నల్లమలపు శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

+సమాచార పెట్టె
పంక్తి 9:
 
== జీవితం ==
శ్రీనివాస్ ది గుంటూరు. తండ్రి స్వంత లారీ నడిపేవాడు. తల్లి గృహిణి. అతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి గణితం పరీక్షలో మొదటి సారి ఉత్తీర్ణుడు కాలేక మళ్ళీ రాసి పాసయ్యాడు. కళాశాల చదువుకు వెళ్ళే సమయానికి తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం అతని మీద పడింది. వాళ్ళ పక్కింట్లో ఉన్న రంగారావు అనే వ్యక్తి [[పత్తి]] విత్తనాల వ్యాపారం చేస్తుంటే అందులో సహాయకుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. అక్కడే ఐదారేళ్ళు పనిచేశాక తనే స్వంతంగా ఓ సంస్థను ప్రారంభించాడు. ఇప్పటికీ ఆ సంస్థ పనిచేస్తూనే ఉంది.
 
సినీ నిర్మాత [[బెల్లంకొండ సురేష్]] ఇతనికి మేనమామ. వ్యాపార నిమిత్తం హైదరాబాదుకు వెళ్ళి ఆయన్ను కలిసినప్పుడు సినీ నిర్మాణంతో అనుబంధం కలిగింది. అలా 1997 లో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అతను పనిచేసిన మొదటి సినిమా [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]] కథానాయకుడిగా నటించిన [[సాంబయ్య]]. హైదరాబాదులో శ్రీనివాస్, దర్శకులు [[వి. వి. వినాయక్]], డాలీ, మిత్రుడు గోపిలతో కలిసి జూబ్లీహిల్స్ లో ఉండేవాళ్ళు.
 
== కెరీర్ ==