లంబాడి: కూర్పుల మధ్య తేడాలు

7,345 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
లంబాడి దేవతలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
(లంబాడి దేవతలు)
1872లో [[నరహరి గోపాలకృష్ణమచెట్టి]] రచించిన [[శ్రీరంగరాజు చరిత్ర]] (సోనాబాయి పరిణయము) నవలలో రంగరాజు లంబాడి కన్య సోనాబాయిని ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించిన ఇంకో లంబాడీ వ్యక్తి ఆమెను కొండవీడుకు ఎత్తుకు పోతాడు. రంగరాజు [[కొండవీడు]] చేరుకుని సోనాబాయి తన మేనత్త కూతురని తెలిసి పెళ్ళి చేసుకుంటాడు. ఆమెను ప్రేమించిన లంబాడీ వ్యక్తి హతాశుడౌతాడు. లంబాడీలు సైన్యానికి కావలసిన సరుకులు యుద్ధ సామాగ్రి ఎడ్లబండ్లపై సరఫరా చేసేవారని బళ్ళారి మొదలైన ప్రాంతాలలో స్థిరనివాసాలేర్పరచు కొన్నట్లు బళ్ళారి జిల్లాలో లంబాడీలు చెప్పుకుంటారు.
[[File:Lambada dress.....JPG|thumb|right|లంబాడ స్త్రీలు. వారి సాంప్రదాయ వస్త్రాలలో, నాగార్జున సాగర్ వద్ది తీసిన చిత్రము]]
 
==లంబాడీల దేవతలు==
తండాలో ఏ కార్యం జరిగినా పెండ్లి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెండ్లి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ.
 
===[[మేరమ్మ]]===
వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, పెండ్లికాని అమ్మాయిలకు మంచి కాపురం దొరకాలి. సుఖ సంతోషాలతో అత్తగారి ఇంటికి వెళ్ళాలి, పంటలు పండేవిధంగా పచ్చగా కాపురం ఉండాలని మేరమ్మను కోరుకుంటారు. తీజ్ 9 రోజులు జరుపుకుంటారు. నవధాన్యాలు బుట్టలో వేసి మొలకతీస్తారు. ఏ మొలక బాగా వస్తుందో ఆ పంట వేసుకోవాలని తండాలో పెద్దలు నిర్ణయిస్తారు. శాస్త్రీయంగా విత్తనాలు వేసుకుంటారు. పంటలు పండిస్తారు.
 
===[[త్వళ్జ]]===
పండిన పంట ఇంటికి తీసుకొస్తే నవధాన్యాలు గుమ్మాలు, గాదెలు నిండే ఉండే విధంగా ఉండాలని కష్టాలు రాకుండా కాచుకోవాలని పూజిస్తారు. అల్లుళ్లు, బిడ్డలు చుట్టాలంతా రావాలని, కలుసుకోవాలని, కొడుకులకు, కోడళ్లకు పిల్లలు పుట్టాలని కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు.
 
===[[సీత్ల]]===
తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశుసంపద పెరగాలని, దూళ్ళకు పాలు సరిపోను ఉండాలని గడ్డి బాగా దొరకాలని క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలని అటవీ సంపద తరగకూడదని, మొక్కులు తీర్చుకుంటారు.
 
===[[మత్రల్]]===
ఇతర ఊర్లలో ఉండే రోగాలు, కష్టాలు, జబ్బులు, గత్తెరలాంటివి తండాల పొలిమేర వరకు రాకూడదని శుభ్రం చేసుకుంటూ పూజిస్తారు.
 
===[[హింగళ]]===
పుట్టే ప్రతి పిల్లతో పాటు తల్లి తండా ఆరోగ్యంగా ఉండాలని పుట్టిన ప్రతి వారు అన్ని విధాల దృఢంగా ఉండాలని తిండి, అలవాట్లు మెరుగుపర్చుకొని బిడ్డను కాపాడాలని మొక్కుకుంటారు.
 
===[[ధ్వాళ్ అంగళ్]]===
అడవిలో ఉండే పక్షులు, జంతువులు బాగుండాలని వన సంరక్షణలో జంతువులు కాపాడబడాలని పాలపిట్ట, పక్షి రోజు తండాకు కనబడిపోవాలని ఆరాధిస్తారు.
 
===[[కంకాళి]]===
మానవునిపై ధాన్యాలపై పశు సంపదలపై ఎటువంటి శత్రువుల దాడి కుట్రలు జరగకుండా దరిచేరకుండా ఉండేందుకు బాధ్యతగా చూసుకోవాలని మొక్కుకుంటారు లంబాడీలు. పెండ్లి అయిన అమ్మాయిలకు ఒక తులం బంగారం ఒక కిలో వెండి 12 రూపాయి నాణేలతో దండ, కొంకుణాలు, చేతివేళ్ళకు మేరికలు, రైకలు, లంగాల నిండా అద్దాలు, గవ్వలు, తెల్లటి గాజులు చేతినిండా ఉండేవి. పెండ్లి అయిన అమ్మాయి ఇంట్లోకి వస్తే లక్ష్మి వచ్చింది అనేది అనాడు లంబాడీల విశ్వాసం.
 
===లాంబాడీ సంస్కృతిపై దాడి===
కొత్త పేర్లు కొత్త రూపాల్లో పండుగలు తండాలలోకి ప్రవేశిస్తున్నాయి. తండా సంస్కృతిని ధ్వంసం చేయడం జరుగుతోంది. ఆర్థికంగా సామాజికంగా వీరిని మరింత ఇబ్బందుల్లో పడేసే విధంగా మూఢనమ్మకాలను నమ్మిస్తున్నారు. ఇదంతా వారి జీవన విధానాన్ని సహజీవనాన్ని ధ్వసం చేయడమే
గతంలో తండా పెద్దలు కూర్చొని ఏ కార్యం అయినా పండుగ అయినా పెండ్లి అయినా పంచాయితీ అయినా సామూహికంగా పరిష్కరించుకునేది. కార్యం పూర్తి చేసేది. ఇప్పుడు అది లేకుండా పోయింది. తండా కట్టుబాట్లు అభివృద్ధి వైపు ఉండేవి. ఇప్పుడు బ్రాహ్మణీయ, పాశ్చాత్య సంస్కృతులు తండామీద పడుతున్నాయి. దీనితో వారి జీవన విధానం ఒక ప్రశ్నార్థకంగా మారింది. తండాపై ఇతర సంస్కృతులను రుద్దకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
 
 
==లంబాడీల ఆచార సంప్రదాయాలు==
[[File:Lambani Women closeup.jpg|right|thumb|125px|ఒక లంబాడీ మహిళ]]
86

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2062656" నుండి వెలికితీశారు