అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
అలిపిరి నుండి తిరుమలకు ఉన్న రెండు తారు పరచిన ఘాట్ రోడ్డులలో పాత దాన్ని 1945లో వేశారు. 19 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని ఇప్పుడు కేవలం తిరుమల నుండి వాహనాలు దిగిరావటానికే ఉపయోగిస్తున్నారు. 1974లో కొత్తగా నిర్మించిన రెండవ ఘాట్ రోడ్డును తిరుమల కొండ పైకి వాహనాలు వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు.
=='''అలిపిరి'''==
పూర్వం రవాణా సౌకార్యాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో తిరుమల పైకి వెళ్ల డానికి కేవలం ప్రస్తుతం ఉన్న మెట్ల దారె శరణ్యం. సుధూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి వద్దకు వచ్చి అక్కడ వున్న సత్రాలలో కొద్ది సేపు సేదతీరే వారు. అక్కడి నుండి మెట్ల దారి గుండా నడచి వెళ్లే వారు. నడవ లేని వారికి ''డోలీలు'' వుండేవి. వాటిని మనుషులు మోసే వారు. అప్పుడప్పుడే తయారయిన మట్టి రోడ్డు ద్వారా ఎద్దుల బండ్ల మీద కూడా భక్తులు పైకి వెళ్ళేవారు. అలా ఎద్దుల బండ్లను నడిపేవారు తిరుపతిలో ఎక్కువగా వుండే వారు. వారు నివసించిన ప్రాంతం పేరు ''బండ్ల వీది'' అది ఈ నాటికి ఉంది. ఆ విధంగా ఆరోజుల్లో సుధూర ప్రాంతాలనుండి వచ్చే యాత్రీకులు ఈ తిరుమల కొండ పాద బాగాన ఆగి .అక్కడ వున్న వనరులను ఉపయోగించుకొని అలసట తీసుకునే వారు. అందుకుకే దీనికి ''అలిపిరి'' అని పేరు. ''అలిపిరి'' అనగా అలసట తీర్చుకునే ప్రాంతం అని అర్థం. ఇక్కడి ఇంకో విశేషం ఏమంటే.... గతంలో దళితులు అనగ అంటరాని వారికి ఆలయ ప్రవేశం వుండేది కాదు. వారు కనీసం ఈ కొండలపైన కాలు కూడా మోపే వారు కాదు. అది పెద్ద అపచారం. ఎవరూ వీరిని కట్టడి చేయకున్న స్వచ్ఛందంగా వీరు కొండ పైకి ఎక్కే వారు కాదు. అలా కొండ పై కాలు మోపితే మహా పాతకం చుట్టు కుంటుందని వారి నమ్మిక. అలాంటి వారి కొరకు ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద గుండు ఉంది. వారు ఈ గుండుకు తల తాకించి ఆ దేవ దేవుని అనుగ్రహం పొందే వారు. ఆలా వారు తర తరాలుగా తలలు ఆ గుండుకు తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. ఆ గుండు ఈ నాటికి ఉంది. దానిని [[తల తాకుడు గుండు]] [[తల యేరు గుండు]] అని అంటారు. ఇక్కడి నుండి మెట్ల దారి చాల కష్టంగా వుంటుంది. మోకాళ్లు పట్టు కోకుండా ఆ కొండను ఎక్కలెరు. మోకాళ్లు నెప్పులు రాకుండా వుండాలంటే ఆ తలయేరు గుండుకు మోకాలును తాకించి మెట్లెక్కితే మోకాళ్లు నెప్పి వుండదని పూర్వీకుల నమ్మకం: అలా భక్తులు తమ తలలను, మోకాళ్లను ఆ గుండు తర తరాలుగా తాకించి నందున దానికి గుంటలు పడి ఉన్నాయి. దానిని ఈ నాటికి చూడ వచ్చును. ఆ తర్వాత కాలంలో కూడా కొందరు భక్తులందరు అలవాటుగా ఆ గుండుకు తల తాకించి తమ ప్రయాణాన్ని కొన సాగించేవారు. ఒక పాత సినిమాలో ఈ పాట తిరుమల యాత్రను గుర్తుకు తెస్తుంది. ''తిరుపతి వెంకటేశ్వరా దొరా నివె దిక్కని నమ్మినామురా..... కాలి నడక మారిపోయి కార్ల వసతి కలిగింది.... వచ్చి పోయె వారికెల్ల వనరు బాగ కుదిరింది.... బిచ్చగాళ్ల బొచ్చలోన గచ్చకాయ పడింది..... తిరుపతి వెంకటేశ్వరా దొరా నివే దిక్కని నమ్మినామురా......''
ప్రస్తుతం అలిపిరి వద్ద పెద్ద విశ్రాంతి మందిరాలు, ద్వారాలు, అందమైన ఉద్యాన వనాలు, ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సదుపాయాలు జరుగు తున్నాయి. ఇక్కడ శ్రీ వారి పాద మండపం అని ఒక ఆలయమున్నది. ఇక్కడ శ్రీ వారి వెండి పాదుకలను తలమీద పెట్టుకొని తమ భక్తిని చాటు కుంటారు. దానికి కొంత రుసుమును వసూలు
పంక్తి 27:
[[File:Alipiri talayeru gumdu.JPG|thumb|240px|తలయేరు గుండు]]
మెట్ల దారినే సోపానమార్గం అంటారు.
;==పాదాలమండపం==
ఇక్కడి నుండి కొండపైకి మెట్లు మొదలవుతాయి (అలిపిరి అంటే మెదటి మెట్టు అని ఒక అర్దం) . ఇక్కడ వేంకటేశ్వరుని మరియు జయవిజయుల విగ్రహాలు ఉన్నాయి.1990 వ దశకం వరకూ ఇక్కడ స్వామివారి పాదాలు మాత్రమే వుండేవి. స్వామి కొండ పైకి ఎక్కేప్పుడు మెదటి అడుగు ఇక్కడ పెట్టారని ఒక ప్రతీతి. ఇక్కడి పాదాల మడపంలో స్వామివారు కొండకు ఎక్కేప్పుడు పాదరక్షలతో వెళ్ళకూడదని తన పాదరక్షలు ఇక్కడ వదలి వెళ్ళారని అంటారు.నేటికీ ఇక్కడ స్వామివారి పాదరక్షలని చెప్పబడే తోలు చెప్పులు, వాటికి నకళ్ళు అని చెప్పబడే ఇత్తడి చెప్పులూ ఉన్నాయి.
;==తలయేరుగుండు==
 
కొండ ఎక్కేవారు తలయేరు గుండుకు తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు వుండవని భక్తుల నమ్మకం. శతాబ్దాల తరబడి భక్తులు ఈ గుండుకి భక్తితో తమ తలను, మోకాళ్లను తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. చిత్రంలో వాటిని చాల స్పష్టంగా చూడవచ్చు. గతంలో అంట రాని వారు తిరుమలేసుని గుడి లోనికి వచ్చేవారు కాదు. కనీసం ఏడు కొండలను కూడా ఎక్కేవారు కాదు. అలా చేస్తే అది మహా పాపమని భావించే వారు. అలాంటి వారు ఈ తలయేరు గుండు వరకే వచ్చి తమ తలను ఈ గుండుకు తాకించి అక్కడి నుండే స్వామి వారికి నమస్కరించే వారు. అంతకు మించి వారు ముందుకి వెళ్లె వారు కారు. అంట రాని వారు ఇక్కడ మెట్లమీద సాస్టాంగ పడి స్వామి వారికి నమస్కారం చేసే వారు. అలాంటి సాస్టాంగ నమస్కార ముద్రలో వున్న అంట రాని వారి శిల్పాలు ఇప్పటికి అక్కడ మెట్లపై ఉన్నాయి. మెట్ల దారిలో వెళ్లె వారికి ఇవి సుపరిచితమె. ఇక్కడి నుండి పైనున్న గాలి గోపురం వరకు మెట్లు చాల ఎత్తుగా వుంటాయి. వాటిని ఎక్కే టప్పుడు మోకాళ్ల నెప్పులు పుట్టేవి. మెట్లు ఎక్కే భక్తులు తమ మోకాళ్లను ఈ గుండుకు తాకించి ఎక్కితె మోకాళ్లు నెప్పులు వుండవని భక్తులు నమ్మె వారు. దానికి మోకాళ్ల మెట్లు, లేదా మోకాళ్ల కొండ అని పిలిచే వారు. ప్రస్తుతం మెట్ల దారి ద్వార వెళ్లె భక్తులకు కొంత వెసులు బాటు ఉంది. వారి సామానులను ఉచితంగా వాహనాల ద్వార పైకి చేర్చడము, నడచి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడము వంటివి అమలులో ఉన్నాయి. అదియును గాక ఎండకు వానకు రక్షణగా మెట్ల దారి వెంబడి పైకప్పు నిర్మించి ఉన్నారు. అక్కడక్కడా త్రాగు నీటి వసతి, విశ్రాంతి కొరకు
పంక్తి 40:
;తోవ భాష్యకారుల సన్నిధి
 
;==కురువ మండపం==
ఇక్కడ తొండమాను రాజుల కాలంలో కురువనంబి అనే భక్తుడు శ్రీనివాసుని నైవేద్య వంటకు కావలసిన కుండలు చేసేవాడట. అతను అక్కడే ఒక కొయ్యతో స్వామి వారి విగ్రహాన్ని చేసి, దాన్ని మట్టితో చేసిన పూలతో పూజించేవాడట. అక్కడ తిరుమలలో స్వామి వారిని రాజు బంగారుపూలతో పూజించినపుడు ఆపూలు తొలగి ఈమట్టి పుష్పాలు కనిపించేవట. [[అన్నమయ్య]] "కొండలలో నెలకొన్న..."లో "కుమ్మరదాసుడైన కురువరతినంబి" అని రాసింది ఈయన గురించే. స్వామివారు ఈ నంబి వద్ద మట్టి కుండలోని సంగటి తినేవారట. నేటికీ తిరుమలకొండపై స్వామి వారికి (బంగారు పాత్రలు ఎన్ని వున్నా) మట్టికుండలోనే నైవేద్యం సమర్పిస్తారు. ఈకురువ మండపంలో కుండలు చేసే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి.
;యోగ నరసింహస్వామి
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు