కోగంటి రాధాకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోగంటి రాధాకృష్ణమూర్తి''' ([[సెప్టెంబర్ 18]], [[1914]] - [[జనవరి 3]], [[1987]]) ప్రముఖ [[రచయిత]], సంపాదకుడు, [[హేతువాది]]. [[తెనాలి]] నుంచి నలంద ప్రచురణల సంస్థను నడిపారు. ఈయన అనువదించిన [[ఎం.ఎన్.రాయ్]] వ్యాసాలు ఒక హేతువాద వాచకం అంటారు. రాడికల్‌ హ్యూమనిస్టు.ఏ ఇజాన్నీ హీనంగా నిరసించడటం తన అభిమతం కాదు. ఏ సిద్ధాంతానికీ సమగ్రత ఆపాదించరాదనీ, ప్రతి సిద్ధాంతంలోని మంచిని స్వీకరిస్తూ ముందుకు సాగటమే వివేకవంతుల లక్షణమని ఆయన భావన.
 
== జననం ==
కోగంటి రాధాకృష్ణమూర్తి [[గుంటూరు జిల్లా]], [[తెనాలి]] ప్రాంతపు [[కూచిపూడి (అమృతలూరు)]] గ్రామంలో [[1914]], [[సెప్టెంబర్ 18]] న జన్మించారు. గుంటూరు ఏసీ కళాశాలలో బి.ఏ. పట్టభ్రదులైన కోగంటి వారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ‘విశారద’, ‘ప్రచారక’ చదివి ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థిదశలో భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యకర్తగా ఉండి పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. [[త్రిపురనేని గోపీచంద్|గోపీచంద్‌]], [[జి.వి.కృష్ణారావు]], [[ఆవుల గోపాలకృష్ణమూర్తి]] వంటి వారితో స్నేహం. [[త్రిపురనేని రామస్వామి]] భావాల ప్రభావం ఆయన మీద ఎక్కువ.1937 నుంచి మానవేంద్రనాథ్‌రాయ్‌ భావాలతో ఉత్తేజం పొందారు. 1940లో రాయ్‌ స్థాపించిన రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీలో చేరారు. 1941లో ఆంధ్ర రాష్ట్రంలో [[రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీని]] తెనాలిలో స్థాపించారు. 1946లో జరిగిన సార్వత్రక ఎన్నికలలో ఆ పార్టీ తరఫున [[తెనాలి నియోజకవర్గం]] నుంచి పోటీచేశారు. పార్టీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి పనికిరావనే ఉద్దేశంతో 1948లో రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీని రాయ్‌ రద్దు చేశారు. రాడికల్‌ హ్యూమనిస్టు ఉద్యమాన్ని ప్రారంభించారు.[[విహారి (పత్రిక)|విహారి]], [[రాడికల్ (పత్రిక)|రాడికల్‌]], [[సమీక్ష(పత్రిక)|సమీక్ష]] వంటి పత్రికలకు సంపాదకత్వం వహించారు.
 
1945 నుంచి 1969 వరకు నలందా ప్రెస్‌, నలందా పబ్లిషర్స్‌ ప్రజాపరిషత్తు వంటి సంస్థలు నడిపారు. ఎం.వి.రామమూర్తి అధ్యక్షతన 1977లో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రచురణల సంస్థ తరఫున ప్రథమ ప్రచురణగా రాధాకృష్ణమూర్తి ఉద్గ్రంథం ‘[[ఎం.ఎన్‌.రాయ్‌]] జీవితం-సిద్ధాంతం’ వెలువడింది. రాయ్‌ జీవితాన్ని 47 అధ్యాయాలలో, 432 పేజీలలో చక్కగా వివరించారు. ఇండియాలో విప్లవం, ఇండియా భవిష్యత్తు, మార్క్సిజం-రాడికలిజం, [[మల్లెపూలు]] (కథాసంపుటి), గాంధీమార్గం, మార్క్సిజం-కమ్యూనిజం-చరిత్ర నేర్పిన గుణపాఠం మొదలైనవి ఆయన రచనలు. ప్రపంచ రికార్డులు, ప్రపంచ నాటికలు, న్యాయాన్యాయాలు, రాయ్‌ వ్యాసాలు, [[జవాహర్ లాల్ నెహ్రూ|జవహర్‌లాల్‌ నెహ్రూ]], నూతన రాజ్యాంగ చట్టం మొదలైనవి ఆయన అనువాద రచనలు. భారత స్వాతంత్య్ర పోరాటానికి ఉత్తేజాన్ని, భావోద్వేగాన్ని కలిగించడంలో దోహదపడినంతగా గాంధీ నిర్మాణాత్మకమైన వ్యవస్థలను రూపొందించడంలో సఫలుడు కాలేకపోయాడన్నారు.
 
== మరణం ==