"అక్కినేని నాగార్జున" కూర్పుల మధ్య తేడాలు

చి
 
== వ్యక్తిగతం ==
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన [[అక్కినేని నాగేశ్వర రావు]], అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున [[హైదరాబాద్]] పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో[[చెన్నై|మద్రాస్‌]]<nowiki/>లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రథమ వివాహం [[ఫిబ్రవరి 18]], [[1984]] <ref name=nag1>http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html</ref> నాడు లక్ష్మితో <ref name=nag2>http://www.nagfans.com/release.asp?submod=Profile&module=Nag%20Store</ref> జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు [[వెంకటేష్]]కు సోదరి <ref name=nag4>http://timesofindia.indiatimes.com/articleshow/24966153.cms</ref>. వీరిరువురు విడాకులు తీసుకున్నారు<ref name=nag3>http://www.totaltollywood.com/articles/nag2.html</ref>. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన [[అమల]]ను వివాహమాడారు. ఈమె మాజీ [[దక్షిణ భారత]] నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ [[నవంబర్ 23]], [[1986]]) <ref name="nag1"/> మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ [[ఏప్రిల్ 8]] [[1994]])<ref name="nag1"/> రెండవ భార్య కొడుకు.
 
== సినిమా జీవితము ==
నాగార్జున మొదటి చిత్రం [[విక్రం]], మే 23, 1986లో విడుదల అయింది. ఈ చిత్రం [[హిందీ]] చిత్రం [[హీరో]]కి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన [[మజ్ను]] సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా [[కలెక్టరుగారి అబ్బాయి]] చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]]<nowiki/>తో నటించిన [[ఆఖరి పోరాటం]] సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత [[మణిరత్నం]] దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం [[గీతాంజలి]] భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది [[మణిరత్నం]] నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. మరియు [[రాంగోపాల్ వర్మ]] దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం [[శివ (1989 సినిమా)|శివ]], ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది. ఈ చిత్రానికి గాను నాగార్జున [[ఫిలింఫేర్]] ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని [[హిందీ]]లో [[శివ]] అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్‌లో[[బాలీవుడ్|బాలీవుడ్‌]]<nowiki/>లో కూడా అడుగుపెట్టారు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. [[ప్రెసిడెంట్ గారి పెళ్లాం]], [[హలో బ్రదర్]] వంటి చిత్రాలు ఈయనకు ''మాస్ హీరో'' అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత [[కృష్ణ వంశీ]] దర్శకత్వములో విడుదలైన ''[[నిన్నే పెళ్లాడుతా]]'' భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత [[అన్నమయ్య (సినిమా)|అన్నమయ్య]] చిత్రములో [[వాగ్గేయకారుడు]] [[అన్నమయ్య]] పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
 
[[2006]]లో నాగార్జున తన తాజా చిత్రము ''[[శ్రీరామదాసు (సినిమా)|శ్రీ రామదాసు]]''లో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి.
[[File:Actor Nagarjuna.jpg|thumb|Actor నాగార్జున]]
 
==అవార్డులు==
[[File:Telugu actor Nagarjuna and Narendra Modi.jpg|right|250px|thumb|నరేంద్రమోడీతో నాగార్జున]]ఆంధ్రప్రదేశ్ రాష్
;జాతీయ చిత్ర పురస్కారాలు
* 1997 - [[నిన్నే పెళ్ళాడతా]] సినిమా నిర్మించినందుకు గాను తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
1,86,224

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2071747" నుండి వెలికితీశారు