గూడ అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
== మరణం ==
కొంతకాలంగా కామెర్లు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం [[జూన్ 21]], [[2016]] [[రంగారెడ్డి జిల్లా]] [[రాగన్నగూడ (హయత్‌నగర్)|రాగన్నగూడ]] లోని స్వగృహంలో ప్రాణాలు విడిచాడు.
<ref>[http://www.sakshi.com/news/hyderabad/telangana-great-poet-guda-anjaiah-is-no-more-354297 సాక్షి దినపత్రికలో వార్త]</ref>
 
==రచయితగా==
నలభై ఏళ్లుగా కవిగా, రచయితగా ఎన్నో [[కథలు]], [[పాటలు]] రాసిన అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలు రాశాడు. వీటన్నింటికి తోడు సినిమాల్లో పాటలు రాసిన తర్వాత తెలుగు నేల నలుమూలలా ఆబాలగోపాలం అందరి నోళ్లలో నానుతున్నాడు. వృత్తిరీత్యా [[హైదరాబాద్‌]]లో ఫార్మసిస్ట్‌గా[[ఫార్మసిస్ట్‌]]గా పనిచేశాడు. ఆయన [[పక్షవాతం]] వ్యాధితో బాధపడుతున్నప్పుడు [[తెలంగాణ]] ప్రభుత్వం వైద్యం చేయడానికి ముందుకు వచ్చింది.<ref>[http://www.deccanchronicle.com/141013/nation-current-affairs/article/telangana-state-takes-responsibility-ailing-poet-guda-anjaiah Telangana State takes responsibility of ailing poet Guda Anjaiah-దక్కన్ క్రానికల్-13-10-2014]</ref> ఆయన వ్రాసిన "ఊరు మనదిరా" పాట 16 భాషలలో అనువాదమయింది. ఆయన తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేసాడు.
 
బడికి పోతున్న సమయంలో దారినపోతున్న ఒక రైతును పలకరించగా ''ఊరిడిసి పోవన్నా..ఉరిపెట్టుకోవన్నా...'' అన్న మాటలే తన తొలి పాటకు అన్న ప్రాసన చేశాయని..తను కళ్లారా చూసిన కష్టాలకు, వాటిని అనుభవిస్తున్న వారి నోట వచ్చిన మాటల స్ఫూర్తిగా పాటలల్లడం తనకు బాల్యంలోనే అబ్బిన విద్య అని ''అసలేని వానల్ల ముసలెడ్లు కుట్టుకొని..'' అనే ఆయన తొలిపాట పుట్టుకకు నేపథ్యం అదేనని అంజయ్య ప్రతి సభలోనే చెప్పేవాడు.
 
[[అదిలాబాద్‌]], [[కరీంనగర్‌]] జిల్లాల్లో విప్లవోద్యమ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ పెత్తందార్ల పాలనలో పీడిత జనానికి విముక్తి లేదని, జన ఐక్యతతో ప్రజోద్యమాల ద్వారా శ్రామిక రాజ్యం స్థాపించడమే ఏకైక మార్గమని నమ్మి ఉద్యమ బాటలో పయనించాడు. ఉన్నత చదువులకోసం హైదరాబాద్‌ హాస్టల్‌కు మకాం మార్చిన అంజన్నకు ప్రపంచ ఉద్యమాల పరిచయం ఏర్పడింది. తనలాగే జనం కోసం పాకులాడే వారు హైదరాబాద్‌లో[[హైదరాబాద్‌]]లో చాలామంది ఉన్నారని తెలుసుకున్న అంజయ్య వారందరిని కలుపుకున్నాడు. అరుణోదయ సాంస్కృతిక సంస్థను స్థాపించి జనంనోట విన్న పదాలనే పాటలుగా రాసి బాణీలు కట్టి తెలుగురాష్ర్టం మెత్తం తిరుగుతూ ప్రజల నుండి నేర్చుకుంటూ, ప్రజల ఆలోచనల్లో మార్పుకోసం తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాడు.
 
==రచనలు<ref>[http://kinige.com/author/Guda+Anjaiah Books from Author: Guda Anjaiah-కినిగె.కాంలో పుస్తకాల వివరాలు]</ref>==
"https://te.wikipedia.org/wiki/గూడ_అంజయ్య" నుండి వెలికితీశారు