"సైమన్ కమిషన్" కూర్పుల మధ్య తేడాలు

సైమన్ కమిటీలోని ఏడుగురు సభ్యలు. వారందరు బ్రిటన్ దేశ పార్లమెంటు సభ్యులే. (1) జాన్ సైమన్ (Sir John Simon), (2)క్లెమెంట్ అట్లీ (Clement Attlee), (3) హ్యారీ లెవీలాసన్ (Harry LevyLawson), (4) ఎడ్వర్డ్ కెడొగన్ (Edward Cadogan), (5) వెర్నాన్ హర్టసన్ (Vernon Hartshorn), (6) జార్జి లేన్ఫాక్స్ (George LaneFox), (7) డొనాల్డ్ హోవార్డు (Donald Howard)
 
== సైమన్ విచారణ సంఘము బహిష్కరించబడిన కారణము, బహిష్కరణోద్యమముబహిష్కరోద్యమము==
భారతదేశములో సైమన్ విచారణసంఘము బహిష్కరించబడిన కారణము; బహు ముఖ్యమైన ఆ విచారణ సంఘమున ఒక్క భారతీయుడు తగడని సభ్యునిగా నియమించకపోవుటయే. సైమన్ కమీషన్ బహిష్కరించ వలెనన్న నిర్ణయము డిసెంబరు మాసము, 1927 సంవత్సరమున మద్రాసులో జరిగిన జాతీయ కాంగ్రెస్సు సదస్ససున జరిగినది. శక్తివంతమైన తీర్మానముచేయబడినది. కాంగ్రెస్సు పార్టీ వారే కాక భారతదేశములో అప్పటిలో పలుకుబడిగలిగియున్న [[ హిందు మహాసభ]] మరియూ [[ ముహమ్మద్ అలీ జిన్నా ]] నాయకత్వమందలి [[ముస్లిమ్ లీగ్]] మొదలగు పార్టీలు (ఒకటి, రెండు పార్టీలు తప్ప), ప్రజా నాయకులు కూడా సైమన్ కమీషన్ ను బహిష్కరించ నిశ్చయించిరి. అందుచే బహిష్కరణ కార్యక్రమములో భాగముగా సైమన్ సంఘ సభ్యులు భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు వారిని తిరస్కరించుటకు ఒక ఉద్యమము గా కార్యక్రమము నెలకొల్పి, గొప్పజాతీయభావముతో యావద్భారతదేశములో అమలుచేయబడెను. సైమన్ కమిటీ పర్యటించిన ప్రతి ఊరులో హార్తాళ్ ప్రకటించి నల్ల జండాలతో తిరస్కారభావముచూపబడెను. బ్రిటిష్ ప్రభుత్వము నిషేదాజ్ఞలు ప్రకటించి ఆందోళనకారులపై పోలీసు లాఠీ ఛార్జీలు జరిగినవి. అప్పటి బహిష్కరోద్యమములో పోలీసు లాఠీఛార్జీవల్లన అనేకులు గాయపడిరి. అందులో ప్రముఖులు లాహోరు నగరములో [[లాలా లజపతిరాయ్]], లక్నో నగరములో [[గోవింద్ వల్లభ్ పంత్]], [[జవహర్లాల్ నెహ్రూ]]. <ref name="Siva Rao(1938)"/>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2072858" నుండి వెలికితీశారు