"గుత్తికొండ బిలం" కూర్పుల మధ్య తేడాలు

ఈ బిలం ప్రకతి సహజ సిద్దంగా ఏర్పడింది. దీని లోపల అనేక అంతర గుహలు, అద్భుత జలాశయాలు ఉన్నాయి. బిలంలో 101 సొరంగాలు ఉండగా ప్రస్తుతం వెళ్లటానికి వీలుగా ఉన్న గుహలు ఏడు మాత్రమే ఉన్నాయి. బిలంలోని కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ బిలంలో మొదటిగా చీకటి మల్లయ్యస్వామిని దర్శిస్తారు. తరువాత [[బ్రహ్మనాయుడు]] బిలం, రేణుకా బిలం వస్తుంది. ఈ బిలాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి జలాలలో స్నానం ఆచరిస్తే [[కాశీ]]<nowiki/>లోని [[గంగా నది|గంగ]]<nowiki/>లో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ జలాలు ఎక్కడనుంచి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. ఇక్కడ జలాలు ఎప్పడు ఒకే రకమైన స్థిర పరిమాణంలో ఉంటాయి. ఈ బిలం నుంచి [[అమరావతి]], [[శ్రీశైలం]], కాశీ, [[చేజెర్ల (నకిరికల్లు)|చేజర్ల]], [[అహోబిలం]], [[తిరుమల]] ఇలా రకరకాల ప్రాంతాలకు మార్గాలున్నాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది [[ఆషాఢ శుద్ధ ఏకాదశి]]<nowiki/>నాడు జరిగే బిలమహొత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ బిలానికి మరో ప్రత్యేకత ఉంది ఇది చలికాలంలో వెచ్చగాను, వేసవికాలంలో చల్లగాను ఉంటుంది. నూటొక్క సొరంగాలున్న ప్రాంతం, రహస్యాలకు కేంద్రబిందువుగా ఉంది. ఈ బిలం ముఖద్వారం వద్ద బాలమల్లేశ్వర, [[రాజరాజేశ్వరి]], [[వినాయక]] దేవాలయాలు ఉన్నాయి. [[బాలచంద్రుడు (పలనాటి)|పల్నాటి బాలచంద్రుడే]] బాలమల్లేశ్వరుడుగా వెలిశాడని ఇక్కడి భక్తుల నమ్మకం<ref>https://www.youtube.com/watch?v=G86KQi2hBFg</ref>.
==భారతమాత ఆలయం==
ఈ బిలం దగ్గర భరతమాత అరుదైన ఆలయం ఉంది.నకరికల్లు మండలం [[చాగల్లు (నకిరికల్లు)]] కు చెందిన ఆలపర్తి గోవర్ధనమ్మ 2008 లో ఈ ఆలయాన్ని కట్టించారు.
 
== ఉద్యమవేదిక ==
8,800

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2063110" నుండి వెలికితీశారు