సుత్తివేలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
==నట ప్రస్థానం==
ఈయనకు చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. 1966లో పి.యు.సి చదివిన అనంతరం, హైదరాబాదుకు[[హైదరాబాదు]]కు చేరుకున్నాడు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవాడు. 1967లో ఉద్యోగం మారి [[బాపట్ల]] చేరుకున్నాడు. ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవాడు.
 
1981లో [[విశాఖ]] డాక్ యార్డులో శాశ్వత ఉద్యోగం రావడంతో అక్కడికి మకాం మార్చాడు. భమిడిపాటి '''అంతా ఇంతే''' నాటకం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. '''మనిషి నూతిలో పడితే''' అనే నాటకంలో ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ [[జంధ్యాల]] తన చిత్రం [[ముద్ద మందారం]]లో అయనకు రిసెప్షనిష్టుగా చిన్న పాత్రను ఇచ్చాడు. ఇలా 1981 లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. అటు పిమ్మట జంధ్యాల, తన వరుస చిత్రాలైన [[మల్లె పందిరి]], [[నాలుగు స్తంభాలాట]] లలో కూడా సుత్తివేలుకు అవకాశాలనిచ్చాడు. ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
 
ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించాడు. [[ఆనంద భైరవి]], [[రెండుజెళ్ళ సీత]], [[శ్రీవారికి ప్రేమలేఖ]], [[చంటబ్బాయి]] వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించాడు. [[త్రిశూలం]] చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందాడు. తర్వాత [[టి. కృష్ణ]] వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చాడు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు, ఈ చిత్రాలలో తన నటనలోని మరో పార్శ్వాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. [[వందేమాతరం]], [[ప్రతిఘటన]], [[కలికాలం]], [[ఒసేయ్ రాములమ్మ]] చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. [[వందేమాతరం]] చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా '''నంది ''' పురస్కారాన్ని అందుకున్నాడు.
 
ఈయన తన స్థిర నివాసం [[మద్రాసు]]లో ఏర్పరుచుకున్నాడు. చిత్రపరిశ్రమ [[హైదరాబాదు]]కు తరలడంతో తగినన్ని అవకాశాలు దక్కించుకోలేక పోయాడు. దీనితో పలు [[టెలివిజన్]] ధారావాహికలలో నటించాడు. [[ఆనందోబ్రహ్మ]], [[మల్లాది రామకృష్ణశాస్త్రి]] కథలు, భమిడిపాడి రామగోపాల్ కథలు ఈయనకు మంచిపేరు తీసుకువచ్చాయి. చివరి రోజులలో తన మకాంను [[హైదరాబాదు]]కు మార్చాడు.
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/సుత్తివేలు" నుండి వెలికితీశారు