జీవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 44:
 
== వృద్ధాప్యం - స్పెర్మిడైన్ ==
ప్రతి జీవి నిర్ణీత కాలం వరకు బ్రతికి మరణిస్తుంది. శరీరంలోని కణాల క్రమక్షయం వల్లే వయసు పైబడుతుంది. ఈ కణాల అభివృద్ధికి స్పెర్మిడైన్ తోడ్పడుతుంది. శరీరంలోని జీవ కణాలను దెబ్బతీసి వృద్ధాప్యానికి చేరువచేసే 'ఫ్రీ రాడికల్స్' నుంచి కాపాడే 'స్పెర్మిడైన్' అనే మాలిక్యూల్ వయసు పైబడకుండా కాపాడి... ఆయుష్షును పాతికేళ్లదాకా పెంచుతుందని పరిశోధకులు తెలిపారు. ఇతర కణాల కంటే స్పెర్మిడైన్ ప్రభావం పడిన కణాల జీవిత కాలం 4 రెట్లు పెరిగింది. ఈగల జీవిత కాలం 30 శాతం అధికమైంది. ఎలుకలకు సుమారు 200 రోజులపాటు నీరు, ఆహారంతోపాటు స్పెర్మిడైన్ అందించారు. వీటిలో ఫ్రీ రాడికల్స్ 30 శాతం తగ్గినట్లు గుర్తించారు. వెరసి... స్పెర్మిడైన్ ద్వారా వృద్ధాప్యాన్ని దూరం చేసి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. (ఆంధ్రజ్యోతి 6.10.2009)
 
== జీవుల వర్గీకరణ ==
జీవరాశులను వివిధ రాజ్యాలుగా విభజించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వీటన్నింటిలో 'ఐదు రాజ్యాల వర్గీకరణ' (Five Kingdom Classification) ఎక్కువమంది ఆమోదం పొందింది. జీవ పరిణామ రీత్యా జీవులలోని మూడు ప్రాథమికాంశాలను పరిగణలోకి తీసుకొని [[విట్టకర్]], [[1969]]లో దీన్ని ప్రతిపాదించారు. ఇవి కణ నిర్మాణ స్వభావం (కేంద్రకపూర్వం, నిజకేంద్రక కణాలు), దేహనిర్మాణంలో క్లిష్టత (ఏకకణ, బహుకణ), పోషక విధానం (స్వయం పోషణ, పరపోషణ) ప్రధానాంశాలు.
"https://te.wikipedia.org/wiki/జీవి" నుండి వెలికితీశారు