పోతుగంటి పోశెట్టి: కూర్పుల మధ్య తేడాలు

+లింకులు
పంక్తి 3:
[[ఆదిలాబాద్]] పట్టణంలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన పోతుగంటి ఆశన్న, గంగమ్మ దంపతులకు జన్మించిన ఆయన [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా|కమ్యూనిస్టు పార్టీ]] పోరాటాల పట్ల విద్యార్థి దశలోనే ఆకర్షితులై రాంకిషన్ శాస్త్రి, దాజీ శంకర్ లతో కలసి 1947లో నిర్వహించిన "ఆకలియాత్ర" లో పాల్గొన్నారు. నైజాం దుష్టపాలనకు వ్యతిరేకంగా కట్టుబానిసత్వం, [[వెట్టి చాకిరి|వెట్టిచాకిరి]], కౌలుదారి విధానాలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిపడిన [[తెలంగాణా సాయుధ పోరాటం|తెలంగాణ సాయుధ పోరాటం]]<nowiki/>లో కీలక పాత్ర నిర్వహించారు. ఆ సమయంలో ఎదురైన అనేక కష్టాలను సైతం లెక్కచేయని ధైర్యశాలి. ఫలితంగా అనేక ఇబ్బందులకు గురవడమే కాక అష్టకష్టాలు అనుభవించారు. అయినా పార్టీ పిలుపు మేరకు మొక్కవోని పట్టుదలతో పోరాటాన్ని కొనసాగించారు. పార్టీపై నిషేధం ఉండటంతో [[తిర్యాని|తిర్యాణి]], [[మంగి]] వంటి అటవీ ప్రాంతాల్లో దళాలను ఏర్పాటుచేసుకుని ఆ ప్రాంతంలో దొరల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారు. మూడేళ్లకు పైగా జైలు జీవితం అనుభవించారు. 1950లో జైలు నుండి విడుదలయ్యాక పార్టీ ఆదేశాలమేరకు [[బెల్లంపల్లి]]<nowiki/>లో స్థిరపడ్డారు.
==రాజకీయ జీవితం==
మహ్మద్ ఖాసీం బస్తీలోని అప్పటి జాగీర్దారైన మహ్మద్ ఖాసిం గారు పోశెట్టి గారిపై అభిమానంతో తనకు సంబంధించిన ఇంటిని స్వంతానికి తీసుకొమ్మని చౌకగా ఇవ్వగా దానిని పార్టీ కార్యక్రమాల నిర్వహణకు కార్యాలయంగా ఏర్పాటుచేశారు. ఆ కార్యాలయమే నేటికీ కొనసాగుతూ పార్టీ శాశ్వత తార్యాలయంగాకార్యాలయంగా స్థిరపడిపోయింది. బెల్లంపల్లి పట్టణ సిపిఐ కార్యదర్శిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. అనేక మంది యువకులను చేరదీసి అన్ని విధాల తర్ఫీదు ఇచ్చి, పార్టీ బలోపేతం కావడంలోనూ, ఉద్యమాలు నిర్వహించడంలోనూ పాటుబడ్డారు.
 
1951-52లో చాలా మంది నాయకులు రహస్యంగానూ, జైళ్లలోనూ ఉన్న సమయంలో ఆయన కమూనిస్టు పార్టీ కార్యదర్శిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే 1951 నుండి 53 వరకు ఎఐటియుసి అనుబంధ సంఘమైన [[సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్|సింగరేణి కాలరీస్]] వర్కర్స్ యూనియన్ బ్రాంచి కార్యదర్శిగా కూడా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి, ఈ ప్రాంత కార్మికుల అభిమానాన్ని చూరగొన్నారు. తరువాత ఆయన కుమారస్వామికి యూనియన్ భాద్యతలు అప్పగించి బెల్లంపల్లితో పాటు పరిసర ప్రాంత గ్రామాల్లోని యువకులను చేరదీసి ఎ.ఐ.వై.ఎఫ్ ను బలోపేతం చేయడం ద్వారా పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసారు.
"https://te.wikipedia.org/wiki/పోతుగంటి_పోశెట్టి" నుండి వెలికితీశారు