చెలికాని రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎స్వాతంత్ర్య పోరాటంలో..: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఎంతొ → ఎంతో using AWB
పంక్తి 37:
'''చెలికాని వెంకట రామారావు''' ([[జులై 15]], [[1901]] - [[సెప్టెంబరు 25]], [[1985]]) ([[ఆంగ్లం]]:Chelikani Ramarao) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, [[హేతువాది]] మరియు [[సోషలిస్టు]]. 20 వ శతాబ్దపు భారతదేశ చరిత్రలోని ఉజ్వల అధ్యాయాలకు ప్రతీకగా నిలుస్తారు. మానవత, నిజాయితీ, వినమ్రత, విస్పష్టమైన నిబద్ధత మొదలైన విశిష్ట లక్షణాలతో ఆయన తన కాలంనాటి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. వివేకానందుని బోధనలు, బ్రహ్మ సమాజ ఉద్యమం, [[రఘుపతి వెంకటరత్నం]] గారి శిష్యరికం, స్వతంత్ర పోరాటం, జైలు జీవితం, హరిజనసేవ, స్త్రీ జనోద్దరణ, [[కమ్యూనిస్టు]] ఉద్యమం, [[పార్లమెంటు]] సభ్యత్వం, వైద్యసేవ మొదలైన అంశాలకు ఆయన ఒక వాహిక లాగా నిలవడమే గాక వాటిపై తనదైన ముద్ర వేశారు.
==జీవిత విశేషాలు==
ఈయన [[జులై 15]], [[1901]]లో నారాయణస్వామి, సూరమ్మ దంపతులకు [[తూర్పు గోదావరి జిల్లా]] [[పిఠాపురం]] సమీపంలోని [[కొండెవరం]]లో జన్మించారు. సంఘ సంస్కరణోద్యమాలు, సాయుధ విప్లవోధమాలు జరుగుతున్న తూర్పుగోదావరి జిల్లాలోణి అద్వితీయమైన వాతావరణం ప్రభావం బాల్యం నుండే ఆయన పై చెరగని ముద్ర వేసింది. ముఖ్యంగా పిఠాపురం రాజావారి వ్యక్తిత్వం చిన్నతనంలోనే రామారావును విశేషంగా ఆకట్టుకుంది. రాజావారి సహాయం తోనే రామారావు ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు రాసి ఉన్నత పాఠశాలలో ప్రథముడిగా ఇలిచాడు ఉన్నత పాఠశాల జీవితం లోనే స్వదేశీ ఉద్యమం వైపు మొగ్గు చూపిన రామారావు కాలేజీ చదువుకోసం కాకినాడ వెళ్ళేనాటికి థియోసాఫికల్ సొసైటీ కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యారు. దేశం పరిపాలనలో మగ్గిపోతుంటే సుఖంగా కూర్చుని చదువుకోవడం సాంఘిక ద్రోహమని 1921, జనవరి 26న చదువుకు స్వస్తి చెప్పి ఇల్లొదిలి విశాలమైన ప్రజా జీవితం లోకి ప్రవేశించారు. జాతీయ ఉద్యమంలో చేరాడు. 1922లో [[రాజమండ్రి]]లో మొదటిసారి జైలు శిక్షను అనుభవించాడు. 1924లో [[కాకినాడ]]లో జరిగిన అఖిల భారత కాంగ్రేసు మహాసభలో వాలంటరీ కమాండర్ గా పనిచేసాడు. 1926-30 [[నిజాం సంస్థానం]]లో M&S చదివి, అక్కడి, సంస్కరణోద్యమాలతో సంబంధాలు నెలకొల్పాడు. 1930లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్నాడు. 1931లో [[డాక్టరు]] డిగ్రీ పట్టా పొందారు.తరువాత రోజుల్లో సర్ [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] గారి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు ఆయనను బాగా ఆకర్షించాయి. తెలుగునాట సాంఘిక విప్లవానికి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాయకత్వం వహించిన [[కందుకూరి వీరేశలింగం పంతులు]] కూడా ఆయనను ఎంతగానో ప్రభావితం చేశారు. 1934 లో కందుకూరి దగ్గర పెరిగిన డాక్టర్ కమలమ్మను రామారావు గారు కులాంతర వివాహం చేసుకున్నారు. కాకినాడలో వైద్యవృత్తిని నిర్వహించాడు. ఇంకా జిల్లా హరిజన సంఘ అధ్యక్షులుగా 1935 లో వ్యవహరించాడు. ఈయన డాక్టరుగా 1937 నుండి [[రంగూన్]]లో ఉన్నాడు. 1948-1952లలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము ప్రకారం అరెస్టు కాబడి, కడలూరు జైలులో శిక్ష అనుభవించాడు. 1952లో కాకినాడ [[పార్లమెంటు]] సభ్యునిగా తొలి లోక్‌సభకు[[లోక్‌సభ]]కు సి.పి.ఐ ([[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా]]) అభ్యర్థిగా ఎన్నికైనాడు. 1957, 1962లలో తిరిగి కాకినాడ నియోజకవర్గము నుండి సి.పి.ఐ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీచేసినా గెలుపొందలేదు. రామారావు 84 సంవత్సరాల నిండైన సార్థక జీవితాన్ని గడిపి [[సెప్టెంబరు 25]], [[1985]]న దివంగతులైనాడు.
 
==కమ్యూనిష్టు వాదిగా==
తాను నమ్మిన ఆశయాలను మనసా వాచా కర్మణా ఆచరించి తరువాత తరాలకు ఆదర్శప్రాయుడైన మహానుభావుడు ఆయన. తన దగ్గర వైద్యం చేయించుకున్న బీదసాదల నుంచి ఏవిధమైన రుసుమూ తీసుకోకుండా ఖర్చులకోసం తిరిగి వారికే కొంత డబ్బు ముట్టచెప్పేవారు. మూర్తీభవించిన సౌజన్యంతో జీవితంలో కడదాకా కష్టజీవుల అభ్యున్నతికోసం కృషిచేసిన డాక్టర్ రామారావు గారు చరిత్రలో ఒక "లిజెండరీఫిగర్"గా నిలిచిపోతారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో [[మహాత్మ గాంధీ]] ఆయనను బాగా ఆకర్షించారు. ఆయన ప్రభావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన డాక్టర్ రామారావు గారి జీవితంలో సంభవించిన విప్లవ పరిణామక్రమంలో చివరకు ఆదర్శ [[కమ్యూనిస్టు]]గా మారారు.
"https://te.wikipedia.org/wiki/చెలికాని_రామారావు" నుండి వెలికితీశారు