ఆర్.నారాయణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==సినీరంగ ప్రవేశం==
నారాయణమూర్తి సినిమాల్లో హీరో కావాలనే జీవితాశయం ఉండేది. సినిమా పిచ్చి తోటి 1972 లోనే ఇంటర్మీడియట్ పరీక్షలవ్వగానే ఎలాగైనా పరీక్షలో తప్పేది భాయం అనుకుని మద్రాసు వెళ్ళిపోయాడు. అప్పటికి ఇతడికి 17-18 ఏళ్ళ వయసు. మహానగరంలో ఎవరూ తెలీదు. మనసులో ఉందల్లా సినిమాల్లో వేషాలు వెయ్యాలని అంతే.. పక్కా సినిమా కష్టలు మొదలయ్యాయి.తిండి లేదు.వసతి లేదు. ఐనా ఏదో మూల ఆశ.అక్కడక్కడ తింటూ, లేని రోజు పస్తుంటూ, రోడ్డు పక్కనే ఏ చెట్టుకిందనో పడుకుంటూ.. రోజులు గడుస్తుండగా, ఒక రోజు హఠాతుగా పేపర్ లో పరీక్షా ఫలితాలు చూసి ఇంటర్మీడియట్ లో పాసయ్యానని తెలుసుకున్నాడు. సరే ఇక్కడా ఏమీ అవకాశాలు రావడంలేదుకదా. పాసయ్యాను కాబట్టి వెనక్కి వెళ్ళి బి.ఎ. చదువుదామని నిర్ణయించుకుని తిరిగి పెద్దాపురం వెళ్ళిపోయాడు. దాసరి గారి పరిచయం వలన [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] సినిమా [[నేరము – శిక్ష (సినిమా)|నేరము-శిక్ష]]ఈయనకు ఒక చిన్నపాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఒక పాట చిత్రీకరణలో 170 మంది జూనియర్ ఆర్టిస్టులలో ఈయనా ఒకడు. చిన్నవేషంతో నిరుత్సాహపడ్డాడు. కానీ, ఇంటర్మీడియట్ పాసైన విషయం తెలిసింది. డిగ్రీ పూర్తి చేసుకొని తిరిగి రమ్మని దాసరి సలహా ఇచ్చాడు. అదీకాక, సినిమా టైటిల్లలో ''ఎన్.టి.రామారావు బి.ఏ'' అని చూసి, తనూ బి.ఏ చెయ్యాలనే కోరిక ఉండేది. అలా బి.ఏ చెయ్యటానికి తూర్పుగోదావరి తిరిగివచ్చాడు. అదే సమయంలో నేరము-శిక్ష సినిమా విడుదలైంది. వందమందిలో ఒకడిగా నిలబడినా, తన గ్రామప్రజలు సినిమా చూసి, తనను అందులో గుర్తిపట్టి, తను కనిపించిన సన్నివేశాలు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి, ఈలలు వేశారు. ''"మన రెడ్డి బాబులు సినిమాలో ఉన్నాడు"'' అని చెప్పేవారు. ఈ గుర్తింపు సినిమావంటి ప్రజామాధ్యమం యొక్క శక్తిని నారాయణమూర్తి గుర్తించేలా చేసింది. అప్పుడే డిగ్రీ పూర్తిచేసి సినిమాలలో చేరాలని నిశ్చయించుకున్నాడు.
 
డిగ్రీ కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలలో మహా చురుకుగా పాల్గొనేవాడు. కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా వీరి బృందం కార్యక్రమం ఒకటి ఉండాలంతే. మరో పక్క కమ్యూనిస్ట్ పుస్తకాలు కూడా బాగా చదువుతుండేవాడు. సినిమా పిచ్చి మాత్రం లోపల తొలుసూనే ఉండేది. ఒకసారి కాలేజీలో అప్పటి హీరోయిన్ [[మంజుల]] గారి నృత్య కార్యక్రమం ఏర్పాటు చెయ్యడంలో ఇతడు ముఖ్యపాత్ర వహించాడు. ఏదో ఒక రోజు నేను కూడా సినిమాల్లోకి వెళ్ళి, సినిమా తారలకున్న కీర్తి కొంచెమైనా తెచ్చుకోవాలనుకునే ఆలోచన మాత్రం ఇతడిలో నుంచీ చెరిగిపోలేదు. అలానే రాజకీయ కార్యక్రమాలు కూడా. అత్యవసర పరిస్థితి రోజుల్లో ఎమ్మేల్లే డా.సి.వి.కె రావు గారూ ఇతడూ ఒకే వేదికమీదనుంచీ మాట్లాడిన సందర్భం కూడా వుంది. ఇంక బి.ఎ పూర్తి కావడమే తరువాయి. మద్రాసు ప్రయాణం కట్టాడు. ఎప్పుడో మూడు నాలుగేళ్ళ క్రిందట వచ్చిన అనుభవమే మద్రాసుకి. ఐతే ఈ సారి బి.ఎ డిగ్రీ ఉంది కాబట్టి వేషాలు చాలా సులభంగా దొరుకుతాయి అనే భావన ఉండేది .ఏముందీ ఎవరు పడితే వాళ్ళు పిలిచి నాకు హీరో వేషం ఇస్తారు అనుకుంటూ మద్రాసులో అడుగుపెట్టాడు. పరిస్థితిలో ఏమీ మార్పులేదు. ఎవ్వరూ ఇతడిని పలకరించిన పాపాన పోలేదు. ఎందుకు పలకరించాలీ..నేనేమంత గొప్ప పర్సనాలిటీనీ..? ఐనా వయసు, సినిమా మత్తు అలాంటిది. పంపునీళ్ళే కడుపు నింపేవి.
"https://te.wikipedia.org/wiki/ఆర్.నారాయణమూర్తి" నుండి వెలికితీశారు