ఎరుకల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
|populated_states=[[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణ]], [[తమిళనాడు]], [[కర్ణాటక]]
|languages=[[ఎరుకల భాష]], [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]]
|religions=[[హిందూమతం]] మరియు [[క్రైస్తవమతం]]
}}
 
'''ఎరుకల''' లేదా '''కుర్రు''' ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని [[ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణ]], [[తమిళనాడు]] మరియు [[కర్ణాటక]] రాష్ట్రాలలో నివసిస్తున్న సామాజికవర్గం. ఎరుకలవారు దక్షిణ భారతదేశపు ఆదివాసులు. తమను తాము కుర్రువారిగా పిలుచుకుంటారు. తెలుగు ప్రాంతాలలో వీరిని ఎరుకలు అని పిలుస్తారు. ఈ జాతికి చెందిన మహిళలకు ఎరుక చెప్పటం (సోది, గద్దె, జ్యోతిష్యం) ప్రధాన వృత్తిగా ఉండేది కనుక వీరిని ఎరుకలవారు అని పేరువచ్చింది. మహారాష్ట్రలో ఎరుకలను కైకాడి - కుచికొర్వే (మకడ్‌వాలా) అని వ్యవహరిస్తారు.<ref>{{cite book|title=Primitive tribes in contemporary India: concept, ethnography and demography|volume=2|editor-first=Sarit Kumar|editor-last=Chaudhuri|editor2-first=Sucheta Sen|editor2-last=Chaudhuri|publisher=Mittal Publications|year=2005|ISBN=81-8324-026-7|pages=263}}</ref>
 
==చరిత్ర==
ఎరుకలు తమను తాము [[మహాభారతం]]లోని [[ఏకలవ్యుడు|ఏకలవ్యుని]] వంశంగా భావిస్తారు. మహాభారతంలో ఏకలవ్యుడు నిషాధ కులానికి చెందిన వాడని చెప్పబడినది. నిషాధులకే ఉత్తర భారతదేశంలో కిరాతులు అని కూడా వ్యవహరిస్తారు. కిరాతులు, నిషాదులు ఆరితేరిన విలుకాండ్రు. బస్తర్ లోని భిల్ (విల్లు అనే పదానికి అపభ్రంశం) తెగ ఈ కిరాతులు, నిషాధులకు సంబంధం కలవారని, ఎరుకలు, భిల్ తెగ యొక్క ఒక శాఖ అని భావిస్తారు.
 
==ఆధునిక చరిత్ర==
అనేక మార్పులు మరియు సంవత్సరాలు గతించిన తరువాత ఎరుకుల జాతి ప్రజలు అడవికి పరిమితమై అటవీ ఉత్పత్తులు మరియు వేటాడము ద్వార జీవనము సాగించేవారు. భ్రీటీషు వారి పాలనలో 1878 సంవత్సము అటవీ ఉత్పత్తులను ఉపయెాగించటము మరియు వేటాడము నిషేదించిన కారణముగా ఎరుకుల జాతి ప్రజలు మైదాన ప్రాంతములకు (గ్రామాలకు) విస్తరింటము జరిగినది. ఆ కారణముగా ఎరుకుల ప్రజలు అడవి సంపద మీద హక్కులు కోల్పోఇ మైదాన ప్రాంతములలో నివశించుట వలన గ్రామ సమాజములో కనీస సౌకర్యాలు , గౌరవము పోందలేక పోయారు. 1911 సంవత్సము భ్రీటీషు పాలకులు ( నేటి చెనై పట్టణము అధికారులు) ఎరుకుల జాతి ప్రజలను నేరస్తుల యెుక్క జాబితాలో చేర్చినారు. అప్పటి నుండి భ్రీటీషు వారి కాలములో దుర్బర దారిద్రము ఎరుకుల జాతి ప్రజలు అనుభవించినారు. భారతదేశనికి స్వాతంత్రము వచ్చిన తరువాత 1952లో అట్టి నేరస్తుల జాబితాలో నుండి ఎరుకుల జాతిని తోలగించటము జరిగినది. కాని నేటికి కూడ అనేక ప్రాంతాలలో ఎరుకుల జాతి ప్రజలు దుర్బర దారిద్రము అనుభవించుచున్నారు.భ్రీటీషు పాలనలో ఎరుకుల జాతి ప్రజలు వ్యవసాయ కూలిలుగా మరియు చిన్న వర్తకులుగా మరియు చాపలు అల్లటము ,బుట్టలు, తయారు చేయటము ద్వార జీవనము సాగించేవారు. ఈ కాలములో అనేకమంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మరి కోంతమంది ఆర్దిక స్వాతంత్రము అనుభవిస్తున్నారు. కాని భారతదేశనికి స్వాతంత్రము వచ్చి 66 సంవత్సరాలు గడచినా ఇప్పటికి అనేక ప్రాంతాలలో ఎరుకుల జాతి ప్రజలు సమాజములో అణచివేతకు , అవమానలకు గురై భాధలు అనుభవిస్తున్నారు.
 
==గణాంకాలు==
* నివాసము : మైదాన ప్రాంతాలు , కోండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు.
 
* జీవనాధరము: వ్యవసాయము, చేతి వృత్తులు,జంతు పోషణ.
 
* అక్షరాశ్యత 1991 లెక్కల ప్రకారము 25.74%
 
===జనాభా===
 
*[[ఆంద్రప్రదేశ్]] 531000
*[[తమిళనాడు]] 13000
*[[ఓరిస్సా]] 1800
*[[కర్ణాటక]] 1200
*[[మహరాష్ట్ర]] 600
*[[ఢిల్లి]] 200
*[[గుజరాత్]] 200
*[[పాండిచేరి]] 200
*[[చత్తీస్ ఘఢ్]] 200
*[[జార్ఖండ్]] 87
 
==భాష==
 
ఎరుకుల ప్రజలు తమ స్వంత భాష అఇన ఎరుకుల భాషను ఉపయెాగిస్తారు, దానిని కుర్రు భాష లేక [[కులవత]] అంటారు, ఇది రవుల మరియు ఇరుల అనే [[ధ్రవిడ]] భాషకు సమీపముగా ఉంటుంది. ఆంద్రప్రదేశ్ లో ఎరుకుల భాషను తమ కుటుంభాలలో ఉపయెాగిస్తారు. [[రాయలసీమ]], తెలంగాణ ప్రాంతాలలో ఈ భాషను ఎక్కువగా ఉపయెాగిస్తారు.
 
==ఉప జాతులు==
ఎరుకుల జాతి ప్రజలు తమ ఉప వృత్తుల ఆధారముగా విభజించబడినది.
#దబ్భ ఎరుకుల ( వీరు బుట్టలను వెదురు పుల్లలతో తయారు చేస్తారు.)
#ఈత పుల్లల ఎరుకుల (వీరు బుట్టలను ఈత పుల్లలతో తయారు చేస్తారు.)
#కుంచపురి ఎరుకుల ( వీరు దువ్వెనలు తయారు చేస్తారు .)
#పరికె ముగ్గుల ఎరుకుల ( వీరు భవిషత్ వాణి చెప్పటం ధ్వార జీవనము సాగిస్తారు.)
#కరివేపాకు ఎరుకుల ( ఆకు కుారలు అమ్ముట ధ్వార జీవనము సాగిస్తారు )
#ఉప్పు ఎరుకుల ( ఉప్పు అమ్ముట ధ్వార జీవనము సాగిస్తారు )
 
ప్రతి ఉప జాతి నాలుగు [[గోత్రములు|గోత్రము]]గా విభజించబడినది
#కావాడి
#సాతుబడి
#మానుబడి
#మేండ్రగూతి
 
ప్రతి గోత్రమునకు అనేక ఇంటి పేర్లు కలవు.( ఏ గోత్రమునకు చెందినవారు అనేది ఇంటి పేర్లు ఆధారముగా గుర్తిస్తారు )
 
[[కోరమ]] ,[[కోరభ]],[[కానిమాను]],[[కనిహేలు]], మరియు ఇతర పేర్లతో పిలువబడుచున్న [[కాణి]] చెప్పు వారు కూడ ఎరుకుల జాతి కి చెందిన వారు.
 
==మతము==
ఎరుకుల ప్రజలు హిందు దేవతలైన , [[శివుడు]], [[వెంకటేశ్వరుడు]], [[నరశింహస్వామి]], [[నారయణస్వామి]], [[రాముడు]] ని ఆరాధిస్తారు. మరియు [[పోలిమేర]] దేవతలైన [[అంకమ్మ]], [[కోల్లపుర]],[[సుంకలమ్మ]], [[పోలేరమ్మ]],[[ఎల్లమ్మ]], మొదలగు గ్రామ దేవతలను ఆరాధిస్తారు. ఎరుకుల ప్రజలు ప్రకృతి దేవతలైన సూర్యుడు, చంద్రుడు, మరియు అగ్నిని పూజిస్తారు.హిందు పండగలను ఆచరిస్తారు. సంక్రాంతి, శివరాత్రి, శ్రీరామనవమి, దసర,ఉగాది పండగలను ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో హిందు ఆలయములలోనికి అనుమతి నిరాకరించుట వలన చెట్లు వద్ద రాతి బోమ్మలు, మట్టి బోమ్మలు పెట్టుకోని ఆరాధిస్తారు. ఎక్కువమంది ప్రజలు హిందు మతాన్ని పాటిస్తారు. ఐతే ఇప్పుడిప్పుడే మిషనరీల ప్రభావంతో క్రైస్తవమతం చొచ్చుకు వస్తుంది. క్రైస్తవులు గా మారిన కూడ తమ స్వంత గుర్తింపుతో క్రైస్తవ మతము(లేక) పాటించే విధానము ద్వారా తమ ప్రత్యేకతను కాపాడుకోంటున్నారు.
 
==సామాజిక పద్దతులు==
ఎరుకుల ప్రజలలో సాధారణముగా కుటుంబ వ్యవస్ధ తండ్రి వారసత్వ సాంప్రదాయకముగా ఉంటుంది. వివాహాలలో మేనరిక సంబంధాలు అనుమతిస్తారు . ఏక భార్యత్వము కుటుంబ సాంప్రదాయక ప్రమాణము . ఐతే కోన్ని ప్రత్యేక సందర్భములలో బహు భార్యత్వము అనుమతిస్తారు.వివాహలు సాధారణముగా చర్చల ద్వార , కానుకలు ( [[ఓలి]] ) ద్వార జరిపిస్తారు. సాంప్రదాయకముగా వివాహము ఐన స్త్రీలు వివాహమునకు గుర్తుగా కంఠాభరణము ధరిస్తారు. ఈ కాలములో తాళి బొట్టు ,మంగళ సూత్రము ధరిస్తున్నారు. విడాకులు అనుమతిస్తారు కాని వ్యభిచారము, పిల్లలు పుట్టక పోవటము కారణముగా భార్య, భర్తలలో ఎవరైన విడాకులు కోరవచ్చు. వితంతువులు మరోక వివాహమునకు అర్హులు. కుటుంబ సమస్యలు చర్చల ద్వార లేదా కుల పంచాయితీ ద్వారా పరిష్కరిస్తారు. ఎరుకుల కుటుంబ వ్యవస్థను నడిపించటానికి సామాజికముగా వారికి క్రమశిక్షణ పద్ధతులు ఉన్నాయి. వాటిని కుల పంచాయితీ లని అంటారు. కుల పంచాయితి లో అనేక మంది అనుభవము కలవారు ఉంటారు. వారికి అనుభశాళి , కుల వ్యవస్థను గూర్చిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నాయకుడుగా ఉంటారు. కుల పంచాయితీ కుటుంబ తగాదాలు, నేరాలు, వ్యభిచారము, అప్పులు, ఆస్తి వివాదాలు, భూ వివాదాలు మొదలగు వాటిని పరిష్కరిస్తుంది. ఈ కుల పంచాయితీ లో నేర నిర్ధారణ కోన్ని పద్ధతుల ఆధారముగా జరుగుతుంది. 1) వేడి నూనెలో చేతిని ముంచటము ద్వార 2) కాలిన ఇనుప కడ్డీను చేతులతో పట్టుకోవటము ద్వార 3) నిప్పల మీద నడువుట ద్వార నేర నిర్ధారణ జరుగుతుంది. కుల పంచాయితీలలో వివాదాలు పరిష్కరించటమే కాకుండా స్థానిక సంఘములో ఐకమత్యమును మరియు వ్యక్తిగత ప్రవర్తన పరిశీలన జరుగుతుంది. ఎవరైనా కుల పంచాయితీను అతిక్రమించితే వారిని కుల బహిష్కరణ చేస్తారు.
 
==ఆహర అలవాట్లు==
ఎరుకుల ప్రజలు మాంసహరులు, బియ్యము, పప్పు దినుసులు ఆంధ్ర ప్రాంతాలలో భుజిస్తారు. రాగి జావ, బియ్యము రాయలసీమ , తెలంగాణ ప్రాంతాలలో భుజిస్తారు.సాంప్రదాయకముగా చాపలు అల్లటము, పశు పోషణ, పందుల పెంపకము, బుట్టలు తయారు చేయటము, చీపుర్లు తయారు చేయటము తమ వృత్తిగా కొనసాగిస్తారు. మరియు చిన్నచిన్న వ్యాపారాలు చేస్తారు . ఎరుకుల స్త్రీలు భవిష్యత్తు వాణి ([[సోది]]) చెప్పటములో ప్రత్యేకముగా ఉంటారు మరియు కుటుంబ పాలనలో తెలివిగా ఉంటారు.
 
 
 
 
 
 
[[ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా]] లో 33వ కులం. తెలంగాణాలోని ఎరుకలవాళ్ళు మాత్రం [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] ఎ గ్రూపులో 25 వ కులం. అందుకే తెలంగాణా ఎరుకలవాళ్ళు షెడ్యూల్డు తెగ గుర్తింపునే కోరుతున్నారు. గిరిజన తెగలలో ఈనాడు ఎరుకలు సాంఘికంగా బలమైన [[తెగ]]. ఎరుకలమ్మలు [[సోదె]] చెప్పేవారు. [[స్టూవర్టుపురం]], [[కప్పరాళ్ళతిప్ప]], [[సీతానగరం (తాడేపల్లి)]] లాంటి గ్రామాలు ఈ తెగ ప్రజల ఆధిపత్యంలో ఉన్నాయి. ఎరుకల భాష తమిళ భాషకు దగ్గరగా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/ఎరుకల" నుండి వెలికితీశారు