లక్కరాజు వాణి సరోజిని: కూర్పుల మధ్య తేడాలు

→‎లక్కరాజు వాణి సరోజినీ: గీర్వాణ భాషా వైభవం
పంక్తి 2:
 
===గీర్వాణ భాషా వైభవం===
 
====పద్యం #1====
: సీసం2-పూర్వభాగము:
<poem>
Line 16 ⟶ 18:
:: వాజ్మయ మున నెంతొ వాసి కెక్కె
</poem>
====పద్యం #2====
 
: సీసం2-పూర్వభాగము:
<poem>
:: భవ్య భాగవతాది దివ్య గ్రంధావళి –తొలుత గీర్వాణాన వెలసె నిలను
:: అష్ట పదులతోడ నిష్ట దేవత గొల్చి –జయదేవ కవి పొందె జగతి కీర్తి
:: పలు ప్రశంసల నొంద పంచ తంత్రము వ్రాసి –విశ్వ విఖ్యాతి బడసె విష్ణు శర్మ
:: భర్త్రు హరి రచియించె భాష గీర్వాణాన –భక్తి వైరాగ్య సుభాషితముల
</poem>
: ఆటవెలది:
<poem>
:: రాజ పూజ్యంబై వెలిగిన రమ్య భాష –దేవనాగరి యనబడు దివ్య భాష
:: శబ్ద మాధుర్య రసభావ లబ్ది నొంది –తనరె గీర్వాణ భాషగా తరతరాల .
</poem>
====పద్యం #3====
: సీసం2-పూర్వభాగము:
<poem>
:: వాల్మీకి కృతమై వరలె రామాయణం –సంస్కృతాన జనులు సన్నుతింప
:: కాళి యాశీస్సుల గీర్వాణ కవిగనై-ఖ్యాతి గాంచెను కవి కాళిదాసు
:: ఆచార్య శ౦కరు౦ డద్భుత స్తోత్రాలు –సంస్కృత భాషలోన సంకలి౦చె
:: పండితోత్తము లెంతో ప్రస్తుతించిన యట్టి –సంస్కృత భాషయే శ్రావ్య మిలను
</poem>
: తేటగీతి:
<poem>
:: రాజు లెందరొ మెచ్చిన రాజభాష –కవుల కారాధ్యమైనట్టి కావ్య భాష
:: దివ్య రచనలు విలసిల్లు భవ్య భాష –భాష గీర్వాణమును బోలు భాష కలదె.
</poem>
====పద్యం #4====
: సీసం2-పూర్వభాగము:
<poem>
:: భరత దేశము నందు భాష లంద౦న్నింట –మూలమై నిల్చు నమూల్య భాష
:: గీర్వాణ పదములు గణనీయముగా జేరి –తెలుగుజిలుగు లెంతొ తేజరిల్లె
:: సంస్క్రుతోద్భవ గ్రంధ సముదాయము లనెన్నొ-ఆంధ్రీకరించిరి ఆదికవులు
:: శృతి లయాత్మకమైన సంస్కృతంబిలలోన-అసమానమగు నట్టి అమరభాష
</poem>
: తేటగీతి:
<poem>
:: మంత్ర తంత్రాల కాధార మైన యట్టి –దేవతలు మెచ్చి దీవించు దివిజ భాష
:: యజ్ఞయాగాది కార్యాలు ప్రజ్ఞ తోడ –ఆచరించగా తోడ్పడు ఆది భాష .
</poem>
====పద్యం #5====
: సీసం2-పూర్వభాగము:
<poem>
:: సంస్కృతంబు దెలియ సులభ సాధ్యంబౌను –పెక్కు భాషలలోని చక్కదనము
:: ఆదికవులు నాడు ఆంధ్రీకరించిన –గీర్వాణ గ్రంధాలు గంతికేక్కె
:: ఉభయ భాషలలోన యుద్దండ రచనల –ప్రతిభ చాటిరి వారు ప్రజ్న తోడ
:: వివిధ ప్రక్రియల లో వెలలేని గ్రంధాలు –అవతరించెను జగతి అద్భుతముగ
</poem>
: తేటగీతి:
<poem>
:: అమ్మ వాగ్దేవిఆశేస్సుల౦దు కొనిన –ఆణి ముత్యములను బోలు ఆది కవులు
:: జన్మ ధన్యత నొంద జగతి నందు –తల్లి భారతి సేవించి తనరి రిలను .
</poem>
<br>
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]