గుడ్లవల్లేరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 150:
కొత్త చెరువు:- గ్రామములోని అంబేడ్కర్ నగర్ లో, ఆరు ఎకరాల విస్తీర్ణంలో, 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఈ మంచినీటి చెరువు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చెరువు నీటిని, అంబేడ్కర్ నగర్, నీలకంఠేశ్వరపురం మరియు కొత్తగా ఏర్పాటు చేయుచున్న చంద్రబాబునగర్ కాలనీ వాసుల త్రాగునీటి అవసరాలకు ఉపయోగించెదరు. [18]
==గ్రామ పంచాయతీ==
#నీలకంఠేశ్వరపురం, [[గుడ్లవల్లేరు]] గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
#గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీ భవనాన్ని 1968 లో నిర్మించారు.
#2013 [[జూలై]]లో గుడ్లవల్లేరు గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ చాపరాల బాలాజీ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ వల్లభనేని సుబ్బారావు చౌదరి ఎన్నికైనారు. [13]
పంక్తి 160:
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం [[వైశాఖ పౌర్ణమి]] సందర్భంగా (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా స్వామివార్ల కళ్యాణం నిర్వహించెదరు. [2]
 
ఈ ఆలయ 200 వ వార్షికోత్సవాలను 2016,[[మే]]-19వ తేదీ [[గురువారం]]నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా, గురువారం స్వామివారికి పంచామృత స్నపన, విశేషార్చనలు నిర్వహించి, స్వామివారిని పెళ్ళికుమారుని చేసారు. [[శుక్రవారం]] రాత్రి దివ్య తిరుకళ్యాణోత్సవం, శనివారం గరుడోత్సవం ఆదివారం పవళింపుసేవలు నిర్వహించెదరు. [20]
===శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయం===
ఈ పురాతన ఆలయ 17వ వార్షికోత్సవాలు, 2014,[[జూన్]]-13వ తేదీ [[శుక్రవారం]] నుండి 16వ తేదీ [[సోమవారం]] వరకు వైభవంగా నిర్వహించారు. [3]
పంక్తి 172:
రెండవ అన్నవరంగా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయం, స్థానిక సంత రహదారిలో ఉంది. ఈ ఆలయంలో స్వామివారి 66వ వార్షిక బ్రహ్మోత్సవాలు, 2016,[[ఫిబ్రవరి]]-17వతేదీ [[బుధవారం]] నుండి ఒక వారంరోజులపాటు నిర్వహించెదరు. [17]
===శ్రీ సిద్ధిబుద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం===
స్థానిక [[గౌడ]] వంశీయులకు చెందిన ఈ ఆలయం, బస్సుస్టాండ్ కూడలిలోని కొత్త వంతెన ప్రక్కన ఉంది.
===శ్రీ బాలరెడ్డెంకమ్మ తల్లి ఆలయం===
మండలంలోని '''చింతలగుంట '''లో వేంచేసియున్న బెజవాడవారి ఇలవేలుపు అయిన శ్రీ బాలరెడ్డెంకమ్మ తల్లి (దేవరమ్మ తల్లి) వార్షిక ఉత్సవాలను 2016,మే-13వ తేదీ శుక్రవారం మరియు 14వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలలనుండి '''బెజవాడ ''' వంశస్థులు వేలాదిగా ఈ ఉత్సవానికి తరలివచ్చారు. గౌడ సంఘీయులలోని బెజవాడ వంశస్థుల ఇలవేలుపుగా అమ్మవారికి, ప్రతి మూడు సంవత్సరాలకొకసారి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వచ్చుచున్నది. 14వ తేదీ శనివారం ఉదయం మాత వివాహం, సంకు చెరగడం, మద్యాహ్నం పిల్లా పాపలతోసహా వందలాది కుటుంబాలు స్థానిక పుట్టపొలం వద్ద పేగుచుట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి చుట్టూ పేగు చుట్టడంతో సందడి నెలకొన్నది. రాత్రికి బంగారు పుట్టలో అమ్మవారిని పెట్టడం, తదుపరి గజాల కొలువు జరిపినారు. 15వ తేదీ ఆదివారం ఉదయం అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి ఘటం పోతురాజు గడలతో భక్తులు ఊరేగింపులో పాల్గొని పూజాధికాలు నిర్వహించారు. అనంతరం మహిళలు కుంభ, పాల నైవేద్యాలను నిర్వహించారు. పెద్ద యెత్తున పోటుగొర్రెను జరిపినారు. మొక్కుబడులను చెల్లించుకొని పెద్దయెత్తున విందుభోజనాలు చేసారు. [18]
పంక్తి 182:
ఈ అలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారి ఉత్సవాలు ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [6]
===శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం===
స్థానిక రైల్వే స్టేషను రహదారిలోని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, [[హనుమజ్జయంతి]] సందర్భంగా, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు, పానకం, వడపప్పు, తీర్ధప్రసాదాలు అందజేసెదరు. [7]
===కొండాలమ్మ ఆలయం===
===శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం===
పంక్తి 188:
===శ్రీ విఙానందాశ్రమం===
===గ్రామంలో ఆధ్యాత్మిక విశేషాలు===
ఈ గ్రామంలోని రజకసంఘీయులు, 2015,[[మే]] నెల-3వతేదీ [[ఆదివారం,]] [[వైశాఖమాసము|వైశాఖ]] మాసం, శుద్ధ [[చతుర్దశి]] రాత్రి, 18 సంవత్సరాల తరువాత, శ్రీ వీరభద్రుని పళ్ళెం పట్టే కార్యక్రమంలో, భారీగా ఉత్సవాలను నిర్వహించారు. శ్రీ సిద్ధేశ్వరస్వాంవారి ఆలయం నుండి మహిళలు, పళ్ళేలలో జ్యోతులతో వెంటరాగా, శ్రీ వీరభద్రస్వామిని ట్రాక్టరుపై ఉంచి, మేళతాళాలతో ఊరేగింపుకు తరలినారు. [[శ్రీశైలం]], [[సత్తుపల్లి]] గ్రామాలకు చెందిన వీరశైవజంగాలు, శ్రీ శివపార్వతులు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, నందివాహనం, శ్రీ నరసింహస్వామి, కళారూపాలతో ఆకట్టుకున్నారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో గ్రామంలోని, ప్రధాన, అంతర్గత రహదారులలో ఊరేగింపు సాగినది. హిరణ్యకశిపుని వధ, [[శివతాండవం]], శ్రీ వినాయక నృత్యం, పార్వతీమాత అభినయం, శివగణాల వీరంగం వంటి జానపదరూపాలను కళ్ళకు కట్టినారు. ఉదయం, వీరభద్రునిక కట్టిన ఆనను తొలగించడంతో ఉత్సవాలు ముగింపుమకు వచ్చినవి. ఈ కార్యక్రమంలో రజక సంఘీయులు పెద్దసంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలను స్వీకరించారు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], పశుసంపద.
==గ్రామ ప్రముఖులు==
*[[ఎర్నేని లీలావతి దేవి|ఎర్నేని లీలావతీ దేవి]] స్వాతంత్ర సమర యోధురాలు.
పంక్తి 203:
1952లో స్థానిక బస్సు స్టాండ్ కూడలిలో, అర్యవైశ్య ప్రముఖులు శ్రీ కోట జ్వాలరామయ్య తదితరులు, అమరజీవి శ్రీ [[పొట్టి శ్రీరాములు]]గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నాలుగుస్తంభాల నడుమ, విగ్రహాన్ని ఏర్పాటుచేసి, పైన స్లాబ్ వేసినారు. 1958లో పంచాయతీ ఆ కట్టడంపై స్థూపాకారం నిర్మించి, అందులో గడియారాలను అమర్చారు. నాలుగువైపులా గడియారాలను పెట్టి, చుట్టూ విద్యుద్దీపాలను అమర్చారు. 1958లో నాటి శాసనసభ్యులు శ్రీ గరిమెళ్ళ నాగిరెడ్డి, దీనిని ఆవిష్కరించారు. అప్పట్లో గానుగ సున్నంతో కట్టిన ఈ కట్టడం, నేటికీ చెక్కుచెదరలేదు. పంచాయతీ నిర్లక్ష్యం వలన ఇది కళావిహీనంగా మారినది. [9]
===శ్రీ కొసరాజు వెంకటకృష్ణారావు ఛారిటబుల్ ట్రస్ట్===
ఈ ట్రస్ట్ ద్వారా 8 సంవత్సరాలుగా నిత్యం నిరుపేద వృద్ధులు, అనాథలకు, వారి ఇళ్ళకే క్యారీజీలద్వారా, రెండుపూటలకూ సరిపడా భోజనపదార్ధాలు పంపించుచున్నారు. విన్నూతంగా ఇళ్ళకే నిత్యాన్నదానం చేయడాన్ని "ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్శ్" అను సంస్థ వారు గుర్తించి, ఈ ట్రస్ట్ పేరును నమోదు చేసుకున్నారు. ఈ సంస్థవారు, ఈ పురస్కారానికి సంబంధించిన గుర్తింపు పత్రం, ఙాపిక, బ్యాడ్జీలను, 2015,[[జూన్]]-13వ తేదెనాడు, కొసరాజు జీనియస్ సంస్థ, [[విజయవాడ]] ప్రాంత కో-ఆర్డినేటర్ శ్రీ ఎన్.రవికుమార్ ద్వారా, ట్రస్ట్ వారికి అందజేసినారు. [10]
===జవహర్ లాల్ నెహ్రూ పశువుల సంత===
దీనిని కీ.శే. వల్లభనేని రంగయ్య చౌదరి గారు ఏర్పాటుచేసారు. గ్రామస్థులు ఆయన గ్రామానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన కాంస్యవిగ్రహాన్ని స్థానిక సంతరహదారిలో ఏర్పాటుచేసారు. ఈ సంత 65వ వార్షికోత్సవాన్ని, 2015,[[ఆగష్టు]]-12వ తేదీనాడు, కీ.శే. రంగయ్య వర్ధంతిని పురస్కరించుకొని, నిర్వహించారు. ఈ సందర్భంగా కీ.శే.రంగయ్య గారి కాంస్యవిగ్రహానికి భారీగా పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంతలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. [11]
"https://te.wikipedia.org/wiki/గుడ్లవల్లేరు" నుండి వెలికితీశారు