కొల్లిపర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 162:
==గ్రామ విశేషాలు==
#కొల్లిపర గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన చావలి సునీల్ కు చిన్నప్పటి నుండి క్రీడలనిన చాలా మక్కువ. ఇతడు త్రోబాల్ క్రీడలో అత్యుత్తమ శిక్షణపొంది, దానిలో రాణించుచూ, జాతీయస్థాయిలో పలు పతకాలు సాధించాడు. ఇతడు తొలిసారిగా మలేషియా దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో, భారతదేశం, మలేషియా, శ్రీలంక దేశాల మధ్య జరిగిన ముక్కోణపు పోటీలలో భారత జట్టుకు టీం కెప్టెనుగా నిలిచి, విజేతగా బంగారు పతకం సాధించాడు. ఆ తరువాత 2014, జూన్-21 నుండి 23 వరకు జరిగిన ఐదవ ఆసియా త్రోబాల్ ఛాంపియన్ షిప్పు పోటీలలో, భారత జట్టుకు వైస్ కెప్టెనుగా, తన క్రీడా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. భారతదేశంతోపాటు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు పాల్గొన్న ఈ పోటీలలో అన్ని మ్యాచిలలోనూ జట్టును గెలిపించి, మలేషియా ప్రభుత్వం నుండి బంగారు పతకం మరియూ ఙాపిక అందుకున్నాడు. [9]
#ఈ గ్రామానికి చెందిన శ్రీ పుడిపిరి పద్మావతి మగవాడైనా గానీ, ఆడపిల్లలు లేని లోటు తీర్చుకొనేటందుకు, వీరితల్లిదండ్రులు, తన ఐదవ కుమారుడైన ఈయనకు, చిన్నతనంలోనే "పద్మావతి" అని ఆడపిల్ల పేరుపెట్టినారు. ఈయన సమాజసేవ చేయుచూ తన పేరును "నిజం"గా మార్చుకున్నారు. వీరు మానవసేవే మాధవసేవ అని భావించి, 16 సంవత్సరాలుగా సమాజసేవే లక్ష్యంగా రిక్షా తొక్కుతూ దేశయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు, [[మహారాష్ట్ర]], [[పశ్చిమ బెంగాలుపశ్చిమబెంగాల్]], [[కేరళ]], [[కర్నాటక]], [[తమిళనాడు]] రాష్ట్రాలలో సమాజసేవకు ముందుకొచ్చారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వృద్ధులు, అంధులు, వికలాంగులను తన రిక్షాలో గమ్యస్థానం చేరుస్తుంటారు. దేశయాత్రలో ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో నాలుగైదు రోజులు అక్కడే ఉంటూ సమాజసేవకు ఉపక్రమిస్తుంటారు. కడుపు నిండకపోయినా, సాటివారికి సాయపడాలన్నదే ఆయన లక్ష్యం. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా 2,3 రోజులు భోజనం చేయకుండా పస్తులుంటారు. మద్యం, సిగరెట్టు త్రాగేవారిని తన రిక్షా తాకవద్దంటూ బోర్డు ఏర్పాటుచేసారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినపుడు భాషా సమస్య ఎదురుకాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషలలో గూడా మాట్లాడటం నేర్చుకున్నారు. [10]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/కొల్లిపర" నుండి వెలికితీశారు