కొప్పుల హేమాద్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →కొప్పులవారి కతలూ…కబుర్లూ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితం → కచ్చితం using AWB |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 34:
'''కొప్పుల హేమాద్రి''' వృక్ష శాస్త్ర పరిశోధకులు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తూర్పుకనుమల అడవుల్లో మాత్రమే కనిపించే [[నాగార్జున ఉల్లిగడ్డ]] అనే మొక్కను తొలిసారిగా 1982 లో కొప్పుల హేమాద్రి మరియు స్వహారి శశిభూషణరావు అను వృక్షశాస్త్రవేత్తలు కనుగొన్నారు <ref>National Conference on Forest Biodiversity Resources: Exploitation Conservation & Management, 21-22 March 2006, CBFS, Madurai Kamaraj University : Madurai - 625 021</ref> .
==జీవిత విశేషాలు==
కొప్పుల హేమాద్రి [[తూర్పు గోదావరి జిల్లా]], [[గొల్లప్రోలు]] గ్రామంలో [[సెప్టెంబర్ 19]], [[1938]] న జన్మించారు <ref>[http://www.exoticindiaart.com/book/details/dravyaguna-vijnana-NAC031/ ద్రవ్యగుణ విజ్ఞాన]</ref>. ఈయన [[అనకాపల్లి]] లోని ఎ.ఎం.ఎ.ఎల్. కాలేజీ నుంచి బి.ఎస్.సి (కెమిస్ట్రీ) పట్టాను 1959 లో పుచ్చుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ బోంబేలో బి.ఎస్.సి ఆనర్స్ పూర్తి చేసారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (వెస్టర్న్ సర్కిల్)
==పరిశోధనలు==
సహ్యాద్రి కొండల నడుమ ఉన్న దట్టమైన అటవీ ప్రాంతమే ఫ్లోరా ఆఫ్ జన్నర్. ఆ ప్రాంతాన్ని అణువణువునా పరిశోధించి 14 కొత్త మొక్కలను కనిపెట్టారు.<ref>[http://www.exoticindiaart.com/book/details/dravyaguna-vijnana-NAC031/ ఆయన రచించిన పుస్తక వివరాలు "ద్రవ్యగుణ విజ్ఞాన]</ref> శతాబ్దాల నుండి పరిశోధకులకు కానరాని, తెలియని ఆ మొక్కల వినియోగం, ప్రయోజనాల గురించి ప్రాచీన గ్రంథాలను సంప్రదించారు. తన పరిశోధన సారాంశాన్ని "బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా" సంస్థ డైరక్టరుకు పరిశీలన నిమిత్తం పంపగా, దానిని పి.హెచ్.డికి పంపించవలసినదిగా సలహా యిచ్చారు. దానిని ప్రపంచ ప్రఖ్యాత సంస్థ "రిజ్క్ హెర్బేరియం" (పోలండ్ దేశం) కు పంపించారు. అక్కడి డైరక్టరు ఆయన పరిశోధనా గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, చిన్న, చిన్న సవరణలు చేసి పి.హె.డికి బదులుగా డి.ఎస్.సి పట్టాను అందించారు. ఈయన పరిశోధనలతో 40 కొత్తరకాల మొక్కలు వైద్యరంగంలో ప్రవేశించాయి. ఆయన కేంద్రీయ ప్రభుత్వ ఆయుర్వేద సంస్థలో సర్వే అధికారిగా ఔషథ మొక్కలను పరిశోధనలు జరిపేందుకు నియమితులయ్యారు. అప్పటి వరకు ఉన్న [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] గ్రంథాలళో,
==వైద్య గ్రంథ రచనలు==
ఆయన 2005 వరకు 15 వైద్య గ్రంథ రచనలను వెలువరించారు. ఆంధ్ర ప్రదేశ్ లో మందు మొక్కలు, ఔషథీ వృక్ష శాస్త్రము, లను తెలుగు అకాడమీ వారు ప్రచురించి బి.ఎస్.సి (ఆయుర్వేద) విద్యార్థులకు పాఠ్య గ్రంథాలుగా రూపొందించారు. ఈయన [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణ]] రాష్ట్రాలలో వివిధ జిల్లాల్లో లభ్యమవుతున్న ఔషథీ మొక్కలను పరిచయం చేస్తూ వాటి వినియోగ విధానాలను వివరిస్తూ పలు గ్రంథ రచనలు చేసారు. "గిరిజన మూలికా వైద్యం" గ్రంథం ప్రసిద్ధి పొందింది.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-bookreview/indigenous-herbal-remedies/article1446224.ece Indigenous herbal remedies]</ref> ఆయుర్వేద నిఘంటువులను అక్షర క్రమంలో నామీకరణ ద్వారా సరిదిద్దారు.
==కొప్పులవారి కతలూ…కబుర్లూ==
|