బద్రీనాథ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు, పంను → పాన్ని , లో → లో , ద్వా using AWB |
→తీర్ధ యాత్ర: This is not a port town. |
||
పంక్తి 26:
==తీర్ధ యాత్ర ==
బద్రీనాథ్ [[చైనా]], [[టిబెట్]] సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్కు రెండు రోజుల ప్రయాణదూరంలో ఉంది. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ ధామ్ (నాలుగు సౌధములు) లలో ఇది మొదటిది
==క్షేత్రమహిమ==
ఈ క్షేత్ర మహత్యం స్కందపురాణంలో శివుడు తనపుత్రుడైన కుమారస్వామికి వర్ణించాడు.ఈ క్షేత్రాన్ని కృతయుగంలో ముక్తిప్రద అని, త్రేతాయుగంలో యోగసిద్దిద అని, ద్వాపరంలో విశాల అని పేర్లు ఉండేవి.జీవుడికి స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయని వాటినిజ్ఞానంవలన నశింపచేసే క్షేత్రంకనుక విశాల అనే పేరు వచ్చిందని పురాణ కథనం.ఇక్కడి రేగుచెట్టుకు అమృతం స్రవించినట్లు అందువలన ఇది బద్రీక్షేత్రమని పిలువబడినదని క్షేత్రపురాణం వివరిస్తుంది.బద్రీక్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాలలో లేదని శువుడు కుమారస్వామికి వివరించాడు.ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్ధాలు నిక్షిప్తమై ఉంటాయని స్కందపురాణం చెప్తుంది.ఇది విష్ణుక్షేత్రం విష్ణువు ఏక్షేత్రం విడిచినా ఈ క్షేత్రం విడువడని ప్రతీతి.ఈ క్షేత్రంలో అన్ని తీర్ధాలు మునులు సమస్త దేవతలు నివసిస్తారని వారణాశిలో అరవైవేల సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయదర్శన మాత్రంచే కలుగుతుందని పురాణకథనం.సమస్త దేవతలు మునులు నివసించడం వలన ఈ ఆలయానికి విశాల అని పేరు వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి.ద్వాపరయుగంలో ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్దవుడిని ఈ క్షేత్రానికి వెళ్ళి తపసు చేయమని ఆదేసించడం వలన యాదవకుల వినాశనం జరిగినప్పుడు ఉద్దవుడు రక్షింపబడ్డాడు.
|