బైబిల్ వ్యతిరేక పత్రికలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు లో → లలో , లో → లో (2), కు → కు (7), తో → తో , కొసం → కోసం, గ using AWB
పంక్తి 22:
'''తోమా సువార్త:''' యేసు క్రీస్తు జీవిత చరిత్రను తెలిపే సంప్రదాయ సువార్తల వలె కాకుండా తోమా సువార్త (Gospel of Thomas) లో మాత్రం యేసుక్రీస్తుకు చెందిన సూక్తులు (Logions) 114 ఉంటాయి., ఒక్కొక్కసారి చిన్న మాటల్లోగాని లేదా ఉపమానాలు గాని ఉంటాయి. ఇందులో 65 వ సూక్తి <ref>http://members.a1.net/thomasevangelium/log065.html</ref>లో యజమాని కుమారుడు (ఉపమానంగా క్రీస్తు) మరణించినట్లుగా వ్రాయబడియుంది.
 
'''ఆర్కానుల తత్వం''' (The Hypostasis of the Archons ) పుస్తకం బైబిలు [[ఆదికాండం]] 1:6 ను వివరించేవిధంగా ఉంటుంది. ఇందులో ఆదాము ఆవ్వల కుమారులైన సెత్తు (Seth), ఏబెలు (Abel), కయీను (Cain), కుమార్తె అయిన నోరియా (Norea), యల్దాబోతు (Yaldaboath) రాజు, మానవ స్త్రీ రూపమైన సోఫియా (Sophia) వంటి పాత్రలున్నాయి. కొద్దిగా దేవతకు ప్రసంగీకుడికి మధ్య జరిగే దివ్యవార్త. ఇందులో ఆదాము నుండి ఆవ్వ సృష్టించబడి, ఆదాము ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం, మరల అవ్వ ఆదామును లేపడం వంటివి ఉంటాయి. ఆర్కానులు అనగా గ్రీకు భాషలో పరిపాలించేవారు అని అర్ధము. ఒక విధంగా చీఫ్ మెజిస్ట్రేట్ అని అర్ధము.
 
'''సృష్టి మూలాలు''' (On origins of the world) పత్రిక బైబిల్ ఆదికాండం (Genesis) కథను తిరిగి వ్రాసినట్టు ఉంటుంది. ఆదికాండంలో యెహోవా దేవుడు నిర్వర్తించే పాత్రను ఈ పత్రికలో యల్దాబోతు అను సృష్టికర్త నిర్వర్తిస్తాడు. ఏధేను తోట (Garden of Eden) లో మానవాళిని వెలుగువైపు మళ్ళించడానికి ఒక సర్పాన్ని సోఫియా దేవత పంపినట్లు ఉంటుంది.