దూకుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎కథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నియోజికవర్గం → నియోజకవర్గం using AWB
పంక్తి 28:
 
==కథ==
శంకరన్నగా పిలవబడే శంకర్ నారాయణ ([[ప్రకాష్ రాజ్]]) సామాజిక సేవ మరియూ మానవతా విలువలనే ఆదర్శంగా తీసుకునే ఒక రాజకీయ నాయకుడు. ప్రజల మనిషి. అతని అనుచరులు అతని తమ్ముడు సత్యం ([[రాజీవ్ కనకాల]]), స్నేహితులు మేక నరసింహారావు (షయాజి షిండే), శివయ్య (ఆదిత్య), గణేశ్ (సుప్రీత్ రెడ్డి). శంకరన్న నియోజకవర్గం ప్రజలు అతన్ని నందమూరి తారక రామారావు గారి పాలనా సమయంలో అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నుకున్నారు. శంకరన్న స్వతహాగా [[నందమూరి తారక రామారావు]] గారి వీరాభిమాని ఐనప్పటికీ పార్టీ హద్దుల వల్ల తన ప్రజలకు న్యాయం చెయ్యలేనేమోనని [[తెలుగుదేశం పార్టీలోపార్టీ]]లో చేరడానికి సున్నితంగా తిరస్కరించారు. తన కొడుకు కూడా తనలాగే ప్రజల మనిషిగా ఎదిగి వారి ఆదరాభిమానాలు పొందాలన్నది శంకరన్న ఆశ. ఐతే ప్రమాదవశాత్తూ శంకరన్న, సత్యం, తన అనుచరులు ఒక పెళ్ళికి వెళ్తుండగా కారు ప్రమాదంలో మరణించారు.
 
14 ఏళ్ళ తర్వాత, శంకరన్న కొడుకు అజయ్ కుమార్ ([[ఘట్టమనేని మహేశ్ బాబు]]) దుందుడుకుగా ప్రవర్తించే ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. మాఫియ డాన్ నాయక్ (సోను సూద్)ని పట్టుకుని అతను నడుపుతున్న డ్రగ్స్, గన్స్ మరియు ఇతర ఇల్లీగల్ వ్యాపారాలను ఆపాలనే మిషన్ పై అతనిని నియమిస్తారు. ఆ తర్వాత శంకరన్న చనిపోలేదని, కానీ ప్రమాదం జరిగాక కోమాలోకి వెళ్ళాడని తెలుస్తుంది. ఈ నిజాన్ని శంకరన్న కుటుంబం జనాలకు తెలియనివ్వదు. అజయ్ నాయక్ని పట్టుకోడానికి ఇస్తాంబుల్ వెళ్తాడు. అక్కడ ఓ అండర్-కవర్ ఆపరేషన్లో నాయక్ తమ్ముడు బంటి (ఆజజ్ ఖన్)ని పట్టుకుంటాడు అజయ్. ఆ తర్వాత శంకరన్న దగ్గర విశ్వాశంగా పనిచేసి అతని ప్రమాదం తర్వాత జైలుకెళ్ళిన శివయ్య (ఆదిత్య) ద్వారా నాయక్ స్నేహితుడు, అవినీతిపరుడు, ప్రతిపక్ష నాయకుడు అయిన మల్లేశ్ గౌడ్ ([[కోట శ్రీనివాసరావు]]) శంకరన్న చావుకి ప్లాన్ చేసిన వాడని, ఈ ప్లానుకి మేక నరసింహారావు, గణేశ్ సహకరించారని తెలుసుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/దూకుడు_(సినిమా)" నుండి వెలికితీశారు