దిగవల్లి వేంకటశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 140:
==1932 civil disobedience movement ఉద్యమంలో శివరావు గారి పాత్ర, వారి కృషి==
 
ఆంగ్ల ప్రభు భక్తి, ఆంగ్ల సంస్థానలపై సంయమనం కలిగియున్నంత కాలం దేశీయ ఉద్యోగులలోను సామాన్య ప్రజలలోను గూడా స్వపరిపాలనా కాంక్ష కలుగదని గ్రహించిన గాంధీగారు ఈ సహాయ నిరాకరణోద్యమము చేపట్టారని శివరావుగారు 1966 లోజరిగిన తన సన్మాన సభలో చేప్పారు. 1932 ఏప్రిల్ నెలలో కాకినాడ వాస్తవ్యులు కాంగ్రెస్సు అగ్రనేత అయినట్టి డా [[చెలికాని రామారావు]] గారు కాంగ్రెస్సు బోధనలు కార్యకలాపాలు మార్గదర్శనాలు మోదలగు విషయాల కరపత్రాలు రహశ్యంగా బెంగుళూరు నుండి ముద్రించి ఈ ప్రాంతల్లో పంచపెట్టతున్న రోజులలో బెజవాడనుండి శివరావుగారు మారు పేరుతో (వెంకట్రావను మారు పేరుతో) వారితో కలసి పనిచేస్తూ తపాలా పెట్టిలాగ జనార్దనరావు అనే ఒక ఇన్స్యూరెన్స ఏజెంటు ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపెవారు.. ఇంకో ఇద్దరు జగన్నాద దాసు, ధరణీప్రగడ సేషగిరి రావు మద్రాసులో నుండి కాంగ్రెస్ కార్యకాలపాలకు ధనం పోగుచేశి ఇక్కడికి పంపిచేవారు. అన్నే ఆంజనేయులుగారు కాంగ్రెస్సు కార్యకర్తలకోసం గ్రామాలలో ప్రచురించే “Ready” అనే పత్రికకు శివరావుగారు చేదోడుగా బెజవాడనుండి అదే పత్రికను సైక్లోస్టైల్ చేసినెలకు 40 మందికి మేజస్ట్రేట్, పోలీసు ఆఫీసర్లకు కూడా పంపిచేవారు. ఈ సైక్లోస్టైల్డు పత్రికనడపటానికి వేలూరి యజ్ఞన్నారాయణ గారు, నూకల రామస్వామి గారు కృషి సల్పేవారు. ఇంతే కాక బ్రిటిష్ ప్రభు భక్తులైన ఉద్యోగస్తులను, పోలీసు వారిని హెచ్చెరిస్తూ కాంగ్రెస్సు ప్రభుత్వము త్వరలో రాబోవునని ఇప్పుడు బ్రిటిష భక్తులు వారి వారి దష్ట చర్యలకు జవాబుచెప్పుకునే రోజు త్వరలోనే రాబోవునని హెచ్చరిస్తూ శివరావుగారు వ్రాసిన కరపత్రములు అచ్చువేయించి కాంగ్రెస్సు కార్యకర్తలు వాటిని పంచపెట్టేవారు. 14/07/1932 నాడు శివరావుగారు మద్రాసు లెజిస్లెటివ్ కౌన్సిల్ కు ఒక ప్రార్థనా పత్రం పంపి కృష్ణాజిల్లాలో జరుగుతున్న పోలీసు వారి నిరంకుశత్వమైన లాఠీ చార్జీలును గూర్చి. ఆ పత్రంలో వారు పోలీసువారి లాఠీచార్జీలో దెబ్బలు తగిలి బెజవాడలోని పీపుల్సు హాస్పిటల్ అన బడే డా శివలంక మల్లిఖార్జునరావుగారి వైద్యశాలలో వైద్యసహాయం పొందిన వారి దిన దిన సంఖ్యలతో సహా పంపిచారు. ఆగస్టు 1932 లో శివరావుగారు కాంగ్రెస్ పశ్చమ కృష్ణా జిల్లా వారి తరఫునే కాకుండా ఆంధ్ర ప్రొవెస్సియల్ తరఫున రెండు వేరు వేరు రిపోర్టులు తయారుచేసి కాంగ్రెస్స అధిష్టానంలో మదన్ మోహన్ మాలవ్యా గారికి అప్పటి బనారస్ హిందూ విశ్వావద్యాలయ కాలేజీ ప్రిన్సిపాలుగా నున్న రుద్రాగారి ద్వారా పంపించారు. ఆరెండు రిపోర్టులు కాంగ్రెస్సు అధిష్ఠానం 15/10/1932 తారీఖునాటి ఎ ఐ సి సి వారి జాతీయ బులెటిన్ లో ముద్రించారు. అంతే కాక ఎ ఐ సి సి వారు తమ రిపోర్టులో పశ్చమకృష్ణా జిల్లా వారి ఈ రిపోర్టులను కొనియాడారు. సెప్టెంబరు 5 1932 నాడు ఇండియా లీగు డెలిగేషన్ వారు బెజవాడ వచ్చినప్పుడు కాంగ్రెస్సు వారి తరఫున శివరావు గారు ఒక మేమొరాండమ్ వ్రాసి స్వయంగా లీగు సభ్యులను కలుసుకుని వారికి అందజేశారు. బెజవాడలో జనవరి 4 వతారీకు 1932 లో section 144 CRPC క్రింద మీటింగులు నిషేధిస్తూ చాటింపుచేసి ప్రత్యేకంగా డా శర్మగారు ప్రభ్రతుల పేరు పేరునా నోటీసు జారీ చేశారు. శివరావు గారు రచించిన 1930 లో ప్రచురించిన ఒక కరపత్రము “దరిద్రనారాయణ “ 1932 లో ప్రెస్స్ రెగ్యులేషన్ ఆర్డినెన్స క్రింద నిషేధించారు [ Saint George Gazette 1932 ]. శివరావుగారు రచించి న కరపత్రాలను ( నిర్భాగ్య భారతము, విదేశ వస్త్ర బహిష్కారము, బ్రిటిష్ వస్తు బహిష్కారము మొదలగు కరపత్రములును ) ఆయ్యదేవర కాళేశ్వరరావు, కాట్రగడ్డ మధుసూధన రావు, కాకుమాను లక్షయ్య చౌదరీ గార్లు పంచపెట్టారని నేరారోపణ కేసు మీద వీరి ముగ్గురును 09/01/1932 తేదీనాడు పోలీసువారు జాయింటు మేజిస్ట్రేటు యస్.ఏ వెంకట్రామన్ ఐ సి యస్ గారి కోర్టులో విచారణకు హాజరు పరిచారు. ఆ కరపత్రాలు చూచిన జాయింటుమేజస్ట్రేటు “ఈ కరపత్రాలు ఎవ్వరు వ్రాశారో గాని అవి చాల తీవ్రమైన ధాటిలోనున్నవి ” అని అన్నారట ఆ విచారణకు పోలీసు సూపరింటెండెంటు కూడా బెంచిమీద కూర్చుని వున్నాడట ( అలా కూర్చోటం అనుచితమే కాక అనర్హతమైన ట్టిది). 29/01/1932 తేదీ నాడు కాట్రగడ్డ మధుసూదనరావుగారి తల్లి రామశేషమ్మగారిని పోలీసులు నిర్బంధనలోకి తీసుకున్నారు ఎందుకంటే ఆమె మొగల్రాజ పురంలో 26/01/1932 తేదీన భారత స్వతంత్రదినోత్సవంగా పరిగణించి జరుపుకున్నారట అందుకు ఆమెకు 6 నెలల ఖారా గార శిక్ష మరియూ జల్మానావిధించారు. ఆవిడ జుల్మానా కట్టకపోతే ఆవిడచేతివి వారి కోడలు చేతి గాజులు జప్తుచేశారు ఆ విధంగా పోలీసుల దురహంకార చర్యలు చేశారు. ఇంకో చోట పోలీసువారు ఇద్దరు మహిళలు బట్టల కొట్టును ముట్టడించినందుకు వారిద్దరును నిర్బంధించి కొన్ని గంటల సేపు కదలనీవకుండా నిర్బంధించి కొట్టి 90 మైళ్ళ దూరం తీసుకు పోయి వదలి పెట్టారు . ఇంకో చోట ఒక గృడ్డి వాడైన భువనవడియం నాగభూషణం అనే వ్యక్తి మూడురంగుల జండా పట్టుకుని ఆనందిస్తున్నందుకు పోలీసులు నిర్బంధించి కొట్టారు. మరి ఇంకోచోట కాంగ్రెస్సు కార్యకర్త వేదాంతం సోమేస్వర శాస్త్రిని రక్తంచిమ్మే వరకూ చితక కొట్టారు. 13/04/1932 తేదీన కాంగ్రెస్సు వాలంటీర్లు జలియన్ వాలా బాగ్ కాల్పుల కర్మకాండ దినం జరుపుకున్నందుకు పోలీసులు కొట్టారు. 27/04/1932 తేదీన వాలంటీర్లు తపాలా కార్యాలయమును ముట్టడించారని నేరంపై కొట్టారు. ఆ విధంగా 14/02/1932 to 04/07/1932 మధ్య జిల్లాలో చేసిన పోలీసుల అత్యాచారాలను శివరావుగారు వ్రాసి మద్రాసు లెజిస్లేటివ అశంబ్లీలో ప్రశ్నించవలసినదని కృష్ణా జిల్లా నుండి ఎన్నికైన సభ్యులు మహాబూబ్ అలీ బైగ్ మరియు సి కోదండరామిరెడ్డి గార్లను కోరారు కానీ వారేమీ కలుగజేసుకో నందున శివరావుగారు వాస్తవిక స్ధితులతో కూడిన ఒక మెమొరాండమ్ తయారు చేసి తన సహోగ్యులైన 20 మంది న్యాయవాదులైన బెజవాడ బార్ మెంబర్లచేత సంతకాలు పెట్టించి తన చిననాటి మిత్రు డూ అప్పటి మద్రాసు లెజిస్లేటివ యశంబ్లీలో సభ్యలూనూ అయిన, మంగళూరులో వకీలుగాయున్న యూ సి భట్ గారికి పంపిచి కృష్ణాజిల్లాలో జరిగిన పోలీసు దుండగ చర్యలను యశంబ్లీ టేబుల్ పై పెట్టి ప్రశ్నంచగా అప్పుడు ప్రభుత్వము వారు దానిని ప్రింటు చేసి ఒక మెమొరాండమ్ ను విడుదల చేశారు అందులో జవాబుగా ప్రభుత్వమువారు ఏమీ చెప్పలేక నీరుకార్చారు. శివరావుగారు స్వతంత్రపోరాటములో చేసి న కృషి అలాగ బహుముఖములుగానున్నది.
 
==ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వమువారి గ్లాసరీ ( నిఘంటువు) కమిటీ లో శివరావుగారి కృషి==