మాండూక్యోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
::భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ
::యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోకార ఏవ ||1||
::::'''ఆర్థం'''
::::ఈ లోకం ఏవత్తూ ఓంకారమే. ఓంకార వివరణ గమనిద్దాం. గతించినవీ, ఉన్నవీ, రాబోయేవీ అన్నీ ఓంకారమే. మూడుకాలాలకూ అతీతమైనది ఏముందో అది కూడా ఓంకారమే.

Line 31 ⟶ 32:
::జాగరికస్థానో బహిః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః
::స్థూలభుగ్ వైశ్వానరః ప్రథమః పాదః||3||
::::'''ఆర్థం'''
::::ఆత్మలో మొదటి పరిమాణం వైశ్వానరుడు అనబడుతున్నాడు. ఈ వైశ్వానరుడి చైతన్యం బాహ్యముఖంగా ఉంది. 7 అవయవాలు, 19 నోళ్ళుగల వైశ్వానరుడు జాగ్రదావస్థలో బాహ్యజగత్తును అనుభవిస్తాడు.

::స్వప్నః స్థానో న్తః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః
::ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయః పాదః||4||
::::'''ఆర్థం'''
::::ఆత్మయొక్క రెండవ పరిమాణం తైజసుడు అనబడుతున్నాడు. దీని చేతన అంతర్ముఖమైనది. 7 అవ్యవాలు, 19 నోళ్ళుగల తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు.

Line 40 ⟶ 43:
::పశ్యతి తత్ సుషుప్తమ్| సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన
::ఏవానందమయో హ్యాననందభుక్ చేతోముఖః ప్రాజ్ఞస్తృతీయః పాదః||5||
::::'''ఆర్థం'''
::::కోర్కెలు, కలలు ఏదీలేని గాఢనిద్రాస్థితి ఆత్మయొక్క మూడవ పరిమాణమవుతుంది. ఈ స్థితి అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవీ ఉండవు. గ్రహణశక్తి బహిర్గతమై ఒక రాశిగా ఉంటుంది. అందువలన ఇది జాగ్రత్ మరియు స్వప్న స్థితి చేతనలకు ద్వారంగా ఉంది. ఆనంద స్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆంనందాన్ని అనుభవిస్తాడు.

::ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో న్తర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్||6||
::::'''ఆర్థం'''
::::ఇతడే సర్వేశ్వరుడు. ఇతడే సర్వమూ తెలిసినవాడు. ఇతడే అన్ని ప్రాణుల లోపల కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికీ మూల కారణం ఇతడే. ప్రాణుల ఉత్పత్తికి, వినాశనానికీ కూడా ఇతడే కారణం.

Line 48 ⟶ 53:
::అదృష్టమ్ అవ్యవహార్యమ్ అగ్రాహ్యమ్ అలక్షణమ్ అచిన్త్యమ్ అవ్యపదేశ్యమ్
::ఏకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యన్తే స ఆత్మా సి విజ్ఞేయః ||7||
::::'''ఆర్థం'''
::::నాలుగవ పరిమాణం. అది అంతర్ముఖ స్థితి కాదు. బహిర్ముఖ స్థితి కాదు. రెండూ చేరిన స్థితి కాదు. అది చైతన్యం సమకూరిన స్థితి కాదు. అది కనిపించదు. చేతలులేని, గ్రహించశక్యం కాని, గుర్తులు లేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి అది. దాన్ని ఆత్మ చైతన్యంగా మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రాపంచిక చైతన్యం లేదు. అది ప్రశాంతమైనది. మంగళకరమైనది. అద్వైతం. ఇదే నాలుగవ పరిమాణం. ఇదే ఆత్మ. దీన్నే తెలుసుకోవాలి.

::సో యమాత్మా అధ్యక్షరమ్ ఓంకారో ధిమాత్రం పాదా
::మాత్రామాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి ||8||
::::'''ఆర్థం'''
::::ఈ ఆత్మను శబ్దపరంగా చెప్పాలంటే అదే ఓంకారం. అక్షరాలలో అ; ఉ; మ్ అనే మూడు అక్షరాలతో ఓం రూపొందింది.

::జాగరితస్థాలో వైశ్వానరో కారః ప్రథమా మాత్రా ఆప్తేరాదిమత్వాద్ వా
::ఆప్నోతి హ వై సర్వాన్ కామానాదిశ్చ భవతి య ఏవం వేద||9||
::::'''ఆర్థం'''
::::ఓంకార మంత్రం మొదటి భాగమైన అకారం జాగ్రదావస్థ పరిమాణమైన వైశ్వానరునితో పోల్చబడుతుంది. వ్యాపకత్వంచేత, ఆరంభత్వంవల్ల ఈ రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా ఉపాసన చేసినవారి అన్ని కోర్కెలు ఈడేరుతాయి. అట్టి ఉపాసకుడు ధన కనక వస్తు వాహనాదులతో అగ్రగణ్యుడౌతాడు.

::స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయా మాత్రా ఉత్కర్షాదుభయత్వాద్ వా ఉత్కర్షతి
::హ వై జ్ఞానసన్తతిం సమానశ్చ భవతి నాస్యాబ్రహ్మవిత్ కులేభవతి య ఏవం వేద||10||
::::'''ఆర్థం'''
::::ఓంకార మంత్ర రెండవ భాగమైన ఉకారం స్వప్నావస్థను ఆధారంగా చేసుకున్న తైజసుడు. ఎందుకంటే శ్రేష్ఠత్వంచేత, రెండింటి సంబంధంచేత రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. సుఖ-దుఃఖాలవంటి ద్వంద్వాలలో సమతుల్యంతో వ్యవహరిస్తాడు. జ్ఞానికానివారు ఎవరూ అతని వంశంలో జన్మించరు.

::సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకారస్తృతీయా మాత్రా మితేరపీతేర్వా మినోతి
::హ వా ఇదం హ వాఇదం సర్వమపీతశ్చ భవతి య ఏవం వేద||11||
::::'''ఆర్థం'''
::::ఓంకార మంత్రం మూడవభాగమైన మకారం సుషుప్తిని ఆధారంగా చేసుకున్న ప్రాజ్ఞుడు. ఎందుకంటే కొలతవేసే స్వభావంచేతా, గ్రహించే స్వభావంచేతా రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు సమస్తాన్నీ కొలతవేసేవాడుగా గ్రహించేవాడుగా అవుతాడు.

::అమాత్రశ్చతుర్థోవ్యవహార్యః ప్రపంచోపశమః శివో ద్వైత ఏవమోంకార ఆత్మైవ
::సంవిశత్యాత్మనా త్మానం య ఏవం వేద య ఏవం వేద ||12||
::::'''ఆర్థం'''
::::ఓంకార మంత్రంలో నాలుగవ భాగం, భాగమని చెప్పలేనిది. నిర్వికారమైనది, ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది. మంగళకరమైనది. అద్వైతం. ఈ ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మచేత పొందుతాడు.

"https://te.wikipedia.org/wiki/మాండూక్యోపనిషత్తు" నుండి వెలికితీశారు