"లేవియకాండం" కూర్పుల మధ్య తేడాలు

చి
లేవీయకాండం (యాజి ధర్మవిధులు)
పరిచయం
పేరు: యూదులు ఈ పుస్తకాన్ని మొదటి పదాలయిన “ఆయన పిలిచాడు” అనే పేరుతో పిలిచేవారు (హీబ్రూలో మొదటి పదం అదే). పాత తెలుగు బైబిలు(పరిశుద్ధ గ్రంథం)లో ఉన్న పేరు గ్రీకు తర్జుమాలో ఉన్న పేరు తర్జుమా. ఆ పేరు దేవుని ప్రేరేపణతో వచ్చినది కాదు. [[ఆదికాండం]] పరిచయం చూడండి. ఈ పుస్తకాన్ని లేవీయకాండం అనేదానికంటే “యాజి ధర్మవిధులు” అంటేనే బాగుంటుందనిపిస్తుంది.
రచయిత వ్రాసిన కాలం: ఆదికాండం పరిచయం చూడండి.
ముఖ్యాంశాలు: ఒక ముఖ్యాంశం జీవితంలోని ప్రతి భాగంలో పరిశుభ్రత, పవిత్రత ఉండవలసిన అవసరం. దేవుడు పవిత్రుడు. అలాగే ఆయన ప్రజలు కూడా పవిత్రంగా ఉండాలి. 11:45; 19:2; 20:7 చూడండి. మరో ముఖ్యాంశం బలిద్వారానే దేవుణ్ణి సమీపించడం సాధ్యంగా ఉన్నది. 16:1-17 చూడండి. మనిషి పాపి గనుక ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం అవసరం. ఈ పుస్తకమంతా సాదృశ్యాలతో, చిహ్నాలతో, సూచనలతో నిండి ఉన్నది. ఈ సాదృశ్యాలు క్రీస్తువైపు చూపిస్తూ మనుషులకు ఆయనకు మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తున్నవి. కొన్ని ముఖ్యమైన పదాలు: “బలి” “అర్పణ అర్పించడం” (నామవాచకం, క్రియాపదాలు దాదాపు 300 సార్లు ఉపయోగించడం జరిగింది). “శుద్ధ” “అశుద్ధ” (130 సార్లకంటే ఎక్కువసార్లు వాడబడ్డాయి), “పవిత్ర” (70 సార్లు వాడినది), “యాజి” లేక “యాజులు” (170 సార్ల కంటే ఎక్కువ వాడినది). యాజులు అంటే ప్రజల పక్షంగా, దేవుని సన్నిధిలో ప్రతినిధులుగా ఉన్నవారు, బలులు అర్పించేవారు, ఆరాధన గుడారంలోనూ ఆలయంలోనూ ఆరాధన విధులు నిర్వహించేవారు.
251

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2072520" నుండి వెలికితీశారు