గ్రంధి మల్లికార్జున రావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: రిఫరెన్సులు → మూలాలు using AWB
పంక్తి 43:
 
==వ్యాపార ప్రస్థానం==
మల్లికార్జునరావు [[1974]]లో ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ విభాగంలో చేరాడు. [[1976]] ఇలా చిన్న ఉద్యోగస్తులు ఎక్కువ డబ్బు సంపాదించలేరని కుటుంబ రీత్యా వస్తున్న జూట్ మిల్లులలో వ్యాపారానికి ఉపక్రమించాడు. చెన్నైలో[[చెన్నై]]లో ఒక పాత జూట్ మిల్లుకొని దానిని పార్టు పార్టులుగా రాజాం తరలించి అక్కడ "వాసవి మిల్స్" అనే ఒక మిల్లును మొదలుపెట్టాడు. 1978లో వరలక్ష్మి మిల్స్ అనే మరొక జూట్ మిల్లును ప్రారంభించాడు. 1983లో [[ఫెర్రో అల్లాయ్స్]] కర్మాగారాన్ని నిర్మించాడు. అప్పుడే "జి.ఎమ్.ఆర్. టెక్నాలజీస్ & ఇండస్ట్రీస్" ప్రాంభమయ్యింది.
 
1984-85 ప్రాంతంలో [[వైశ్యా బ్యాంకు]]లో పెట్టుబడులు పెట్టసాగాడు. తన మిత్రుడైన [[రమేష్ గెల్లి]] ప్రోద్బలంతో వైశ్యాబ్యాంకు బోర్డు సభ్యుడయ్యాడు. 1991-982లో వైశ్యాబ్యాంకు హక్కుదారుల షేర్లను పెద్దమొత్తంలో కొని ఆ బ్యాంకుకు అతిపెద్ద వాటాదారుడయ్యాడు. 1994లో బ్యాంకునుండి రమేష్ గెల్లి నిష్క్రమించినపుడు మల్లికార్జునరావు తన కార్యకలాపాలను [[బెంగళూరు]], [[శ్రీకాకుళం]] - రెండు చోట్లనుండి నడుపుకోవాల్సివచ్చింది. 1995లో ఒక చక్కెర మిల్లు లైసెన్సు పొంది, దానితోపాటు 16 మెగావాట్ల [[కో-జెనరేషన్]] విద్యుత్‌కర్మాగారాన్ని శ్రీకాకుళంలో మొదలుపెట్టాడు. 1996లో మద్రాసు వద్ద బేసిన్‌బ్రిడ్జి డీసెల్ విద్యుత్కేంద్రం కంట్రాక్టు పొందాడు. 1996-97లో బెంగళూరుకు మారాడు. 1998లో [[మంగళూరు]] వద్ద తనీర్ భావి పవర్ ప్రాజెక్టు మొదలయ్యింది. 1998లో మొదలు పెట్టిన బ్రూవరీ బిజినెస్ 2001లో [[విజయ్ మాల్యా]]కు చెందిన [[యు.బి.]] గ్రూప్‌కు 53 కోట్లకు అమ్మివేశారు.
 
2002లో తమిళనాడులో[[తమిళనాడు]]లో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో[[ఆంధ్రప్రదేశ్‌]]లో ఒకటి జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేజిక్కించుకొన్నారు. 2003లో హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం వారికి చిక్కింది.ఇది ఈయనకు మ0చిమంచి గుర్తి0పు తెఛ్ఛి0దితెఛ్ఛింది. 2003లో తన [[వైశ్యాబ్యాంకు]] షేర్లను 560 కోట్లకు అమ్మేశాడు. అలాగే 2003లో మొదలుపెట్టిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని 13కోట్ల లాభానికి అమ్మేశాడు. 2004లో [[వేమగిరి]] విద్యుత్‌కర్మాగారం పని మొదలయ్యింది. ఇది ఈ సంస్థయొక్క మూడవ విద్యుదుత్పాదక కేంద్రం.
 
2006లో భారత దేశంలో రెండవ పెద్ద విమానాశ్రయం అయిన [[ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]] ప్రైవేటీకరణకు కంట్రాక్టును సాధించి జి.ఎమ్.ఆర్. సంస్థ దేశంలో గుర్తింపు పొందింది.<ref>{{cite web | title= Indira Gandhi International Airport| url=http://www.newdelhiairport.in/| publisher=| date=| accessdate=2008-04-24}}</ref>. ఈ కాంట్రాక్టు సాధించడానికి తగిన అర్హత కోసం [[:en:Fraport AG|Fraport AG]] అనే అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి 500 మిలియన్ డాలర్లు వెచ్చించారని అంచనా. ఇదే సంస్థ నిర్మించిన హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో ప్రారంభం అయ్యింది.<ref>{{cite web | title= GMR wins bid| url=http://members.forbes.com/global/2006/1127/034.html| publisher=| date=| accessdate=2008-04-24}}</ref>