"శ్రీలంకలో తెలుగు మూలాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి
 
==సామాజిక, ఆర్ధిక పరిస్థితులు==
[[విజయనగర]] సామ్రాజ్యానికి చెందిన [[తెలుగు]] రాజులు 1747-1815ల మధ్య ఈ దేశాన్ని పాలించారు కానీ తెలుగు సంస్కృతి, కళలు, విద్యల ప్రభావం ఈ దేశ ప్రజల మీద అతితక్కువగా ఉంది. ఆ సమయానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, గ్రంథాలు లభ్యం కాకపోవడం చేత పరిశోధన ముందుకు కొనసాగడం లేదు. ఆ కాలంలో పరిమిత సంఖ్యలో ఈ రాజుల సైన్యంలో చేరడానికి తెలుగు వారు వలస వచ్చారు. చివరి రాజు కన్నస్వామి నాయకన్ (విక్రమసింహుడు) యొక్క రాజ్యం పతనమైన తరువాత ఈ సైనికుల అస్తిత్వం కోల్పోయింది. వీరు తెలుగు వారైనా శ్రీలంక తమిళులుగా రికార్డులకెక్కారు. పరిస్థితులు అనుకూలించక పోయినా ఇంకా కొంతమంది తెలుగు ప్రజలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొంటూ, కాంట్రాక్టు కార్మికులు, హోటల్ కీపర్లు, ఆలయ పూజారులు వంటి స్వల్ప ఆదాయ వృత్తులను చేసుకొంటూ [[కొలంబో]], క్యాండీ, అనూరాధపుర, బాటికలోయా, జాఫ్నా తదితర ప్రాంతాలలో నివసిస్తున్నారు. క్యాండీ పర్వతప్రాంతాలలో కొన్ని తెలుగు సంచారజాతులు, తెలుగు జిప్సీలు నివసిస్తున్నారు వీరిని [[అహుకుంటికలు]] <ref>https://books.google.co.in/books?id=DbO1AAAAIAAJ&q=ahikuntakas&dq=ahikuntakas&hl=en&sa=X&redir_esc=y</ref> అని వ్యవహరిస్తారు . ఈ దేశంలో 2 నుండి 3 లక్షల మంది తెలుగువారు ఉన్నట్లు ఒక అంచనా.
 
==మూలాలు==
251

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2072496" నుండి వెలికితీశారు