గుమ్మడి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
 
== విద్యార్థిజీవితం రాజకీయ ప్రభావాలు ==
గుమ్మడి ప్రారంభవిద్య నుండి స్కూల్ ఫైనల్ వరకు స్వంత ఊరు అయిన రావికంపాడుకు 3 కిలోమీటర్ల దూరంలో [[కొల్లూరు]] ఉన్నత పాఠశాలలో జరిగింది. అక్కడ ఆయన ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివాడు. ఈ దశలోనే ఈయన తమ ఊరిలో [[పుచ్చలపల్లి సుందరయ్య]] గారి ఉపన్యాసంతో ప్రభావితుడై కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడు. కమ్యూనిష్ట్ సాహిత్యం చదువుతూ స్నేహితులతో చర్చిస్తూ ఉన్న అయన భావాలకు ఆందోళన చెందిన పెద్దవారు ఆ ఊరి మునసబు దొడ్డపనేని బుచ్చిరామాయ్యను ఆశ్రయించి ఆయన మనసు మార్చారు. అయినా వారికి గుమ్మడి మీద సరి అయిన విశ్వాసం కదరలేదన్నది వాస్తవం. వివాహానంతరం గుమ్మడి గుంటూరు [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో చేరడానికి ఆయనతో వెళ్ళిన పెద్ద వారు. గుమ్మడి కమ్యూనిష్టు భావాలతో ప్రభావితుడై ఉన్నాడని అందువలన కళాశాలలో సీటు ఇవ్వ వద్దని అభర్ధన చేయడం వారికి గుమ్మడి మీద విశ్వాసం కలగలేదన్న దానికి నిదర్శనం. స్వాతంత్ర్య పోరాట వీరుడైన కళాశాల ప్రిన్చిపాల్ తమ విద్యార్థులలో చాలా మందికి రాజకీయప్రవేశం ఉన్నదని తాము వారిని సరి అయిన త్రోవలో నడిపించగలమని పెద్దలకు నచ్చచెప్పి కళాశాలలో చేర్చుకున్నాడు.
 
== వివాహం ==