తిక్కవరపు పఠాభిరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి using AWB
పంక్తి 40:
==జీవిత విశేషాలు==
[[బొమ్మ:Pattabhi -Snehalata.jpg|right|thumb|పఠాభి - స్నేహలత]]
పఠాభి [[1919]] [[ఫిబ్రవరి 2]] న [[నెల్లూరు]]లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు రామిరెడ్డి. భూస్వామి. [[మహాత్మా గాంధీ]] వారి ఇంటికి వచ్చినపుడు, ఆయన స్ఫూర్తితో అంతా స్వాతంత్య్ర సమరంలోకి దూకారు. [[రవీంద్రనాధ టాగూరు]] స్ఫూర్తితో పఠాభి [[శాంతి నికేతన్‌]]కు వెళ్ళి చదువుకున్నాడు. పట్టభద్రుడయ్యాక [[కలకత్తా]] విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు. [[1938]]లో కలకత్తా నుండి తిరిగివచ్చి కొన్నాళ్ళు [[గూడూరు,నెల్లూరు|గూడూరు]]లో కుటుంబ వ్యాపారమైన [[అభ్రకం]] ఎగుమతి వ్యాపారం చేసాడు. తరువాత అమెరికాలోని[[అమెరికా]]లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితం చదివాడు. అమెరికా వెళ్లేముందే ''ఫిడేలు రాగాల డజన్‌'' రచించాడు. [[తెలుగు ఆధునిక కవిత్వం]]లో ఇది కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటికీ దానికి ఆదరణ ఉండడం గమనార్హం. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండో ప్రపంచ యుద్ధ]] సమయంలో సైన్యంలో చేరాలని [[అమెరికా]] బలవంతపెట్టింది. బ్రిటిష్‌వాళ్లు[[బ్రిటిష్‌]]వాళ్లు భారతీయుల్ని జైళ్లలో నెట్టినందుకు నిరసనగా సైన్యంలో చేరేందుకు నిరాకరించారు. సాహసోపేత యాత్రతో అమెరికా వదిలి [[దక్షిణ అమెరికా]], [[ఆఫ్రికా]]ల మీదుగా నౌకలో భారత్‌ చేరుకున్నాడు.
 
[[బొమ్|thumb|left|250px|పఠాభి కుటుంబ సభ్యులు]]
పంక్తి 46:
 
 
[[కె.వి.రెడ్డి]]తో కలిసి జయంతి పిక్చర్స్‌ను స్థాపించి తెలుగు చిత్రాలు తీశారు. [[పెళ్లినాటి ప్రమాణాలు]] చిత్రం [[ఆంధ్రప్రదేశ్‌]] ప్రభుత్వ అవార్డు దక్కించుకుంది. [[1971]]లో ''సంస్కార'' చిత్రం [[రాష్ట్రపతి]] నుంచి స్వర్ణకమలం అందుకుంది. ఈ సినిమాలో ఆయన భార్య స్నేహలత కథానాయిక. [[ఎమర్జెన్సీ]] సమయంలో జైలు జీవితం అనుభవించి, అనారోగ్యంతో స్నేహలత [[1977]]లో మరణించింది.
 
87 ఏళ్ళ వయసులో [[2006]] [[మే 6]]న పఠాభి [[బెంగళూరు|బెంగుళూరులో]] మరణించాడు.