ఐక్యరాజ్య సమితి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గరిష్ట → గరిష్ఠ, సబ్య → సభ్య using AWB
పంక్తి 58:
# [[ఆహార మరియు వ్యవసాయ సంస్థ]] - (FAO) - ప్రధాన కార్యాలయం [[రోమ్]] నగరంలో ఉంది. 1945 అక్టోబరు 16న [[కెనడా]] దేశపు నగరం [[క్విబెక్]]లో జరిగిన సమావేశంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ కారణంగానే యేటా అక్టోబరు 16ను [[ప్రపంచ ఆహార దినోత్సవం]]గా నిర్వహిస్తున్నారు. పౌష్టికాహారం అందించడం, జీవన ప్రమాణాలు మెరుగు పరచడం, గ్రామీణ ప్రజల స్థితిగతులను అభివృద్ధి చేయడం, ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిమి, పంపిణీని మెరుగు పరచడం ఈ సంస్థలక్ష్యాలు.
# [[అంతర్జాతీయ కార్మిక సంస్థ]] - (ILO) - ఈ సంస్థ కేంద్ర కార్యాలయం [[స్విట్జర్లాండు]] దేశం [[జెనీవా]]లో ఉంది. 1919 ఏప్రిల్ 11న [[నానా జాతి సమితి]] అనుబంధ సంస్థగా ఈ సంస్థ ఏర్పాటయ్యింది. అనంతరం ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థగా రూపు దిద్దుకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న [[కార్మికులు|కార్మికుల]] [[జీవన ప్రమాణాలు]] స్థాయిని పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేశ్తున్నది. 1969లో ఈ సంస్థకు [[నోబెల్ శాంతి బహుమతి]] లభించింది.
# [[దస్త్రం:OMSWorld Health Organisation headquarters, Geneva, north and west sides.jpg|thumb|250px|right|thumb| [[జెనీవా]]లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం]] [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] - (WHO) - 1948 ఏప్రిల 7న ఈ సంస్థ ప్రారంభమైంది. దీని కేంద్ర కార్యాలయం [[స్విట్జర్లాండు]] దేశం [[జెనీవా]]లో ఉంది. ఇంకా అలెగ్జాండ్రియా, బ్రజవిల్లే, కోపెన్ హాగెన్, మనీలా, న్యూఢిల్లీన వాషింగ్టన్ నగరాలలో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించడం, [[అంటు వ్యాధి|అంటు వ్యాధుల]] నివారణ ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. అందుకోసం వైద్య పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. [[మలేరియా]], [[క్షయ]], [[మశూచి]] వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఈ సంస్థ కృషి చేసింది. [[ఎయిడ్స్]] వ్యాధి నిరోధానికి ప్రస్తుతం చాలా కృషి చేస్తున్నది.
# [[ఐక్య రాజ్య సమితి ఫారిశ్రామిక అభివృద్ధి సంస్థ]] - (UNIDO) - ఈ సంస్థ ఐక్య రాజ్య సమితి సాధారణ సభకు చెందిన అంగంగా 1966 నవంబరు 17న ఏర్పాటయ్యింది. 1985లో ప్రత్యేక సంస్థగా గుర్తించారు. ప్రధాన కార్యాలయం [[ఆస్ట్రియా]] దేశపు [[వియన్నా]]లో ఉంది. అభివృద్ధి చెందుతున్న, బాగా వెనుకబడిన దేశాల పారిశ్రామికీకరణకు, సంబంధిత పాలిసీలకు ఈ సంస్థ సహకరిస్తుంది.
# [[ఐక్య రాజ్య సమితి శరణార్ధుల హైకమిషనర్]] - (UNHCR)) - 1951 జనవరి 1నుండి ఈ సంస్థ పని చేయసాగింది. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. శరణార్ధుల పరిరక్షణ ఈ సంస్థ ప్రధాన ధ్యేయం. ఈ సంస్థకు 1954, 1981 సంవత్సరాలలో వోబెల్ శాంతి బహుమతి లభించింది.
"https://te.wikipedia.org/wiki/ఐక్యరాజ్య_సమితి" నుండి వెలికితీశారు