన్నడ భాషలు నేర్చుకున్నాడు. తమిళ, కన్నడ గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ కొన్ని రచనలు చేశాడు. ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. [[భోగరాజు పట్టాభిసీతారామయ్య]] ఆంగ్లంలో వ్రాసిన ' ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా' అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు.
గరిమెళ్ళ జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నాడు. అక్కడ [[గృహలక్ష్మి]] పత్రిక సంపాదకుడుగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తరువాత అక్కడ మానివేసి ఆచార్య రంగా [[వాహిని]] పత్రికలో సహాయ సంపాదకుడుగా చేరాడు. కొద్ది రోజులతర్వాత ఆంధ్రప్రభలో చేరాడు. కొంతకాలం [[ఆనందవాణి]]కి సంపాదకుడుగా పనిచేశాడు. కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‍గా జీవనం సాగించాడు.
 
==చివరిదశ==
గరిమెళ్ళ పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో [[దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు]] కొంత సహాయ పడ్డాడు. [[వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు]] ప్రతినెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు. వివిధ పత్రికలకు, ఆల్ ఇండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగ దెబ్బతీశాయి. చివరిదశలో ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యాచన మీద బ్రతికాడు.