కోదాటి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

+/- మూస
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోదాటి నారాయణరావు''' ([[డిసెంబరు 15]], [[1914]] - [[నవంబరు 11]], [[2002]]) గ్రంథాలయోద్యమం నేత మరియు విశాలాంధ్ర ప్రచారకులు.
 
వీరు [[నల్గొండ జిల్లా]] [[రేపాల]] గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి రంగారావు గారు రేపాల కరణంగా చేసేవారు. రేపాలలోని శ్రీ లక్ష్మీనరసింహ మనోహర బాలభారతీ పుస్తక భాండాగారం బాల్యం నుండే అతన్ని ఆకర్షించింది. దాని కార్యకర్తగా గ్రంథాలయ మంచి చెడ్డలు చూసేవారు. ప్రాథమిక తర్వాత [[సూర్యాపేట]]లో [[మెట్రిక్]] పూర్తిచేశారు. ఆర్థిక కారణాల వలన సాయం కళాశాలలో చేరి పట్టా పొందారు. ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. వీరు కొంతకాలం [[గోలకొండ]] పత్రికలో పనిచేసి, జర్నలిజంపై ఆసక్తి కలిగి మందుకుల నరసింగరావు సంపాదకత్వంలోని "రయ్యత్" పత్రికలో ఏజెంట్ గా పనిచేశారు. తర్వాత ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఏజన్సీ తీసుకోవడంతో ప్రజా జీవనంతో సంబంధంలో ఏర్పడింది. వీరు అస్పృశ్యతా నివారణోద్యమం, [[గ్రంథాలయోద్యమం]], జాతీయోద్యమం లలో ప్రముఖ పాత్ర పోషించారు. [[ఖమ్మం]]లోని [[విజ్ఞాన నికేతన గ్రంథాలయం]] ఆయన కృషి వలన స్థాపించబడింది. గ్రంథాలయోద్యమం ద్వారా విశాలాంధ్రకు నాందిపలికాడు. విజ్ఞాన నికేతనానికి జరిగే వార్షికోత్సవాల ద్వాతా నిజాం మరియు బ్రిటిష్ వారిలో ప్రముఖులను కోదాటి సమావేశపరిచేవారు.
 
1944లో [[ఇల్లెందు]]లో 25వ ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు [[బూర్గుల రామకృష్ణారావు]] అధ్యక్షతన జరిగింది. [[కోస్తా]], [[రాయలసీమ]], [[తెలంగాణ]] ప్రాంతాల నుండి అనేకమంది ప్రముఖులు విచ్చేశారు. [[విశాలాంధ్ర]] స్వరూపాన్ని ఆ సభ ప్రతిబింబించింది. గ్రంథాలయోద్యమం యావదాంధ్ర దేశానికి ప్రాతినిధ్యం వహించే ఉద్యమంగా మారింది.
పంక్తి 11:
తెలంగాణా ఉద్యమంలో కోదాటి, [[కాళోజీ]], [[కొమరగిరి నారాయణరావు]] గారలు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వీరిని ''నారాయణ త్రయం'' లేదా ''కకారత్రయం'' అనేవారు. కోదాటి నారాయణరావు పలువురు కవులు కళాకారులు రచయితలను ప్రోత్సహించేవారు. అనేక అవార్డులు సాధించిన నాటకకర్త [[కె.ఎల్.నరసింహారావు]] తాను తొలినాళ్ళలో రాసిన నాటకాన్ని చదివించుకున్న తొలిశ్రోత, తనకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తీ కోదాటియే అని వ్రాసుకున్నారు.<ref name="అడుగుజాడలు నాటకం">{{cite book|last1=నరసింహారావు|first1=కె.ఎల్.|title=అడుగుజాడలు (నమస్కారం వ్యాసం)|date=9 నవంబరు 1956|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=ad%27ugu%20jaad%27alu&author1=narasin%27haa%20raavu%20ke%20yal&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=109&barcode=2030020025190&author2=&identifier1=&publisher1=aan%27draa%20buk%20haus&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/161|accessdate=5 March 2015}}</ref>
 
ఆంధ్ర రాష్ట్ర, అఖిల భారత కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. కొంతకాలం రాష్ట్ర స్థాయి సహకార సంఘానిని అధ్యక్షులుగా పనిచేశారు. ఇవికాక [[ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ]] అధ్యక్షునిగా, [[గాంధీ స్మారక నిధి]] కార్యదర్శిగా, [[గాంధీ భవన్]] మేనేజింగ్ ట్రస్టీగా, [[సర్వోత్తమ గ్రంథాలయం|సర్వోత్తమ గ్రంథాలయానికి]] అధ్యక్షునిగా ఆయన వ్యవహరించారు. కృష్ణదేవరాయ[[కృష్ణదేవరాయఆంధ్ర ఆంధ్ర భాషా నిలయంభాషానిలయం]] అధ్యక్షులుగా, భాగ్యనగర ఖాదీ సమితి కార్యదర్శిగా కూడా పనిచేశారు.
 
[[కాకతీయ విశ్వవిద్యాలయం]] కోదాటికి గౌరవ [[డాక్టరేట్]] ప్రదానం చేసింది.
"https://te.wikipedia.org/wiki/కోదాటి_నారాయణరావు" నుండి వెలికితీశారు