అచ్యుత దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
* మొదట [[తిరుమల]]లో గర్భగుడిలోపలనే దేవదేవుని శంకుతీర్థముతో పట్టాభిషేకము జరుపుకున్నాడు<ref>అచ్యుతరాయాభ్యుదయము - రెండవ రాజనాధ డిండిమ</ref><ref>The Sources of Vijayanagara history No.1 Madras University Historical Series పేజీ.161</ref>. ఈ విషయమై విమర్శలు వచ్చాయి. ఎందుకంటే గర్భగుడిలోనికి బ్రాహ్మణులకు తప్ప అన్యులకు ప్రవేశము లేదు.
* తరువాత 1529 [[అక్టోబర్ 21]] న (శక స.1452 [[విరోధి]] నామసంవత్సర కార్తీక బహుళ పంచమి) [[శ్రీ కాళహస్తి]]లో రెండవ పర్యాయము పట్టాభిషేకం జరుపుకున్నాడని కాళహస్తిలోని శాసనము వల్ల తెలుస్తుంది.<ref>ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.3</ref><ref>Annual Reports of Epigraphy, Madras. 157 of 1924</ref>
* తరువాత 1529 [[నవంబర్ 20]] న [[విజయనగరం]]లో ముచ్చటగా మూడవసారి పట్టాభిషేకం జరుపుకున్నాడు.
 
పంక్తి 21:
==రామరాయల కుట్రలు==
{{చూడండి|అళియ రామ రాయలు}}
రాజధానిలో రామరాయలు బలం నానాటికి పెరగసాగింది. రామరాయల తమ్ములు వెంకటాద్రి, తిరుమలలు అతడికి అండగా ఉన్నారు. [[కందనవోలు]], [[అనంతపూరు]], [[ఆలూరు, కర్నూలు|ఆలూరు]], [[అవుకు]] దుర్గాధిపతులు రామరాజు పక్షము వహించారు. ఇంతలో బీజాపూరులో[[బీజాపూరు]]లో మల్లూ ఆదిల్‌షాను తొలగించి [[ఇబ్రహీం ఆదిల్‌షా]] గద్దెనెక్కి, మల్లూ సానుభూతిపరులైన ఉద్యోగులను, మూడు వేల సైన్యాన్ని తొలగించాడు. అలా తొలగించబడిన సైనికులను రామరాయలు తన సైన్యములో చేర్చుకొని రాజధానిలోని తురకవాడలో నిలిపి ఉంచాడు.<ref name=nv59>ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.59</ref>
 
1536లో [[గుత్తి]] ప్రాంతములోని తిరుగుబాటును అణచి [[తిరుమల]] వేంకటేశ్వరుని దర్శించుకొని రాజధానికి తిరిగివస్తున్న అచ్యుతరాయలను బంధించి, రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించి పట్టాభిషేక ప్రయత్నాలు జరిపాడు. కృష్ణదేవరాయల భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి రామరాయలకు మద్దతు నిచ్చారు. కానీ ప్రజలు, సామంతులు రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించడాన్ని ఇష్టపడలేదు. పట్టాభిషేకానికి అన్నీ సన్నద్ధం చేసుకున్నా, రాయరాయల పట్టాభిషేకం జరగలేదు<ref name=nv60>ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.60</ref>. [[మధుర]], [[కొచ్చిన్]] ప్రాంత సామంతులు కప్పం చెల్లించడం నిలిపివేశారు. రామరాయలు వారిపై దండయాత్రకు బయలుదేరిన సమయములో రాజధానిలోని ఉద్యోగులు సలకం పెద తిరుమలరాజుతో చేరి, అచ్యుతరాయల్ని చెర నుండి విడిపించి సింహాసనముపై పునఃప్రతిష్ఠించారు.
పంక్తి 28:
 
==చివరి రోజులు==
రామరాయలతో ఒప్పందం అయిన తర్వాత అచ్యుతరాయలు రాజ్య వ్యవహారాలను బావమరిది సలకం పెద తిరుమలరాజు పరం చేసి సర్వదా అంతఃపురములోనే[[అంతఃపురము]]లోనే గడిపినట్లు, దానితో ప్రభుత్వం నీరసించినట్లు తెలుస్తున్నది.<ref name=nv75>ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.75</ref> తుదకు అచ్యుతరాయలు ప్రజాభిమానం కోల్పోయి 1542లో మరణించాడు.
 
==మరణానంతర రాజకీయ పరిస్థితులు==
అచ్యుతరాయల మరణంతో రామరాయలు మరియు సలకం తిరుమలల మధ్య స్పర్ధలు తీవ్రమై రాజ్యాన్ని అంతర్యుద్ధంలో ముంచెత్తాయి. అచ్యుతరాయలు కొడుకైన వెంకటపతిని సింహాసనంపై ఎక్కించి, తాను సంరక్షకునిగా అధికారం హస్తగతం చేసుకుని [[సింహాసనం]] ఆక్రమించటానికి తిరుమల ప్రయత్నం చేశాడు. దీనికి వ్యతిరేకంగా రాయరాయలు గుత్తి దుర్గంలో సదాశివరాయల్ని రాజుగా ప్రకటించాడు. సదాశివరాయలు అచ్యుతరాయల అన్న రంగరాయల కుమారుడు. అందుచే అచ్యుతరాయల కంటే విజయనగర సింహాసనంపై సదాశివునకు బలమైన హక్కు ఉందని చాటడం రామరాయల ఉద్దేశం.
 
తిరుమల, రామరాయల మధ్య సంవత్సరంపాటు జరిగిన అంతర్యుద్ధం అవకాశంగా తీసుకొని ఇబ్రహీం ఆదిల్‌షా రెండుసార్లు విజయనగరంపై దండెత్తాడు. మొదట్లో తిరుమలుని దురాశ నుండి తన కుమారుడు వెంకటపతిని రక్షించే ఉద్దేశముతో వరదాంబిక ఆదిల్‌షాను ఆహ్వానించింది. కానీ తిరుమలుడతనితో ఒప్పందం చేసుకొని వెనుకకు మరలించాడు. తిరిగి రామరాయల అభ్యర్ధనపై ఆదిల్‌షా విజయనగరంపై దండెత్తినాడు. ప్రజలు భయభ్రాంతులై సలకం తిరుమలుని విజయనగర సింహాసనం ఎక్కించారు. ''తిరుమల దేవ మహారాయల''నే పేర పట్టాభిషిక్తుడై ఆదిల్‌షాను ఓడించి పారదోలటమే కాక రాజధానికి తిరిగి వచ్చి మేనల్లుడు వెంకటపతిని హత్యచేసి, తనకు ప్రతికూలురైన రాజోద్యోగులను హింసించాడు. అతని నిరంకుశపాలనకు ప్రజలు విసుగెత్తారు.
 
పరిస్థితిని గమనించి, రామరాయలు [[గుత్తి]] నుండి దండెత్తి వచ్చి తుంగభద్రా తీరములో తిరుమలను ఓడించి, సదాశివరాయలను రాజధానిలో పట్టాభిషిక్తుని చేసాడు.
 
==వ్యక్తిత్వము==
[[న్యూనిజ్]] రచనలు అచ్యుతరాయలను వ్యసనలోలునిగా, కౄరునిగా చిత్రీకరించినా, ఈయన ప్రశంసనీయుడని, సామ్రాజ్యపు గౌరవాన్ని, సంపదను నిలబెట్టేందుకు పోరాడాడని చెప్పటానికి ఆ తరువాత కాలములో శాసన మరియు సాహిత్య ఆధారాలు లభించాయి<ref name=vv15>వి.వ్రిద్ధగిరీషన్, పేజీ.15</ref>. ఇతడు సమర్ధుడనే కృష్ణదేవరాయలు తన వారసునిగా ఎన్నుకున్నాడు. అచ్యుతరాయల యొక్క జీవితము మరియు పాలనను రెండు సంస్కృత కావ్యాలు, రెండవ రాజనాథ డిండిమ రాసిన ''అచ్యుతాభ్యుదయం'' మరియు అచ్యుతరాయల భార్య [[తిరుమలాంబ]] రచించిన ''[[వరదాంబికా పరిణయం]]'' వివరముగా వర్ణిస్తాయి<ref name=act2>వరదాంబికా పరిణయ చంపూ - తిరుమలాంబ (ఆచార్య సూర్యకాంత శాస్త్రి సంపాదకత్వము)</ref>.
 
అచ్యుత రాయలు విజయనగర సామంతుడైన సలకరాజు కుమార్తె వరదాంబికను వివాహమాడినాడు. వరదాంబికా పరిణయములో అచ్యుతరాయలు పెళ్ళినాటికే చక్రవర్తిగా రాసిన శాసనాధారాలు అచ్యుతరాయలు పట్టాభిషిక్తుడయ్యేనాటికి వరదాంబికతో వివాహమై, కుమారుడు చిన వెంకటపతి కూడా జన్మించియున్నాడని తెలుస్తున్నది. అచ్యుతరాయలతో వియ్యమందిన తరువాత సలకరాజు కుమారులు సలకం తిరుమలుల రాజకీయ ప్రాభవం పెరిగినా పెళ్ళికి ముందునుండే సలకం చిన తిరుమలుడు విజయనగరంలో[[విజయనగరం]]లో సేనానిగా పనిచేస్తున్నాడని తెలుస్తున్నది.
 
==కళాపోషణ==
పంక్తి 46:
ఇతని పరిపాలనా కాలములో [[హంపి]]లోని తిరువేంగళనాధుని ఆలయము నిర్మించాడు. ఈ ఆలయం అక్కడ కొలువై ఉన్న దేవుని పేరుమీదుగా కంటే ''అచ్యుతరాయ ఆలయము'' అన్న పేరుతోనే ప్రసిద్ధి చెందింది.
 
ఇప్పుడు [[కపిల తీర్ధము]]గా ప్రసిద్ధమైన [[తిరుపతి]] లోని ఆళ్వార్ తీర్ధాన్ని అచ్యుతరాయలు నిర్మింపజేశాడు. తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. [[1533]]లో స్వామివారి పుష్కరిణి మెట్లు బాగుచేయించి పాత పుష్కరిణి పక్కనే కొత్త పుష్కరిణిని కట్టించాడు. తిరుమలలో[[తిరుమల]]లో ఆలయానికి దక్షిణము వైపున అచ్యుతరాయలు మరియు ఆయన భార్య వరదాంబికల రాతి విగ్రహాలు చూడవచ్చు<ref name=act3>[http://www.omnamovenkatesaya.com/saptagiri_Nov2005_Eng/Tirumala_through_ages.htm అనాదిగా తిరుమల - పి.కుసుమ కుమారి]</ref>. [[తమిళనాడు|తమిళనాట]] [[దిండిగల్]]కు సమీపంలో వున్న [[తాడికొంబు ఆలయం|తాడికొంబు ఆలయాన్ని]] తిరుమలరాయలు నిర్మింపజేసాడు.
 
కృష్ణదేవరాయల లాగానే అచ్యుతరాయలు కూడా సాహిత్య పోషకుడు. ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సమర్పించేవాడు<ref name=arudra237>ఆరుద్ర, పేజీ.237-238</ref>. అచ్యుతరాయలు స్వయంగా ''తాళమహోదధి'' అనే గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఈయన ఆస్థానములో కన్నడ కవి [[చాటు విఠలనాధుడు]], ప్రముఖ సంగీతకారుడు [[పురందరదాసు]] మరియు సంస్కృత విద్వాంసుడు [[రెండవ రాజనాథ డిండిమభట్టు]] ఉండేవారు. డిండిమభట్టు ''అచ్యుతరాయాభ్యుదయము''తో పాటు సంస్కృతములో[[సంస్కృతము]]లో భాగవత చంపు వ్రాసి అచ్యుతరాయలకు అంకితమిచ్చాడు. ఈయన ఆస్థానములోని[[ఆస్థానము]]లోని తెలుగు కవులలో [[రాధామాధవ కవి]] ముఖ్యుడు. ఈయన రచించిన ''తారకబ్రహ్మరాజీయము''ను అచ్యుతరాయల మంత్రి [[నంజ తిమ్మన]]కు అంకితం చేశాడు. కృష్ణరాయల సభ భువనవిజయములాగే, అచ్యుతరాయల సభను ''వెంకట విలాస మండపము'' అని పిలిచేవారు.
 
అచ్యుత రాయల కాలములో స్త్రీలు కూడా చక్కని గ్రంథాలు రాశారు. తిరుమలాంబ వరదాంబిక పరిణయమనే కావ్యము రాసి అందులో అచ్యుత రాయల జీవిత విశేషాలు (చిన వెంకటాద్రిని యువరాజుగా అభిషిక్తుని చేసేవరకు) వివరించింది. ఈ కాలములో ఓడూరి తిరుమలాంబ అనే విదూషీమణి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అచ్యుతరాయలు విఠ్ఠలనాథుని ఆలయానికి బహుకరించిన స్వర్ణ మేరువును పొగుడుతూ ఈమె రాసిన శ్లోకాలు హంపిలోని[[హంపి]]లోని విఠ్ఠలనాధుని దేవాలయములో ఉన్నాయి<ref name=arudra14>ఆరుద్ర, పేజీ.14-15</ref>. ఈ ఓడూరి తిరుమలాంబ, వరదాంబికా పరిణయము రాసిన తిరుమలాంబ ఒకరేనని కొందరు భావిస్తున్నారు<ref name=act2>వరదాంబికా పరిణయ చంపూ - తిరుమలాంబ (ఆచార్య సూర్యకాంత శాస్త్రి సంపాదకత్వము)</ref>. ఈ కాలములోనే మోహనాంగి అనే మరో రచయిత్రి ఉంది. ఈమె ''మారిచీపరిణయం'' వ్రాసింది. ఈమె కృష్ణరాయల కుమార్తె అనీ, అళియ రామరాయల భార్య అనీ కూడా ప్రతీతి<ref name=arudra14>ఆరుద్ర, పేజీ.14-15</ref>.
 
అచ్యుత రాయలు స్వయంగా మంచి [[వీణ|వీణా]] విద్వాంసుడు కూడా<ref name=vf50>Filliozat (1999), పేజీ.50-51</ref>. ఈయన ఉపయోగించిన ప్రత్యేక వీణ ''అచ్యుతభూపాళీ వీణ''గా పేరొందినది<ref name=act1>http://www.veenavidhya.com/veena.shtml</ref><ref name=sva1>రామయామాత్య (బయకార రామప్ప) రచించిన ''స్వరమేళకళానిధి''</ref>.
"https://te.wikipedia.org/wiki/అచ్యుత_దేవ_రాయలు" నుండి వెలికితీశారు