సిద్దేంద్ర యోగి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఉన్నది. → ఉంది. (2), , → , using AWB
కృష్ణుడు లింకు సవరణ
పంక్తి 21:
 
 
కూచిపూడి నృత్యానికి ఆద్యుడై సిద్ధేంద్ర యోగి ''భామా కలాపం'' రచించాడు. ఇందులో [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]], [[సత్యభామ]], [[రుక్మిణి]] ప్రధాన పాత్రలు. తన ఊరిలోని మగవారితోనే ఆడవేషాలు వేయించి ఆడించాడు. సిద్ధేంద్ర యోగి యక్షగానాలకు మెరుగులు దిద్ది, భరతుని నాట్యశాస్త్ర రీతులను తన కూచిపూడి నాట్యంలో ప్రవేశపెట్టాడు. శాస్త్రీయ నాట్యరీతుల్ని జానపదకళా నృత్యాలతో మేళవించాడు.
తనను కృష్ణానదిలో మునిగి పోకుండా కాపాడిన ఆ కృష్ణుని స్తుతిస్తూ, సిద్ధేంద్ర యోగి [[పారిజాతాపహరణం]] నృత్యనాటికను వ్రాశాడనీ, అది కూచిపూడి నృత్యనాటకాలలో అతి పురాతనమైనదనీ చెబుతారు. .
 
పంక్తి 28:
 
===[[భామా కలాపం]]===
సిద్ధేంద్రయోగి అంతకుముందే భాగవతులచేత అనేక వేషాలు వేయించియున్నాడు. శ్రీకాకుళంలోని ఆంధ్రవిష్ణువు దేవాలయంలో దేవదాసీలు భగవంతుని సేవగా చేసే నృత్యాన్ని పరిశీలించియున్నాడు. ఉడిపిలో సంగీత, సాహిత్య అభినయాలను కూలంకషంగా అభ్యసించాడు. సిద్ధేంద్రయోగి గురువైన నారాయణతీర్ధులు సంస్కృతంలో రచించిన కృష్ణలీలా తరంగిణి, తెలుగులో రచించిన పారిజాతాపహరణమూ దక్షిణదేశంలో అప్పటికే ప్రచారంలో ఉన్నాయి. పారిజాతాపహరణం కథనే తెలుగులో "పారిజాతం" అనే పేరుతో నృత్యనాటికగా సిద్ధేంద్రయోగి రచించాడు. అదే "భామాకలాపం"గా ప్రసిద్ధి చెందింది. ఆ భామాకలాపాన్ని కూచిపూడిలోని బ్రాహ్మణుల పిల్లలకు బోధించాడు. కూచిపూడిలో పుట్టిన ప్రతిమగపిల్లవానికి సిద్ధేంద్రుని పేరుచెప్పి, ముక్కు కుట్టి, కాలిగజ్జె కట్టి, ఆ పిల్లవాడు పెద్దయ్యాక ఏ వృత్తిని అవలంబించినా గాని స్వామి సన్నిధిలో భామవేషం వేసి తీరాలని, స్త్రీలకు ఈ కళలో ప్రవేశం ఉండరాదని సిద్ధేంద్రుడు శాసించాడు. ఆ నియమం చాలాకాలంవరకూ కొనసాగింది. భామాకలాపం రచనావిధానం యక్షగానరీతిలో ఉన్నాగాని దాని ప్రదర్శన రీతి విశిష్టమైనది. భామాకలాపంలో నృత్యము, సంగీతము ప్రాధాన్యం వహిస్తాయి. ఇందులో నాయిక [[సత్యభామ]]. నాయకుడు [[కృష్ణుడు]]. చెలికత్తె మాధవి మరో ముఖ్యమైన పాత్ర. 'కలాపము' అంటే 'కలత' లేదా 'కలహము' అని అర్ధము.
 
 
"https://te.wikipedia.org/wiki/సిద్దేంద్ర_యోగి" నుండి వెలికితీశారు